Ennallo Vechina Hrudayam Serial Today February 17th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: కాబోయే భార్య అంటూ త్రిపురతో మిస్ బిహేవ్ చేసిన గిరి.. బాబాయ్ బాక్స్ బద్దలకొట్టిన బాల
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీకి ప్రపోజ్ చేయడానికి అనంత్ వచ్చి కోపంగా ఉన్న గాయత్రీని కూల్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode శుభలేఖలో త్రిపుర పేరు పక్కన బీ టెక్ అని ఉండటం చూసిన గిరి ఇలా ఎందుకు రాయించారని అడుగుతాడు. దాంతో గాయత్రీ బావ పేరు పక్కన రౌడీ అని రాయించాలని అంటుంది. దాన్ని కవర్ చేయడానికి గిరి తన స్నేహితులతో మరదలు కదా సరసం అని అంటాడు. అవునవును అని రత్నమాల నవ్వుతుంది. ఇక గిరి త్రిపుర మీద చేయి వేసి భుజం నలిపేస్తూ తిప్పు మన పెళ్లి కార్డు ఎలా ఉంది చూడు అంటాడు. గాయత్రీ అక్క ఇబ్బంది పడటం చూసి కోపంతో త్రిపుర వదిన కాఫీ తీసుకొస్తే గాయత్రీ నెట్టేస్తుంది. దాంతో గిరి చేయి కాలిపోతుంది.
గిరి కోప్పడటంతో రత్నమాల నీ మరదలు సరసం చేసిందని రేపు పసుపు దంచే కార్యక్రమం ఉందని చెప్పి బయల్దేరుతుంది. త్రిపుర దగ్గరకు వచ్చి నీ కాబోయే భర్త వెళ్తుంటే దగ్గరకు వచ్చి సాగనంపు అంటుంది. త్రిపుర వెళ్తుంది. ఇక అత్తతో అమ్మని విడిపిస్తా అన్నావు డబ్బు సర్దు బాటు అయిందా అంటే దానికి రత్నమాల 15 లక్షలు కాదు 30 లక్షలు అయినా ఎదురిచ్చి మీ అమ్మని విడిపిస్తా నువ్వు బెంగ పెట్టుకోకు ఆ విషయం వదిలేయ్ అంటుంది. త్రిపుర హ్యాపీగా ఫీలవుతుంది.
బాల ఆడుకుంటూ ఉంటే పిన్ని, బాబాయ్‌లు వచ్చి ఈ రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట వెళ్లే నీకు ఇంజక్షన్ వేస్తారు రాను అని మారాం చేయమని అంటారు. బాల సరే అని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాడు. బాల హాస్పిటల్‌కి వెళ్లకపోతే ట్రీట్మెంట్ ఆగిపోతే ఎప్పటికీ కోలుకోడని అనుకుంటారు. ఇక బామ్మ వచ్చి ప్రకృతి వైద్యశాలకి వెళ్దామంటే బాల రాను అంటాడు. ఎందుకు వెళ్లవని బాలని అడిగితే అక్కడ చేదు మందు ఇస్తారని బాబాయ్ పిన్ని అస్సలు వెళ్లొద్దని అన్నారని చెప్తాడు. ఇక బాల క్రికెట్ ఆడుతూ బాల కొట్టడంతో నాగభూషణం బాక్స్ బద్దలవుతుంది. బాలు తగలడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక బామ్మ ఎందుకు వాడిని హాస్పిటల్ వెళ్లొద్దని అన్నారని అడిగితే దీని కంటే ప్రైవేట్ హాస్పిటల్ బెటర్ అన్నామని అంటాడు. దాంతో బాల పిన్ని, బాబాయ్ అబద్ధం చెప్తున్నారని అంటాడు. ఇక హాస్పిటల్‌కి వెళ్దామంటే బాల రాను అనేస్తాడు. దాంతో బామ్మ కాలు బెనికినట్లు నటిస్తుంది. బాల బామ్మకి ఏదో అయిపోయిందని హాస్పిటల్‌కి వెళ్దామంటాడు.
గాయత్రీ అక్క పెళ్లికి అంగీకరించడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గాయత్రీ దగ్గరకు అనంత్ వస్తాడు. పజిల్‌కి సమాధానం తెలిసిపోయిందని ఈ రోజు దాని సమాధానం చెప్పేస్తా అనుకుంటాడు. గాయత్రీ దగ్గరకు వెళ్లి ఏంటి ఇలా ఉందా అనుకుంటుంది. ఏమైందని అడిగితే నా మూడ్ బాలేదని గాయత్రీ చెప్తే ఈ మూడ్‌లో కూడా బాగున్నారని అంటాడు. గాయత్రీ ఫ్యామిలీ ఇష్యూష్ అని చెప్పి అనంత్ మీద కోప్పడుతుంది. బామ్మ కాలు నొప్పి అని యాక్టింగ్ చేసి బాలని హాస్పిటల్‌కి తీసుకొస్తుంది. బామ్మ బాలని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లిమని సైగ చేస్తుంది.
గాయత్రీ హర్ట్ అవ్వడంతో అనంత్ వెంట పడతాడు. ఆర్య మూవీలోలా కప్ పెట్టి గాయత్రీ చేతిలో మూడు రాళ్లు పెట్టి వీటిలో ఏ ఒక్కటి పడినా మీరు భయపడుతున్నది జరగదు అని చెప్తాడు. దాంతో గాయత్రీ రాళ్లు విసురుతుంది. తన అక్కకి గిరితో పెళ్లి కాకూడదని కోరుకొని రాయి విసురుతుంది. దాంతో 3సారి విసిరిన రాయి పడుతుంది. అనంత్, గాయత్రీ హ్యాపీగా ఫీలవుతారు.
బాలని నాగభూషణం వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తాడు. చీటింగ్ అని బాల అరుస్తాడు. కషాయం తాగించాలి మర్దన ఉందని బాలకి షర్ట్ విప్పమని అంటాడు. బాబాయ్‌తో పాటు అక్కడ ఉన్న నలుగురు విప్పితేనే తాను విప్పుతానని అంటాడు. నాగభూషణంతో పాటు నలుగురు శిష్యులు షర్ట్ విప్పుతారు. ఇక చైన్ తీయమని అంటే బాల తీసి నానమ్మకి ఇస్తానంటాడు. అందులో త్రిపుర ఉంగరం ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!





















