Gruhalakshmi August 10th: ‘గృహలక్ష్మి’ సీరియల్: అత్తని దెబ్బకొట్టిన దివ్య- హాస్పిటల్ కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న తులసి
దివ్య తిరిగి అత్తారింట్లో అడుగుపెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
హాస్పిటల్ లో జాయిన్ అయ్యేందుకు ఒప్పుకున్నందుకు దివ్య విక్రమ్ కి థాంక్స్ చెప్తుంది. అది నీకోసం కాదు మా అమ్మ కోసం చేశాను. తనకి చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం చేశాను. నువ్వు ఎక్కువ ఊహించుకొకని కఠినంగా చెప్తాడు. ఎప్పటికైనా ఇద్దరి మధ్య ఉన్న అడ్డు తెర తీసేలా చేస్తానని దివ్య మనసులో అనుకుంటుంది. ఇక నందు తులసి బైక్ చూసి మురిసిపోతూ దాన్ని తుడుస్తాడు. అది చూసి తులసి కోపంగా ఏం చేస్తున్నారని కోపంగా అరుస్తుంది. ఇద్దరూ కాసేపు మాటలు లాంటి కొట్లాడుకుంటారు. తులసి వద్దని చెప్పినా కూడా నందు వినకుండా దాన్ని క్లీన్ చేస్తాడు. అన్నీ వంకరగా మాట్లాడతాడు. ఈ భాగోతం అంతా పరంధామయ్య దొంగ చాటుగా చూసి కొడుక్కి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. కానీ తులసి మాత్రం ఇలాంటి పనులు చేయవద్దని తెగేసి చెప్తుంది.
క్యాంటీన్ కాంట్రాక్ట్ కి ఒక్కరూ కూడా ముందుకు రాకుండా చేయమని రాజ్యలక్ష్మి సంజయ్ కి చెప్తుంది. అవును అదే జరిగితే ఆ క్రెడిట్ అంతా దివ్యకి పోతుందని లాస్య రెచ్చగొడుతుంది.
Also Read: నందుకి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్న పరంధామయ్య- రాజ్యలక్ష్మి కోటలోకి తులసి అడుగుపెట్టగలుగుతుందా?
సంజయ్: మాణిక్యాన్ని కాదని ఎవరూ టెండర్ వేయడానికి ముందుకు రారు అనేసి హాస్పిటల్ ముందు రౌడీలను చూపిస్తాడు
రాజ్యలక్ష్మి: ఇక దివ్య పని అయిపోయింది. విక్రమ్ కూడా మన మాట వింటాడు
విక్రమ్ హాస్పిటల్ కి వచ్చి టెండర్ కోసం ఎవరూ రాలేదు ఏంటని తల్లిని అడుగుతాడు. అసలు క్యాంటీన్ కాంట్రాక్ట్ టెండర్ కి సంబంధించి పార్టీలకు మెయిల్ వెళ్ళిందా లేదా అని దివ్య అనుమానంగా అడిగితే సంజయ్ అందుకే మెయిల్ పంపినట్టుగా రుజువు కోసం ప్రింటవుట్ తీశానని చూపిస్తాడు. హాస్పిటల్ బయట రౌడీలని చూసి మేనేజర్ కంగారుగా విక్రమ్ దగ్గరకి వస్తాడు. టెండర్ కోసం వచ్చిన వాళ్ళని రౌడీలు బెదిరించి వెనక్కి పంపిస్తున్నట్టు మేనేజర్ చెప్తాడు.
