Ennallo Vechina Hrudayam Serial Today February 1st: ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలని కాటేసిన సుందరి స్వీట్ పాము.. సినిమా తరహాలో గాయత్రీకి అనంత్ ప్రపోజల్
Ennallo Vechina Hrudayam Today Episode సుందరి పేరు మీద బాలకి గిరి స్వీట్ బాక్స్‌లో పాము పెట్టి పంపడం అది బాలని కాటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode అమ్మవారికి బాల వేసిన దండలో నగ చూసిన త్రిపుర మనసులో అమ్మా మా గండం తొలగించడానికి నువ్వే నగని బాల ద్వారా నీ దగ్గరకు తెప్పించుకున్నావని దండం పెట్టి వెళ్లిపోతుంది. ఇక పంతులు దండలో నగ చూసి అమ్మా అద్భుతం నీ నగని నీ దగ్గరకే తీసుకొచ్చావా తల్లీ అని బాల కుటుంబానికి విషయం చెప్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. పంతులు నగని అమ్మవారికి వేసి పూజ చేస్తారు. బాల పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.
బాల వాళ్లు వెళ్లిపోయిన తర్వాత త్రిపుర వాళ్లు అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేస్తారు. త్రిపుర, గిరి పంతులు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక రాత్రి గాయత్రీ అనంత్ రమ్మని చెప్పిన లొకేషన్‌కి వెళ్తుంది. గాయత్రీని ఊర్వశి ఫాలో అవుతుంది. గాయత్రీ వెళ్లిన లొకేషన్‌లో అనంత్ ఫుల్ లైటింగ్ పెట్టి పూల దారి ఏర్పాటు చేసి మధ్య మధ్యలో గ్రీటింగ్ కార్డ్ టెడ్డీ బియర్, చాక్లెట్ ఇలా ప్రేమికుల దినోత్సవ వారంలో ఏడు రోజులకు గాను ఏడు గిఫ్ట్‌లు దారి మధ్యలో ఏర్పాటు చేస్తాడు. వాటిని తీసుకుంటూ సంతోషంగా గాయత్రీ ముందుకు నడుస్తుంది. వెళ్లగా ఓ చీకటిలోకి గాయత్రీ వెళ్లగా వెలుతురు వచ్చి గాయత్రీ మీద స్పార్క్స్ పడతారు. అనంత్ మోకాల మీద కూర్చొని గాయత్రీకి రింగ్ ఇస్తాడు. అందులో లవ్ అని రివర్స్‌లో ఉంటే ఇలా ఉంది ఏంటని గాయత్రీ అడిగితే అనంత్ నా కళ్లలో చూడు అని చెప్తాడు.
గాయత్రీ చూడగానే LOVE అని కనిపిస్తుంది. తర్వాత అనంత్ గాయత్రీ విల్ యూ మ్యారీ మీ అంటే గాయత్రీ తల ఊపుతుంది. అనంత్ గాయత్రీ చేతికి రింగ్ ఇచ్చి గాల్లో తిప్పుతాడు. ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటారు. అది చూసిన ఊర్వశి రగిలిపోతుంది. అనంత్ ప్రేమ గాయత్రీకి దక్కకూడదని దాని నుంచి ప్రేమ లాక్కొని దురదృష్ట వంతురాలిని చేస్తానని అంటుంది.
ఉదయం ఊర్వశి అటూ ఇటూ తిరుగుతూ అనంత్ గాయత్రీకి ప్రపోజ్ చేయడం గురించి ఆలోచిస్తుంది. తల్లి వచ్చి నీ కలలు నేను చేస్తానే వాళ్లఇద్దరినీ దూరం చేద్దామని అంటుంది. అందుకు ఓ ప్లాన్ కూతురికి రమాదేవి చెప్తుంది. ఇక ఊర్వశి పూలు తోరణాలు గుచ్చుతుంది. నేను చేయను అంటే త్రిపుర పెళ్లి అయితేనే మనకు డబ్బు వస్తుందని అంటుంది. ఇక త్రిపుర రాగానే రమాదేవి త్రిపురను పక్కన కూర్చొపెట్టుకుంటుంది. ఇక గాయత్రీ అక్కతో అమ్మకి ఏమైనా అయిందా.. అమ్మ నాఫోన్ ఎత్తడం లేదు.. నువ్వు అమ్మ పెళ్లికి ఒప్పుకున్నావ్ నాకు ఏదో అనుమానంగా ఉందని అంటుంది. తాత గాయత్రీకి మీ అమ్మ యజమానికి బాలేదని అక్కడ ఉందని అంటారు.
ఇంతలో రత్నమాల, గిరి వస్తారు. పెళ్లికి కావాల్సిన అన్నీ మీ అమ్మలా మేనత్తే చేసేస్తుందని రమాదేవి త్రిపురతో అంటుంది. దానికి గాయత్రీ తను మా అమ్మలా ఆలోచిస్తే రౌడీతో నా కొడుకు పెళ్లి చేయదు అంటుంది. రత్న మాల సీరియస్ అవ్వడంతో గిరి ఆపుతాడు. ఇక గిరి తనకు స్వీట్ తినిపించాలని ఉందని త్రిపురకు స్వీట్ పెడతాడు. త్రిపుర వద్దని అంటుంది. గాయత్రీ వద్దు బయటకు వెళ్లు అంటే రత్నమాల గాయత్రీతో వాడి పెళ్లానికి వాడు తినిపిస్తే నీకు ఏంటి నొప్పి అంటుంది. గిరి త్రిపురకు బలవంతంగా తినిపిస్తాడు. ఊర్వశి త్రిపురతో అక్క ఇప్పుడు నువ్వు బావకి తినిపించు అంటుంది. త్రిపుర వణుకుతూ గిరికి తినిపిస్తుంది. ఇక గిరి అత్తకి స్వీట్స్ ఇచ్చి అందరికీ పంచు అని చెప్తాడు. ఇక త్రిపురతో మనకు కావాల్సిన వాళ్లందరికీ ఇచ్చానని అంటాడు.
బాల దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లి స్వీట్ బాక్స్ ఇస్తాడు. బాల తీసుకోను అంటే సుందరి నీ కోసం స్వీట్స్ ఇచ్చిందని అంటాడు. దాని మీద సుందరి అని రాసి ఉండటంతో బాల సంతోషంగా తీసుకుంటాడు. ఇంట్లో పరుగులు పెట్టి సుందరి నా కోసం స్వీట్స్ ఇచ్చిందని అంటాడు. సుందరి వేరే వాళ్లతో పంపిందని అంటాడు. నేను ఒక్కడినే తింటాను అనుకొని ఓపెన్ చేస్తే అందులో పాము ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆ పాము బాలని కాటేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!





















