Ennallo Vechina Hrudayam Serial Today March 5th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: నాగాంభరి పుష్పం వల్ల బాలకు పూర్వ వైభవం వస్తుందా.. అనంత్‌కి పెద్ద షాక్!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర నాగాంభరి పుష్పం తేవడం బాలకి వైద్యం చేయడంతో బాల మెంటల్ కండీషన్ కూడా సెట్ అవుతుందని గురువుగారు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర నాగసాధువు చెప్పిన మంత్రం విని, కాలపత్ర గ్రంధం పట్టుకొని నాగాంభరి పుష్పం గురించి వెళ్తుంది. త్రిపుర ఆ మార్గం గుండా వెళ్తూ ఓ రాయిని తన్నేసి పడిపోతుంది. అప్పుడు భస్మం ఎగిరి నాగాంభరి పుష్పం ఉన్న లోకంలో ఓ పెద్ద చెట్టుకు తగులుతుంది. అక్కడ విపరీతంగా పాములు ఉంటాయి. చెట్టు మొత్తం పాములే ఉంటుంది. భస్మం పడటంతో పాములు ఏం చేయవు. త్రిపుర పడి దొర్లుతూ శివలింగం ముందు పడుతుంది.
శివలింగం చూసి తన వెంట తెచ్చుకున్న భస్మం శివలింగం మీద పడేలా చేస్తుంది. ఇక నాగాంభరి పుష్పానికి కాపలా ఉన్న శివనాగు తనని కాటేయడానికి వస్తే త్రిపుర శివ మంత్రం పటిస్తుంది. దాంతో పాము ఏం చేయదు. శివలింగం దగ్గర నాగాంభరి పుష్పం కనిపిస్తుంది. దాన్ని తీసుకొని త్రిపుర బయల్దేరుతుంది.. మార్గమధ్యంలో త్రిపురని కొందరు స్వాముల గెటప్‌లో ఉన్న రౌడీలు ఆపి ఆ పుష్పం ఇవ్వమని అంటారు. మరోవైపు బాల శరీరం నీలిరంగులోకి మారిపోతుంది. సూర్యస్తమయం దగ్గర పడుతుందని బాల బతకడు అనుకొని అతని పరిస్థితి బాల కుటుంబానికి చెప్పాలని గురువుగారు అనుకుంటారు.
త్రిపురను రౌడీలు వెంబడిస్తారు. తప్పించుకునే ప్రయత్నం చేయగా పట్టుకొని త్రిపుర దగ్గర పువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే నాగసాధువులు వచ్చి దుష్ట శిక్షణ నాగ సాధువుల కర్తవ్యం అని త్రిపురని వెళ్లమని చెప్తారు. రౌడీలను చితక్కొడతారు. బాల కండీషన్ గురించి అందరూ టెన్షన్ పడతారు. బామ్మ, యశోద గుండెపగిలేలా ఏడుస్తారు. నాగభూషణం, వాసుకిలు బాల ఇక దక్కడా అని ఏడుస్తారు. ఇంతలో గురువుగారు వచ్చి నన్ను క్షమించండి బాలని కాపాడలేకపోతున్నా.. ఏ క్షణంలో అయినా బాల కన్ను మూయోచ్చని గురువుగారు చెప్తారు. దాంతో బామ్మ కన్నయ్య అని పెద్దగా అరుస్తు గుండె పట్టుకొని కూలబడిపోతుంది. మరోవైపు త్రిపుర పుష్పం తీసుకొచ్చి గురువుగారికి ఇస్తుంది. గురువుగారు సాధించావు తల్లీ అని ఆ పుష్పం లేహ్యంతో బాలకు వైద్యం చేస్తారు. దాంతో బాలలో మార్పు వస్తుంది. నీలంగా ఉన్న ఒళ్లంతా తెల్లగా మాములుగా మారిపోతుంది. మందు పని చేసిందని నువ్వు లేకపోతే బాల బతికేవాడు కాదని సాధించావని గురువుగారు త్రిపురతో చెప్తారు. త్రిపుర బాల చేతి కట్టు విప్పుతుంటే బాల త్రిపుర చేయి పట్టుకుంటాడు. త్రిపుర బాల చేతిని విడిపించి పక్కను పెట్టి బాల తల నిమిరి వెళ్లిపోతుంది.
ఇక గురువుగారు బాల కుటుంబంతో మీ మనవడి ప్రాణాపాయం తప్పిందని చూడటానికి పిలుస్తారు. అందరూ చాలా సంతోషిస్తారు. మీ రుణం తీర్చుకోలేని అందరూ గురువుగారికి దండం పెడితే బాలని కాపాడింది మేం కాదమ్మా త్రిపుర అనే అమ్మాయి. మా ఇంటి దేవత ఎక్కడుందని యశోద అడిగితే తనకు రేపు పెళ్లి ఉందని అంటారు. బాలకి నాగాంభరి పుష్పంతో వైద్యం కావడం వల్ల 24 గంటల్లో మామూలు మనిషి అయిపోతాడని చెప్తారు. బాల మామూలు మనిషిగా మారితే ప్రమాదమని నాగభూషణం వాళ్లు కంగారు పడతారు. ఇక రౌడీలు గిరితో జరిగింది అంతా చెప్తారు. నా మాట కాదని బాలని కాపాడిందా అని గిరి కత్తి తీసి బాలని తన మరదలి ముందు చంపేస్తా అని బయల్దేరితే రత్నమాల ఆపుతుంది. రేపే పెళ్లి పెట్టుకొని ఇవన్నీ ఎందుకు అని ఆపేస్తుంది.
అనంత్ ఓ రెస్టారెంట్‌లో కూర్చొని గాయత్రీ ఫోటో చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు గాయత్రీ గురించి మాట్లాడుతారు. గాయత్రీకి తనకు నిశ్చితార్థం అయిందని ఫోటో చూపిస్తాడు. అనంత్ చూసి తను ప్రేమించిన గాయత్రీని చూసి షాక్ అవుతాడు. గాయత్రీకి ఇతనితో పెళ్లా నిశ్చితార్థం అయిపోయిందా ఏంటో ఇప్పుడే తేల్చాలి అని వెళ్తాడు. అదంతా ఊర్వశి చేయించుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















