Ennallo Vechina Hrudayam Serial Today April 29th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సాక్షిని బెదిరించిన ఫణి.. త్రిపురని తప్పుగా అర్థం చేసుకున్న ఫ్యామిలీ!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర, బాల నర్శింగి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం ఫణి అతన్ని బెదిరించి అతని భార్యతో నర్శింగి చనిపోయాడని చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలకృష్ణ, త్రిపుర పోలీస్ స్టేషన్‌లో బాల తాతయ్య కేసు ఫైల్ కోసం వెతుకుతూ ఉంటారు. త్రిపురకు ఆ ఫైల్ దొరుకుతుంది. అది చూసిన బాల తల పట్టుకొని ఇబ్బంది పడతాడు. త్రిపుర బాలని టెన్షన్ తీసుకోవద్దని చెప్తుంది. పోలీస్ దగ్గరకు వెళ్లి చూపిస్తారు. ఆ కేసు క్లోజ్ చేసేశారని చెప్తారు. బాల చాలా ఒత్తిడికి గురి అవుతాడు.
త్రిపుర పోలీస్‌కి సస్పెక్టెడ్ అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. ఎస్ఐ ఇస్తారు. ఇద్దరికీ జాగ్రత్త చెప్తారు. అంతా చాటుగా విన్న ఫణి త్రిపుర వాళ్లు చూడకుండా వెళ్లిపోతాడు. త్రిపుర, బాల అడ్రస్ పట్టుకొని ఆ రౌడీ ఇంటికి బయల్దేరుతారు. బాల, త్రిపుర రావడంతో రౌడీ భార్య వెళ్లి డోర్ తీస్తుంది. నర్శింగి గురించి అడుగుతారు. ఇద్దరినీ అతని భార్య లోపలికి పిలుస్తుంది. నా భర్త లేడు అని అంటుంది. నిజమే చెప్తున్నావా అని త్రిపుర అడిగితే నిజమే చెప్తున్నా అని దండ వేసిన ఫొటో చూపించి రెండు నెలల క్రితమే ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్తుంది. తీరా చూస్తా పక్క గదిలో ఫణి నర్శింగి మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. దాంతో బాల, త్రిపుర వెళ్లిపోతారు. ఇక ఫణి నర్శింగిని వెంటనే ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోమని బెదిరిస్తాడు.
బాలా చాలా టెన్షన్ ఫీలవుతాడు. ఒక్క ఆధారం కూడా పోయిందని అంటాడు. ఇక ఇద్దరూ ఇంటికి వెళ్తారు. తాతయ్య చావు గురించి నువ్వు నిజం ఎప్పటికీ తెలుసుకోలేవు అన్నయ్యా అని ఫణి అనుకుంటాడు. రాత్రి బామ్మ పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. యశోద బామ్మతో అత్తయ్య నా బాల కృష్ణుడు మళ్లీ చిన్న పిల్లాడు అయిపోతాడా గతాన్ని మర్చిపోతాడా అని ఏడుస్తుంది. ఇక బాల త్రిపురతో నాకు గతంలో ఏమైందో తెలీదు ఆ దేవుడు నాకు ఎందుకు ఈ శాపం ఇచ్చాడో తెలీదు. నేను ఎందుకు ఎలా మారిపోయాను నాకు ఏమైంది అందరికీ అండగా ఉండాల్సిన నేను ఇలా అయిపోయాను ఏంటి అని అడుగుతాడు. చాలా బాధ పడతాడు. ఇంట్లో అందరూ దేవుడిని బాల కోసం వేడుకొని ఏడుస్తారు.
త్రిపుర బాలతో మీకు ఆ దేవుడు మంచే చేస్తాడు అని ధైర్యం చెప్తుంది. నేరస్తుల్ని పట్టుకోలేకపోయాను అని వాళ్లు సంబరపడిపోతుంటారు కానీ నేను వాళ్లని వదలను ఎప్పటికైనా వాళ్లని నేను పట్టుకొని వాళ్లకి తగిన శిక్ష వేస్తాను అని అంటాడు. ఇంతలో బాల చిన్ని పిల్లాడిలా మారే టైం అవడంతో తల పట్టుకొని చాలా ఇబ్బంది పడతాడు. త్రిపుర ఒడిలో పడిపోతాడు. బాలని మామూలు మనిషిగా ఉండనివ్వు దేవుడా అని యశోద ఏడుస్తుంది. త్రిపుర ఒడిలో ఉన్న బాల దగ్గరకు ఓ సీతాకోక చిలుక వస్తుంది. త్రిపుర దాన్ని చూసి పంపేస్తుంది. తర్వాత బాల చిన్నపిల్లాడిలా మారిపోతాడు. సుందరి నాకు ఐస్ క్రీమ్‌లు కొనిపెట్టు అని మాట్లాడుతాడు. బాలని చూసి త్రిపుర ఏడుస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్న బాలని ఎలా ఇంటికి తీసుకెళ్లాలి అని అనుకుంటుంది.
బాల చిన్నపిల్లాడిలా ఇంటికి వెళ్లడం చూసి బామ్మ, యశోద ఏడుస్తారు. నేను సుందరితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాను నాకు హ్యాపీగా ఉంది మీరు హ్యాపీగా ఉండండి అని అంటాడు. ఇక నాగభూషణం, వాసుకిలు త్రిపురతో నువ్వు ఎవరినో తీసుకొచ్చావ్ దాని వల్ల బాల మంచోడు అవ్వకుండా బాధ పెట్టాడని అంటుంది. బా సుందరిని ఏం అనొద్దని అంటాడు. త్రిపుర బామ్మతో ఇప్పుడు బాల గారు మారకపోయినా పూర్తిగా మార్చుతానని అంటుంది. వాసుకి వాళ్లు త్రిపురతో నువ్వేం మా బాలని మార్చుకు ప్రతి రోజు వచ్చి సక్రమంగా నీ డ్యూటీ చేసుకుంటే చాలు అంటారు. ఎవరూ త్రిపుర మాట వినరు. త్రిపుర ఏడుస్తూ వెళ్తుంటే గాయత్రీ చేయి పట్టుకొని ఆపి అక్క నువ్వు వీళ్లందరితో మాటలు పడొద్దు అక్క నా మాట విని ఈ కేర్ టేకర్ జాబ్ మానేయమని అంటుంది. త్రిపుర బాలని మామూలు మనిషిని చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















