Ennallo Vechina Hrudayam Serial Today May 3rd: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల చంపింది గాయత్రీ, త్రిపురల తండ్రినే అని తెలుసుకున్న అనంత్.. గాయత్రీ పగ పడుతుందా!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ తండ్రినే బాల యాక్సిడెంట్ చేశాడని అనంత్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీ కోసం అనంత్‌ని తీసుకొని బాల త్రిపుర ఇంటికి వెళ్తాడు. గాయత్రీకి సారీ చెప్పమని బాల అనంత్‌తో చెప్తాడు. దానికి గాయత్రీ అక్క నాకు ఎవరి సారీలు అవసరం లేదు నా కోసం ఎవరూ రానవసరం లేదని చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. తాతగారు త్రిపురకు వెళ్లి సర్దిచెప్పమని అంటారు.
బాల త్రిపురని ఆపి అనంత్ నువ్వే గాయత్రీని కోప్పడి అరిచి పంపేశావు కదా నువ్వే వెళ్లి బతిమాలు అంటాడు. అనంత్ సారీ చెప్పి గాయత్రీకి డోర్ తీయమని బతిమాలుతాడు. మీ సారీ నాకు అవసరం లేదని గాయత్రీ అంటుంది. నిజా నిజాలు తెలీకుండా నన్ను కొట్టారు కదా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారని అంటుంది. దానికి బాలా అనంత్ గాయత్రీని నిన్ను గట్టిగా కొట్టమని చెప్పమని అంటాడు. గాయత్రీ తాను రాను అని మళ్లీ ఏ కారణంతో నన్ను కొడతారో ఏ కారణంతో గెంటేస్తారో నేను రాను అని అంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని తెలిసింది అందుకే వచ్చానని అనంత్ అంటే నేను తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా మీరు విన్నారా నేను రాను అంటే నేను రాను అని మారాం చేస్తుంది.
త్రిపుర, బాల అందరూ గాయత్రీని పిలుస్తారు. నువ్వు బయటకు రాకపోతే నా మీద ఒట్టే అని త్రిపుర అనడంతో వెంటనే గాయత్రీ బయటకు వచ్చి ఒట్టు వేయడం ఏంటి అక్క అని అంటుంది. అనంత్ సారీ చెప్తాడు. సారీని యాక్సెప్ట్ చేయ్ గాయత్రీ అని బాల చెప్తాడు. గోడ కుర్చీ వేయ్ వంద గుంజీలు తీయ్ అని బాల అంటే గాయత్రీ వద్దని అంటుంది. ఇక త్రిపుర నిజం ఎలా తెలిసిందని అడిగితే బాల టాకింగ్ టామ్ చూపించి ఇది నిజం చెప్పిందని అంటుంది. బాల మళ్లీ దాన్ని ప్లే చేస్తాడు. బాలకి త్రిపుర, గాయత్రీ థ్యాంక్స్ చెప్తారు. నీ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు అనంత్ని క్షమించాలి అని బాల అంటాడు. దాంతో గాయత్రీ నవ్వేస్తుంది.
గాయత్రీని ఇంటికి వెళ్దామని అనంత్, బాల పిలుస్తారు. గాయత్రీ బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఇక గాయత్రీ బ్యాగ్ అనంత్ తీసుకుంటాడు. తర్వాత గాయత్రీ తన తండ్రి ఫొటో దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. అనంత్ గాయత్రీ తండ్రిని చూసి షాక్ అయిపోతాడు. బాల యాక్సిడెంట్ చేయడం వల్లే గాయత్రీ తండ్రి చనిపోయాడని అనంత్ గుర్తు చేసుకొని షాక్ అయిపోతాడు. గాయత్రీ తండ్రి ఫొటో తీసుకొచ్చి నాన్న ఫోటో నాతో తీసుకెళ్తా అక్క అంటుంది. త్రిపుర సరే అంటుంది. పాండు రంగారావుగారి కూతుళ్లా వీళ్లు అని అనంత్ అలా ఉండిపోతాడు. గాయత్రీ వాళ్లు ఇంటికి వెళ్తారు.
