News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gruhalakshmi August 26th: దివ్య గ్రేట్ అని మెచ్చుకున్న విక్రమ్- కక్కలేక మింగలేక తిప్పలు పడుతున్న రాజ్యలక్ష్మి

విక్రమ్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దివ్య భర్త మీద ప్రేమ చూపించాలని చూస్తుంది కానీ తను మాత్రం విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నదానివి అనవసర జోక్యం చేసుకోవద్దని అరుస్తాడు.

దివ్య: నీ భార్యగా నేను నీకు ఆర్డర్స్ వేయడం లేదు. బాధ్యతలు గుర్తు చేస్తున్నా. అత్తయ్య కాలు బెణికి నడవలేని స్థితిలో ఉన్నారు. పైగా జాతకం ప్రకారం ప్రాణ గండం. ఇక సంజయ్ దీక్షలో ఉన్నాడు. హాస్పిటల్ ఎవరు చూసుకుంటారు

విక్రమ్: నువ్వు ఉన్నావ్ గా చూసుకో

దివ్య: నేను పరాయిదాన్ని కదా

విక్రమ్: సమస్య వచ్చిందని అడ్డం పెట్టుకుని ఆడుకోకు. ఈ ఇంట్లో ఉండి మా తిండి తింటున్నావ్ అమ్మ వచ్చేవరకు హాస్పిటల్ చూసుకోలేవా?

దివ్య: ఉత్తమమైన ఆశయంతో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. దాన్ని అత్తయ్య కొనసాగించారు. ఇప్పుడు ఆ బాధ్యతని నువ్వు తీసుకోవాలి. లేదంటే అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయి. ఛైర్మన్ గా నువ్వే బాధ్యతలు తీసుకోవాలి

Also Read: వేద ప్రెగ్నెన్సీ తెలుసుకున్న మాలిని- తన వంటతో అందరినీ భయపెట్టేసిన యష్

విక్రమ్: ఆ పని ఏదో నువ్వే చెయ్యి అమ్మ ఫోన్లో ఎలా చేయాలో చెప్తుంది

దివ్య: ఈ అమ్మ కూచీని ఒప్పించడం చాలా కష్టం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడుతుంది.

ఇక నందు కొత్త డ్రెస్ వేసుకుని రెడీ అయిపోతాడు. ఏంటి కొత్తగా కనిపిస్తున్నావని అనసూయ అడుగుతుంది. నందుని చూసి తులసి కూడా ఆశ్చర్యపోతుంది. శ్రావణమాసం మొదలైంది కదా అని ఏవేవో మాట్లాడి గుడికి రమ్మని అమ్మానాన్నని పిలుస్తాడు. తులసిని పంపించమని తల్లికి సైగ చేస్తాడు. దీంతో అనసూయ తెలివిగా తులసి తోడుగా వస్తుందిలే అని అంటుంది. గుడికి అనేసరికి తులసి మౌనంగా తల ఊపి బయల్దేరుతుంది.

లక్కీ వచ్చి కడుపు నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటాడు. తనకోసం మీరు గుడికి వెళ్ళకుండా ఆగవద్దు అని చెప్పి డ్రామా మొదలుపెడతాడు. లాస్య రాజ్యలక్ష్మి దగ్గరకి వస్తుంది. లక్కీ నందు ఇంట్లో లాక్ అయిపోయాడు, తనని మాత్రం రానివ్వడం లేదని వాపోతుంది. ఎట్టి పరిస్థితిలోనైనా ఆ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటుంది.

లాస్య: నీ పరిస్థితి ఏంటి? దివ్య ఏమంటుంది

రాజ్యలక్ష్మి: నాకాళ్ళు విరగ్గొట్టి పండగ చేసుకుంటుంది. ఇంటిని హాస్పిటల్ గా చేసి దున్నేస్తుంది, కనీసం ఇప్పుడైనా చెప్పు ఏం చేయమంటావో

బసవయ్య: తన ముక్కు తుడుచుకోలేని ఆమె నీ సమస్యకి పరిష్కారం చెప్తుందా?

లాస్య: అందుకే నేను ఈ ఇంటికి రావడం లేదు. నా దగ్గర కంటే మంచి సలహాలు నీ దగ్గర ఉంటే చెప్పొచ్చు కదా. నువ్వు ఇచ్చేవి బోడి సలహాలు కాబట్టి పట్టించుకోవడం లేదు. రేపో మాపో తులసి ఇంట్లో అడుగుపెట్టడం గ్యారెంటీ అప్పుడు దివ్య తగ్గుతుంది. అప్పుడు దివ్య, విక్రమ్ ని దూరం చేయడం తేలిక. ఓపికగా వెయిట్ చేయండి

నందు, తులసి గుడికి వచ్చి పూజ చేయమని పూజారిని అడుగుతుంది. పంతులు ఇద్దరినీ భార్యాభర్తలుగా భావించి పూజ చేస్తాడు. ఇలా జరిగింది ఏంటని తులసి ఇబ్బందిగా వెళ్లిపోతుంటే నందు ఆపుతాడు. విక్రమ్ తండ్రిని వీల్ చైర్ లో నుంచి నిలబెట్టి పట్టుకుని కాసేపు నడిపిస్తాడు. దివ్య చాటుగా అదంతా గమనిస్తుంది. హాస్పిటల్ బాధ్యతలు తీసుకోమని మావయ్య ద్వారా రాయబారం పంపుతుంది.

ప్రకాశం: ఎందుకు హాస్పిటల్ విషయాలకి దూరంగా ఉంటున్నావ్

విక్రమ్: దివ్య చెప్పిందా?

Also Read: అపర్ణ అహంకారం, కళావతిని వెలివేసిన కుటుంబం- కావ్య బ్యాగ్ పట్టుకుని రాజ్ ఎంట్రీ

ప్రకాశం: అవును పట్టించుకోవాల్సిన నువ్వు వదిలేసి తిరుగుతున్నావ్. నీ మనసులో ఏముందో చెప్పు

విక్రమ్: ఎవరు ఏ పనికి అర్హులో అదే చేయాలి. నాకు చదువు లేదు హాస్పిటల్ బాధ్యతలు మోసే తెలివి లేదు

ప్రకాశం: మంచితనం మానవత్వంతో పాటు నీకు తెలివి కూడా ఉంది. చదువు లేని లోటు తీర్చడానికి నీ పక్కన దివ్య ఉంది

విక్రమ్: పరాయి వాళ్ళ మీద ఆధారపడమంటావా

ప్రకాశం: దివ్య నీకు ధైర్యాన్ని ఇస్తుంది కదా ఎందుకు భయపడుతున్నావ్. తను తెలివైనది కాదా? తన మీద నమ్మకం లేదా? మీ మనస్పర్థలు పక్కన పెట్టి హాస్పిటల్ పట్టించుకో. మీరు ఎవరు లేకపోయేసరికి మేనేజర్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అక్కడ జరిగే తప్పులు మీ అమ్మ దృష్టికి వెళ్ళకుండా చేయాలని దివ్య ఆలోచన. కోడలిగా తను అంతగా ఆలోచిస్తుంటే నువ్వు ఇంకెంత తపన పడాలి. నిన్ను హాస్పిటల్ ఛైర్మన్ చేసింది దాన్ని సరిగా చూసుకుంటావని దయచేసి పట్టించుకో అనేసి చేతులు జోడిస్తాడు  

విక్రమ్: దివ్యతో కలిసి హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటానని మాట ఇస్తున్నా

తరువాయి భాగంలో..

విక్రమ్ హాస్పిటల్ కి వస్తాడు. స్టాఫ్ మొత్తం విక్రమ్ కి స్వాగతం చెప్తారు. ఇక నుంచి హాస్పిటల్ లో పని చేసే స్టాఫ్ కుటుంబం మొత్తానికి మన హాస్పిటల్ లో ఫ్రీగా వైద్యం చేయిస్తామని విక్రమ్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి అది విని షాక్ అవుతుంది. తులసిని సాయం అడిగిన నర్స్ మీరు దేవత అనేసి రాజ్యలక్ష్మి కాళ్ళ మీద పడుతుంది. దివ్య తీసుకున్న నిర్ణయాల వల్ల అమ్మకి ఎంత మంచి పేరు వచ్చిందని విక్రమ్ మనసులో సంతోషపడతాడు.

Published at : 26 Aug 2023 09:56 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial August 26th Update

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Telugu 7: నిన్న గౌతమ్, నేడు యావర్ - ఏంటి ‘బిగ్ బాస్’ అలా చేశావ్, పవర్ అస్త్ర రేసులో శోభ, ప్రియాంక

Bigg Boss Telugu 7: నిన్న గౌతమ్, నేడు యావర్ - ఏంటి ‘బిగ్ బాస్’ అలా చేశావ్, పవర్ అస్త్ర రేసులో శోభ, ప్రియాంక

Yavar- Shobha Shetty: అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Yavar- Shobha Shetty: అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?