విక్రమ్: అసలు ఏంటి వాడు ఇదేమైన వాడి జాగీర్ అనుకుంటున్నాడా? ఇప్పుడే వాడి అంతు తేలుస్తాను
సంజయ్: వాడికి మంచి మర్యాదలు లేవు తెగించి ఏమైనా చేస్తాడు
దివ్య: అలాంటప్పుడు మన హాస్పిటల్ లో క్యాంటీన్ వద్దు పేషెంట్స్ ని వాళ్ళ ఫుడ్ వాళ్ళని తీసుకోమని చెప్పేద్దాము
సంజయ్: మాణిక్యం నాణ్యంగా ఉన్న ఫుడ్ ఇస్తున్నాడు కదా
దివ్య: హాస్పిటల్ కి చెడ్డ పేరు వచ్చినా పర్లేదు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి
సంజయ్: ఒకసారి వాడిని ఎదిరించినందుకు నా బైక్ యాక్సిడెంట్ చేయించాడు చచ్చి బతికాను
అప్పుడే హాస్పిటల్ దగ్గరకి నందు, తులసి వాళ్ళు వస్తారు. రౌడీలు వాళ్ళని పిలిచి ఎక్కడికని అంటారు. క్యాంటీన్ నడపడానికి టెండర్ వేయడానికి వచ్చామని తులసి చెప్తుంది. భయపడి పారిపోవడానికి ఇక్కడికి రాలేదని తనకి చాలా ఇన్ఫ్లూయెన్స్ ఉందని తులసి రౌడీలని బెదిరించి మరీ లోపలికి వెళ్తుంది. నర్స్ గృహలక్ష్మి కిచెన్ విజిటింగ్ కార్డ్ తీసుకొచ్చి సంజయ్ కి ఇస్తుంది. అది చూసి షాక్ అవుతాడు. పిలిచే వరకు వెయిట్ చేయమని రాజ్యలక్ష్మి అంటే గుండాలని ఎదిరించి లోపలికి వచ్చారంటే వాళ్ళకి కళ్ళు మూసుకుని కాంట్రాక్ట్ ఇద్దామని విక్రమ్ చెప్తాడు. వెంటనే వాళ్ళని రమ్మని విక్రమ్ పిలుస్తాడు. కాంట్రాక్ట్ కోసం వచ్చిన తులసి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు.
విక్రమ్: వీళ్ళకి మెయిల్ పంపించావా?
సంజయ్: లేదు అన్నయ్య
విక్రమ్: పిలవకుండ వచ్చారు ఏంటి?
తులసి: మాకు కేఫ్ ఉంది. హాస్పిటల్ నడపడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఎటువంటి కంప్లైంట్ రాకుండా ఫుడ్ అందించగలము
విక్రమ్: మీ టెండర్ కి నేను ఒప్పుకోను
Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్
తులసి: కారణం తెలుసుకోవచ్చా
రాజ్యలక్ష్మి: బిజినెస్ లో బంధాలకు చోటు ఇవ్వడం వల్ల కోరి కష్టాలని కొని తెచ్చుకున్నట్టే
విక్రమ్: మనం నచ్చనప్పుడు మనతో సంబంధం నచ్చనప్పుడు క్యాంటీన్ తో కాంట్రాక్ట్ కి పనికి వస్తామా?
తులసి: చూడండి సర్ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడికి రాలేదు. మా నిజాయితీ గురించి ఎవరూ సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. మన మధ్య ఉన్న కుటుంబ పరమైన సమస్య గురించి డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు
అప్పుడే నర్స్ వచ్చి క్యాంటీన్ లో ఫుడ్ లేదని పేషెంట్స్ గొడవ చేస్తున్నారని చెప్తుంది. కాస్త ఓపిక పట్టమని క్యాంటీన్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయ్యిందని చెప్పమని విక్రమ్ అంటాడు.
రేపటి ఎపిసోడ్లో..
నందు తులసికి ఇష్టమైన మనసుకి నచ్చిన గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి తులసి మురిసిపోయి మాజీ మొగుడికి థాంక్స్ చెప్తుంది. ఇక విక్రమ్ దివ్య మీద అరుస్తాడు. ఇప్పటికీ దివ్యని ఆరాధిస్తున్నానని చెప్తాడు. బంధం విలువ తెలిసిన దాన్ని అసలు నిజం నిరూపించే వరకు తల దించుకునే ఉంటానని దివ్య సమాధానం ఇస్తుంది.