అన్వేషించండి

Ennenno Janmalabandham January 11th: సరిగంగ స్నానాలాడిన దంపతులు- మనసులో ఫీలింగ్స్ బయటపెట్టిన యష్

వేద, యష్ తన అమ్మమ్మ ఊరికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్, వేదని తీసుకుని రాజా వాళ్ళు గుడికి వస్తారు. ప్రతి ఏడాది మేము చేసే అన్యోన్య దాంపత్య వ్రతం ఈసారి మా మనవడు, మనవరాలు చేస్తున్నారని రాణి చెప్తుంది. గుడిలో వేద ఫోటో దిగుతుంటే రాజా నువ్వు వెళ్ళి మిమ్మల్ని నేను ఫోటో తీస్తాను అని యష్ తో చెప్తాడు. ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఫోటో దిగుతారు. యష్ వేద భుజం మీద చెయ్యి వేసేసరికి మురిసిపోతుంది. దేవుడి అనుగ్రహం కోరుతూ ఆశీర్వదించమని ప్రార్దిస్తూ చేయాలని రాజా చెప్తాడు. తులసి మాలతో ముందుగా దేవుడికి పూజ చేయాలని చెప్తాడు. అన్యోన్య దాంపత్య వ్రతం చాలా విశేషమైనదని పూజారి అంటాడు. ఇది చేయడం వల్ల దంపతుల మధ్య ఉన్న చికాకులు, ఇబ్బందులు తొలగిపోయి నిండు నూరేళ్ళు అన్యోన్యంగా దాంపత్యం కొనసాగిస్తారు. అదే ఈ వ్రత ఫలం, స్వామి వారి ఆశీస్సు అని చక్కగా చెప్తారు.

Also Read: సామ్రాట్ ఎప్పుడో తన భర్త అయ్యాడన్న తులసి- నందుని సత్తు రూపాయిగా కూడా పనికి రావన్న లాస్య

ఈ వ్రతం చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరి వల్ల అన్యోన్యంగా ఉంటారని రాజా అంటాడు. ఈ వ్రతం వల్ల తమ మధ్య ఉన్న దూరం తొలగిపోవాలని వేద మనసులో కోరుకుంటుంది. ఈ వ్రతం కేవలం వేద కోసమే చేస్తున్నా, తను అనుకున్నది జరగాలి, తను సంతోషంగా ఉండటం తప్ప ఇంకేమీ వద్దని, తను ఆనందంగా ఉండేలా చూడమని యష్ మనసులో దేవుడిని వేడుకుంటాడు. వ్రత కార్యక్రమం మొదలవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటిగా చేరి చేయాలని పూజారి చెప్తాడు. పవిత్ర కోనేటి స్నానం చేయాలని చెప్పేసరికి యష్ బిక్కమొహం వేస్తాడు. అది ఆలయ సంప్రదాయం అని పూజారి అనేసరికి తప్పదు అన్నట్టు వేద యష్ కి సైగ చేస్తుంది. ఇక చేసేది ఏమి లేక యష్ సరే అంటూ నవ్వుతూ మొహం పెడతాడు.

కోనేటి స్నానం చేయడానికి యష్ ఇబ్బంది పడుతుంటే వేద ఆపేస్తాను అంటుంది. వద్దు నేను ఏం చేసిన నీ సంతోషం కోసమే చేస్తాను అని అంటాడు. ఇద్దరూ కలిసి కొనేటిలోకి దిగుతారు. విడివిడిగా కోనేటిలో మునగబోతుంటే అలా కాదు ఇద్దరూ జంటగా ఒకరినొకరు పట్టుకుని స్నానం చేయాలని చెప్తారు. ఇదేదే వింతగా ఉంది అని యష్ అంటాడు. అబ్బాయి మొహమాట పడుతున్నాడు భార్యగా నువ్వే చొరవ తీసుకో అని రాణి సలహా ఇస్తుంది. ఇది అన్యోన్య దాంపత్య వ్రతం అంటే ఇద్దరూ కలిసి ఒక్కటిగా చేసేది సరిగంగ స్నానం అంటారు కదా అదే చేయాలని రాజా చెప్తాడు. దీంతో వేద, యష్ ఒకరినొకరు పట్టుకుని కోనేటిలో మూడు సార్లు మునుగుతారు. ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ జరుగుతుంది.

Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?

ఇద్దరికీ కొత్త బట్టలు ఇచ్చి వేసుకుని రమ్మని చెప్తారు. సంప్రదాయ దుస్తుల్లో యష్ చాలా అందంగా ఉన్నాడని వేద మనసులో అనుకుంటుంది. ఒకరినొకరు కన్నార్పకుండా చూసుకుంటూ ఉంటారు. ఈరోజు వేదని చూస్తుంటే కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తుందని యష్ మనసులో అనుకుంటారు. ఒకరికొకరు స్పెషల్ గా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు.

తరువాయి భాగంలో..

యష్ తన మనసులో భావాన్ని వేదతో పంచుకుంటాడు. ఎప్పుడు లేనిది ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నా మనసు కొత్తగా ఆలోచిస్తుంది. ఇక్కడి అభిమానాలు ఆత్మీయత చూశాక మన మధ్య ఉంది ఒప్పందం కాదు అంతకమించి ఇంకేదో ఉందని అనిపిస్తుందని యష్ అంటాడు. ఆ మాటకి వేద చాలా సంతోషంగా ఉంటుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget