అన్వేషించండి
Ennallo Vechina Hrudayam Serial Today March 11th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: కెమెరా పెన్‌లో సాక్ష్యాలు.. త్రిపురని మర్చిపోయిన బాల.. ఫణికి దినదిన గండం!
Ennallo Vechina Hrudayam Today Episode ఫణి, నాగభూషణం తమ కుట్రల్ని దాచుకోవడానికి పెద్దాయన్ని చంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్
Source : Zee5/YouTube
Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల లోకేషన్ చూడటానికి కారు దిగి కొండ ప్రాంతానికి వస్తాడు. అక్కడే ఆలోచనలో ఉన్న త్రిపురని చూసి ఏయ్ అక్కడేం చేస్తున్నావ్ అని అరుస్తాడు. దాంతో త్రిపుర కాలు జారి పడిపోతుంది. బాల త్రిపురకు చేయి అందించి పైకి లాగుతాడు. బాలకు గతం గుర్తు రావడంతో తన సుందరిని గుర్తు పట్టడు. త్రిపుర ఆత్మహత్య చేసుకుంటుదేమో అని త్రిపురని తిడతాడు. చిన్నపిల్లాడిలా ఉన్న బాల ఒక్కసారిగా మామూలు మనిషిగా అయిపోవడంతో త్రిపుర ఆశ్చర్యంగా చూస్తుంది.
త్రిపుర: నేను మీకు గుర్తున్నానా..
బాల: నేను ఎప్పుడూ మిమల్ని చూడలేదు. ఏనీవే జాగ్రత్త. అని చెప్పి వెళ్లిపోతాడు.
రమాదేవి: (త్రిపుర ఫ్యామిలీ మొత్తం చెట్టు కిందే ఉంటారు) సాయంత్రం వరకు సర్దుకోమన్నారు రాత్రి అయింది మామయ్య. ఎక్కడ పడుకుంటాం. ఎక్కడ వండుకొని తింటాం.
త్రిపుర: మన పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో. ఎలా ఈ సమస్యల నుంచి బయట పడటం.
పెద్దాయన: బయట పడలేం అమ్మ ఆ రత్నమాల మనల్ని బతకనివ్వదు. ఈ ఊరిలో మీకు ఉద్యోగాలు దొరకనివ్వదు. నిలువ నీడ కూడా లేకుండా చేస్తుంది.
ఇంతలో వర్షం పడటంతో అందరూ తడిచిపోతారు. ఏం చేయలేక ఏడుస్తారు. సిటీకి వెళ్లిపోదాం అని గాయత్రీ అంటుంది. దాంతో త్రిపుర సొంత ఊరు వదిలి ఎలా వెళ్లిపోతాం అంటే ప్రసాద్ కూడా సిటీకీ వెళ్లిపోదాం అంటాడు. అందరూ సిటీకి వెళ్లాలని నిర్ణయించుకొని బస్ ఎక్కడానికి వెళ్తారు. బాల వాళ్లు కూడా సిటీకి వెళ్లిపోతారు. ఉదయం బాల నిద్ర లేచి తన మెడలో ఉన్న చైన్‌కి త్రిపుర రింగ్ ఉండటం చూసి ఇది ఎలా వచ్చింది బామ్మ పెట్టిందా ఏంటి అనుకుంటాడు. ఇక ఆఫీస్‌కి రెడీ అయి కిందకి వస్తే యశోద కొడుకుకి హారతి ఇస్తుంది. మీ అమ్మ నీ కోసం చాలా బాధ పడిందిరా అని ఇద్దరూ ఏడుస్తారు. దాంతో బాల తల్లి, నానమ్మతో ఇక నుంచి నావల్ల మీరు సంతోషాలే చూస్తారని అంటాడు. వంశానికి వంశాద్దారకుడు పెద్ద వారసుడు రంగంలోకి దిగిపోయాడు బిజినెస్‌లు అన్నింటిలో నెంబరు వన్‌గా మళ్లీ మారుతామని అంటుంది. ఇక నాగభూషణం, వాసుకి, ఫణిలు గతం గుర్తొస్తే మన పని అయిపోతుందని అనుకుంటారు. ఇక బాల అనంత్‌ని పిలిచి గడ్డం పెంచేశావ్ డల్‌గా ఉన్నావ్ ఏమైంది నీ సమస్య ఏమైనా నాకు చెప్పు నేను చూసుకుంటా అంటే అనంత్ ఏం లేదని చెప్తాడు.
బాల తన తాతగారి ఫోటో చూస్తూ కొంచెం కొంచెం గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫొటో దగ్గరకు వెళ్తాడు. తాతయ్య మరణం వెనుక అని తాతయ్య చనిపోయే ముందు కాల్ చేసి ఏదో చెప్పారు అది గుర్తు రావడం లేదని తాతయ్య మరణం వెనక కారణం గుర్తు వస్తే దానికి కారణం అయిన వాళ్ల సంగతి చెప్తా అని అంటాడు. పాతవి ఏం గుర్తు చేసుకోవద్దని ఫణి వాళ్లు చెప్తే వాళ్లని వదిలి పెట్టను అని అంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో నాగభూషణం బాల లేని టైంలో కంపెనీ షేర్లు ఫణీ పేరుమీద రాయిస్తాడు. తండ్రి నాగభూషణాన్ని పిలిచి ఇన్ని అవకతవకలు ఏంటి ఫణీ పేరు మీద షేర్లు రాయించడం ఏంటి అని ప్రశ్నిస్తారు. బాలా కష్టార్జితం మీద మీకు ఎలాంటి హక్కు లేదని అమెరికా నుంచి వస్తున్న బాలకి నిజం చెప్పి మీ అంతు చూస్తానని అంటాడు. తాతయ్య అడ్డు తొలగించుకోవాలని లేదంటే మనం రోడ్డున పడతామని ఫణీ చెప్తాడు. దాంతో నాగ భూషణం తండ్రిని చంపడానికి రెడీ అవుతాడు. ఫణీ రౌడీలకు విషయం చెప్తాడు.
బాల ఇండియాకు వస్తూ తాతయ్య గెస్ట్ హౌస్‌కి ఎందుకు రమ్మన్నారు అక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటి అనుకుంటాడు. ఇక పెద్దాయన తన పెన్ కెమెరాలు నాగభూషణం అక్రమాలు అన్నీ రికార్ట్ చేసుకొని తన దగ్గర ఉంచి బాలకి చూపించాలి అనుకుంటాడు. ఇంతలో రౌడీలు తాతగారి దగ్గరకు వచ్చి చంపాలని ప్రయత్నిస్తారు. పెద్దాయన బాలకి కాల్ చేసి తనని ఎవరో చంపాలి అని చూస్తున్నారని మీ బాబాయ్, పిన్ని, ఫణిలు మంచి వాళ్లు కాదని అంటే బాలకి మాటలు వినిపించదు. పెన్లో ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్తాడు. అయినా బాలకి అర్థం కాదు. ఇంతలో రౌడీలు తాతగారిని చంపేస్తారు. బాల వెళ్లే సరికి తాతగారు చనిపోతారు. బాల ఏడుస్తాడు. బయటకు వచ్చి రౌడీలను ఫాలో అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















