అన్వేషించండి

Jyothi Raj: అటువంటి అమ్మాయిలకూ శిక్ష పడాల్సిందే... జానీ మాస్టర్ వ్యవహారంపై లేడీ కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్

జానీ మాస్టర్ వ్యవహారంపై ఆట సందీప్ భార్య, ప్రముఖ డ్యాన్సర్ జ్యోతి షాకింగ్ కామెంట్స్ చేసింది. తప్పు చేసిన వారికి శిక్ష పడినట్లుగానే, తప్పుడు ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నది.

Dancer Jyothi Raj On Jani Master Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ ఆయన మీద అత్యాచారం ఆరోపణలు చేసిన నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యంత కఠినమైన ఫోక్సో కేసు కూడా ఉంది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు బాధితురాలు మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో జానీ మాస్టర్ కు చుట్టు ఉచ్చు గట్టిగా బిగుసుకుంటున్నది.   

జానీ మాస్టర్ వ్యవహారంపై ఆట సందీప్ భార్య కీలక వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వ్యవహారంపై ఆట సందీప్ భార్య, ప్రముఖ డ్యాన్సర్ జ్యోతి స్పందించింది. అమ్మాయిలను వేధించిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అయితే, ఆరోపణల వెనుకున్న వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని నెటిజన్లకు సూచించింది. అవాస్తవాలను ప్రచారం చేసే వారి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. “ఈ రోజుల్లో చాలా మంది జనాలు ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు. నేనూ చాలా రోజులుగా వీడియోలు చేస్తున్నాను. అత్యాచారం జరిగిన అమ్మాయిలకు న్యాయం జరగాలను కోరుకుంటున్నాను. ఆడ పిల్లల పట్ల తప్పుగా ప్రవర్తించే వారికి, వేధించే వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదలకూడదు. కానీ, ఓవర్ స్మార్ట్ నెస్ తో తెలిసీ తెలియని సమాచారంతో ఎదుటి వారిపై బురద చల్లకూడదు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్ ను నాశనం చేయకూడదు. ఆరోపణల వెనుక ఉన్న నిజా నిజాలు ఏంటి అని తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా అడ్డగోలుగా సోషల్ మీడియాలో రాతలు రాసి, వారి కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేయకూడదు. తప్పు చేసిన వారికి శిక్ష పడినట్లుగానే అవాస్తవాలను ప్రచారం చేసే వారికీ శిక్ష పడాలి” అని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep)

భార్య భర్తలూ డ్యాన్సర్లే..

యాంకర్ ఓంకార్ మొదలు పెట్టిన ‘ఆట’ డ్యాన్స్ షోతో సందీప్ బాగా పాపులర్ అయ్యాడు. తోటి డ్యాన్సర్ జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ డ్యాన్సర్లు కావడంతో తరచుగా వీరి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. రియల్ లైఫ్ లో భార్య భర్తలు అయిన సందీప్, జ్యోతి ‘లవ్ యు టు’ అనే సినిమాలోనూ నటించారు. ఇందులోనూ వారు భార్య భర్తలుగానే కనిపించారు.

Read Also: జానీ మాస్టర్‌కి మరో షాక్, అతడిపై పోక్సో కేసు నమోదు - డ్యాన్స్‌‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
Meghasandesam Serial Today October 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget