Ennallo Vechina Hrudayam Serial Today April 24th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బ్యాగ్ చెక్ చేసి త్రిపురని అవమానించిన వాసుకి.. బాల రివేంజ్ సూపర్!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర దొంగతనం చేసిందని త్రిపుర బ్యాగ్‌ని వాసుకి చెక్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలని పరీక్షించిన మానసిక వైద్యుడు బాల తాతయ్య చావు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడని తాతయ్య చావు దగ్గర బ్రైన్ స్టక్ అయిందని అది తెలిస్తే సెట్ అవుతుందని డాక్టర్ చెప్తారు. త్రిపుర ఆ విషయంలో తాను కూడా తన ప్రయత్నం చేస్తానని అంటుంది.
అర్జెంటుగా వెళ్లాలండీ..
త్రిపుర రామగిరిలో ఉన్న గురువుగారికి కాల్ చేస్తుంది. బాల గారిని మామూలు మనిషిని చేయాలి అని అంటుంది. బాలకి బౌద్దీజంలో వైద్యం ఉండొచ్చు వాళ్ల నెంబరు నేను కనుక్కొని నీకు చెప్తా నువ్వు మాట్లాడు అని గురువుగారు చెప్తారు. ఇక త్రిపుర బాలకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయల్దేరుతుంది. బామ్మతో ఇంటి దగ్గర పని ఉంది కాస్త త్వరగా వెళ్తాను అంటుంది. బామ్మ సరే అంటుంది.
నీ బ్యాగ్ చెక్ చేయాలి..
త్రిపుర వెళ్తుంటే వాసుకి ఆపుతుంది. బ్యాగ్ చెక్ చేయాలి అంటుంది. గాయత్రీ వాసుకిని ఆపితే వాసుకి తిడుతుంది. బాలని ట్యూన్ చేసి నీకు నచ్చినట్లు సమాధానం చెప్పిస్తున్నావ్ అంటారు. వాసుకి త్రిపుర బ్యాగ్ చెక్ చేస్తానని బ్యాగ్ లాక్కుంటే గాయత్రీ అడ్డుకుంటుంది. మా అక్కకి మీరు ఇచ్చిన విలువ ఇదేనా బాల బావగారి కోసం మా అక్క కేర్ టేకర్‌గా పని చేస్తుంటే ఇలా అవమానిస్తారా మీకు ఇది న్యాయమా అని అడుగుతుంది. బాలని మచ్చిక చేసుకొని ఏమైనా దొంగతనం చేస్తే ఏంటి అని నాగభూషణం అడుగుతాడు. ఇక వాసుకి త్రిపుర బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న సామాగ్రి కింద పడేస్తుంది.
చిన్నత్తని లాగి పడేసిన గాయత్రీ..
గాయత్రీ కోపంగా మీకు బుద్ధుందా మీరు మనుషులేనా అని బ్యాగ్ గట్టిగా లాగేస్తుంది. వాసుకి పడిపోబోతే అనంత్ అడ్డుకుంటాడు. బామ్మ గాయత్రీ మీద కొప్పడుతుంది. మా అక్కని అవమానించినప్పుడు ఎవరైనా అడిగారా మా అక్కని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటుంది. మా అక్కకి ఉన్న మంచి తనం మీకు కొంచెం కూడా లేదు అని గాయత్రీ అనగానే అనంత్ గాయత్రీని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. తప్పు చేసిన మీ వాళ్లని ఆపరు కానీ నా మీద చేయి ఎత్తుతారా అని అడుగుతుంది.
వీళ్లే నీకు సారీ చెప్పాలి..
గాయత్రీని త్రిపుర ఆపాలని ప్రయత్నిస్తుంది. పిన్ని బాబాయ్ చాలా బ్యాడ్ అని బాల అంటాడు. అందరూ గాయత్రీని కోప్పడతారు. పెద్దా చిన్నాలేకుండా ఏది పడితే అది మాట్లాడకు అని బామ్మ గాయత్రీ మీద అరుస్తుంది. గాయత్రీ తరఫున త్రిపుర క్షమాపణ చెప్పుంది. గాయత్రీ ఆపి వీళ్లు నీకు క్షమాపణ చెప్పాలి అని అంటుంది. గాయత్రీ వాదిస్తుంటే అనంత్ గాయత్రీని తీసుకెళ్లిపోతాడు. ఇక బాల సుందరి నువ్వు ఫీలవ్వకు అని బ్యాగ్ సర్దబోతే వాసుకి బ్యాగ్ త్రిపుర ముఖం మీద కొట్టి సర్దుకో అని చెప్తుంది. త్రిపుర ఏడుస్తూ బ్యాగ్ సర్దుకొని ఏడుస్తూ వెళ్లిపోతుంది.
బాల రివేంజ్ ప్లాన్..
బాల త్రిపురని అవమానించిన వాసుకి వాళ్ల మీద రివేంజ్ ప్లాన్ చేయాలి అనుకుంటాడు. ఇంతలో పనామె వస్తే వాసుకి, నాగభూషనం వంటలు వండమని చెప్తారు. వాళ్లకి నచ్చిన వంటలు చెప్తారు. ఇక పుష్ప బాలకి ఏం కావాలి అంటే రివేంజ్ కావాలి అంటాడు. ఇక బాల పిన్నీ బాబాయ్‌లతో మీ కోసం పిజ్జా ఆర్డర్ చేస్తానని అంటాడు. ఆర్డర్ పెట్టడం నీకు వచ్చా అని వాసుకి అడిగితే అనంత్ నేర్పించాడు అంటాడు. బాల పిజ్జా ఆర్డర్ చేస్తాడు. అదిచూసి భార్యభర్తల నోరు ఊరిపోతుంది. ఇద్దరూ చెరో పీస్ తీసుకొని నోట్లో పెట్టుకోగానే నోరు అతుక్కుంటుంది. బాల పిజ్జాలో పెవికిక్ కలిపేస్తాడు. బాల వాళ్ల తిప్పలు చూసి నవ్వుకుంటాడు. ఏమైందని అంటే గమ్ వేశానని నా సుందరిని ఇంకోసారి బాధ పెడితే ఇంత కంటే ఎక్కువ చేస్తాను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















