Ennallo Vechina Hrudayam Serial Today March 13th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర తల్లికి మరణశిక్ష తప్పదా.. మరోసారి బాలని రక్షించిన త్రిపుర!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ పేపర్ వేయడం త్రిపుర పాల ప్యాకెట్లు సరఫరా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్ కంపెనీకి గాయత్రీ ఉద్యోగం కోసం వస్తుంది. గాయత్రీ ప్రొఫైల్ చూసి మేనేజర్ అనంత్ దగ్గరకు తీసుకెళ్లి మనకు సూట్ అయిన ప్రొఫైల్ అని చెప్తాడు. అనంత్ ఫైల్ చూసి గాయత్రీని చూసి గాయత్రీ తనని మోసం చేసిందని అనుకొని తనని వద్దని పంపేయమని ఇంతకు ముందు ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చానని అంటాడు.
మేనేజర్ గాయత్రీ దగ్గరకు వెళ్లి ఇంటర్వూలు అయిపోయావని చెప్తాడు. ఏ జాబ్ అయినా చేస్తా అని గాయత్రీ బలిమాలడం అనంత్ చూస్తాడు. గాయత్రీ అనంత్ వైపు చూసే టైంకి అనంత్ ముఖం తిప్పేస్తాడు. గాయత్రీ వెళ్లిపోతుంది. రాత్రి త్రిపుర, గాయత్రీ మాట్లాడుకుంటారు. బాధ పడుతున్న అక్కకి గాయత్రీ ధైర్యం చెప్తుంది. ఇంతలో అక్కడికి ప్రియ తల్లి వస్తుంది. ప్రియ గురించి అడిగితే ట్యూషన్‌కి వెళ్లిందని చెప్తుంది కుమారి. ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పమని త్రిపుర అంటుంది. దాంతో కావేరి తన భర్త ఉదయం పాలు వేసే ఉద్యోగం ఇవ్వగలరు అంటే త్రిపుర పర్లేదు ఇవ్వమని అడుగుతుంది. ఇక గాయత్రీ కోసం పేపర్ వేసే పని ఇప్పిస్తానని అంటుంది.అక్క చెల్లెళ్లు సంతోషంగా ఫీలవుతారు.
అనంత్ గాయత్రీ మోసం చేసిందని గాయత్రీ మీద కోపంతో ఉంటాడు. బాల వచ్చి ఏమైందని అడుగుతాడు. అందరూ అనంత్ దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతారు. ఇంతలో టీవీలో ఓ హత్య కేసు గురించి చూసిన బాల తల పట్టుకుంటాడు. అనంత్‌తో తాతయ్యతో ఏదో సాక్ష్యం గురించి చెప్పారని అది గుర్తు రావడం లేదని అంటాడు. అవన్నీగుర్తు చేసుకోవద్దని నాగభూషణం, వాసుకి బాలకి చెప్తారు. బాల మాత్రం తాతయ్య చావుకి కారణం అయిన వాళ్లని వదలను అని వాళ్లు గుర్తొస్తే వాళ్ల నా చేతిలో అయిపోయారని అనడంతో ఫణి వాళ్లు టెన్షన్ పడతారు. ఫణిని ఏదో ఒకటి చేయమని అంటారు. దాంతో ఫణి బాలని మళ్లీ ఇంట్లో కూర్చొనేలా చేస్తాను అని సీతాకోక చిలుక ఉన్న కీచైన్ చూపిస్తాడు.
మరోవైపు గల్ఫ్‌లో చిక్కుకున్న గంగతో సంతకం పెట్టించుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారు. గంగ ఎంత బతిమాలినా విడిచిపెట్టరు. త్రిపుర ఇంటింటికి పాలు ప్యాకెట్లు వేస్తే గాయత్రీ పేపర్ వేస్తుంది. బాల జాగింగ్ చేస్తూ ఉంటే బాలని టార్గెట్ చేసిన ఫణి అతనికి కనిపించేలా సీతా కోక చిలుకల బొమ్మలు అతికిస్తాడు. బాల వాటిని చూసి బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌కి ఫిట్స్ వచ్చినట్లు కుప్పకూలిపోతాడు. బాలని చూసిన త్రిపుర వచ్చి సపర్యలు చేస్తుంది. ఇంతలో ఫణి కూడా వస్తాడు. అన్నయ్య ఏమైందని అంటాడు. బాల అక్కడ అక్కడ అని అంటే త్రిపుర చూసి బాలకి సీతాకోక చిలుకల ఎఫెక్ట్ గుర్తు చేసుకుంటుంది. బాల ఏమైందని అడిగితే దానికి ఫణి కళ్లు తిరిగి పడిపోయాని అంటాడు. పాల ప్యాకెట్లు వేయాలి అని వెళ్లిపోతుంది.
ఇక త్రిపుర, పాల ప్యాకెట్ తీసుకొని వస్తే గాయత్రీ పేపర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక త్రిపురకి ఇండియన్ ఎంబసీ నుంచి కాల్ వస్తుంది. గల్ఫ్‌లో మీ అమ్మని అరెస్ట్ చేశారని చెప్తారు. ఇండియాలో ఎవరైనా లాయర్‌ని పెట్టి కోర్టు ప్రొసీజర్ మొదలు పెట్టమని అంటారు. లేదంటే మీ అమ్మ చేసిన తప్పునకు మరణ శిక్ష వేస్తారని అంటారు. త్రిపుర ఏడుస్తుంది. గాయత్రీ ఓదార్చుతుంది. ఇక లాయర్ దగ్గరకు బయల్దేరుతారు. రత్నమాల ఊర్వశికి కాల్ చేస్తే రమాదేవి కట్ చేసేమని అంటుంది. ఫణి తన ప్లాన్ వేస్ట్ అయింది అంటే దానికి అతని తల్లిదండ్రుల బాలని త్వరగా పిచ్చి వాడిని చేయమని అంటారు. ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగా బామ్మ అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!





