వాసుకి ప్లాన్ వేస్ట్ అయిపోయిందని నాగభూషణం, వాసుకి,ఫణిలు తిట్టుకుంటారు. గాయత్రీకి యశోద క్షమాపణ చెప్తుంది. తప్పుగా అర్థం చేసుకున్నాం మమల్ని క్షమించు అని అంటుంది. అత్తయ్య నేను మిమల్ని క్షమించడం ఏంటి అని గాయత్రీ అంటుంది. గాయత్రీ యశోదతో మీరు ఆ రోజు అత్తగా చెప్తున్నా అమ్మగా చెప్తున్నా అన్నారు మరి అమ్మ ఏ బిడ్డకు అయినా క్షమాపణ అడుగుతుందా అని గాయత్రీ అంటుంది. దాంతో యశోద గాయత్రీని హగ్ చేసుకుంటుంది. బామ్మ కూడా మేం చాలా తప్పు చేశామమ్మా అంటుంది. దానికి గాయత్రీ మీరు పెద్దవాళ్లు మీకు అనే హక్కు ఉందని నేనేం అనుకోవడం లేదని అంటుంది.
అనంత్ డల్‌గా ఉండటం చూసి బామ్మ అడుగుతుంది. బాల పిన్ని, బాబాయ్లతో గాయత్రీకి సారీ చెప్పిస్తాడు. ఇక బాల కడుపులో రాట్స్ రన్నింగ్ చేసేస్తున్నాయ్ గాయత్రీ తొందరగా టిపెన్ చేయ్ అంటాడు. ఒక్క నిమిషం అనుకొని గాయత్రీ వెళ్తుంది. పాండురంగారావు చావుని గుర్తు చేసుకొని అనంత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రాత్రి త్రిపుర కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తాతయ్య అక్కడికి వెళ్తారు. ఏమైందని అడుగుతారు. గాయత్రీ కోసం దాని ప్రేమ కోసం అన్నీ చేశావ్ కానీ నువ్వు చేయాల్సిన ఇంకో పని ఉందమ్మా వాళ్లిద్దరికీ కార్యం చేయించాలమ్మా.. అని చెప్తారు. రేపు పంతులుతో మాట్లాడుదామని అంటారు. ఊర్వశి, రమాప్రభలు మాట విని దానికి ఫస్ట్ నైట్ అవ్వకుండా చేద్దాం దానికి సంతోషం లేకుండా చేద్దామని అనుకుంటారు.
గాయత్రీ అనంత్‌కి తన తండ్రి ఫొటో చూపించి మీరు మా నాన్నని ఎప్పుడూ చూడలేదు కదా ఇదిగో మా నాన్న మా నాన్న మమల్ని ప్రాణంగా చూశారని తండ్రి గురించి చెప్తుంది. ఈ ఫొటో మన గదిలో పెట్టుకుంటా అని అడుగుతుంది. అనంత్ సరే అంటాడు. గాయత్రీ ఫొటో పెట్టగానే అది కింద పడిపోతుంది. ఇంతలో బాల పట్టుకొని పాండురంగా రావుగారిని నేను భలే సేవ్ చేశాను కదా గాయత్రీ అంటాడు. గాయత్రీ థ్యాంక్స్ చెప్తుంది. మా నాన్న బతికుంటే కల్మషం లేని బావగారిని మీ మంచి కుటుంబాన్ని చూసి చాలా సంతోషపడే వారు అని అనుకుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్ నేను అయినందుకు మా నాన్న ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని అంటుంది. మీ నాన్న చనిపోవడానికి మీకు ఆ గతి పట్టడానికి మా అన్నయ్య మా కుటుంబమే కారణం అని తెలిస్తే నువ్వు ఊరుకుంటావా గాయత్రీ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!





















