Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 8th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అందరి ముందే.. ఎవరికీ అర్థం కాకుండా.. వివేక్, జానుల పెళ్లి జరుగుతుందా? మొదలైన అనుమానాలు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode గుడిలో తంతు చూసి లక్ష్మీకి అనుమానం రావడం సంజనను నిలదీయగా మిత్ర వచ్చి లక్ష్మీని చేయి పట్టుకొని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode గుడికి వచ్చిన జయదేవ్, మిత్రలతో వివేక్ ఇది పూజ కాదు తాను జానిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. జయదేవ్ షాక్ అవుతాడు. నీ పెళ్లి ఇలా ఎవరికీ తెలీకుండా గుడిలో ఏంటి అని అడుగుతాడు. మా అమ్మ చేసే పనులకు ఇలాంటి పనే కరెక్ట్ అని అంటాడు. ఇక సంజన అన్నీ ఏర్పాట్లు చేసేశానని అంటుంది.
జయదేవ్: ఓహో నిన్న కొత్త బట్టల వెనుక కథ ఇదా. అప్పుడే మీ పెద్దమ్మకి అనుమానం వచ్చింది.
వివేక్: ఏదైనా ఇబ్బంది వస్తే మీరు పెద్దమ్మ అన్నయ్య ఉన్నారని ముందడుగు వేశాం పెద్దనాన్న.
మిత్ర: మీరు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు మా సపోర్ట్ మీకు ఉంటుంది.
జయదేవ్: ఇంతకీ ఈ విషయం లక్ష్మీకి చెప్పారా లేదా.
వివేక్: లేదు పెద్దనాన్న ఇప్పటికే చాలా ఇబ్బందులు వదినకు. ఇంకా ఈ విషయం చెప్పి కష్టపెట్టడం ఎందుకని.
జయదేవ్: మీరు అయినా లక్ష్మీని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోవాల్సిన వాళ్లు చేసుకుంటే ఇంకా బాగున్ను.
సంజన: వదిన వాళ్లు వచ్చేశారు. రండి వదిన మీకోసమే ఎదురు చూస్తున్నాం.
దేవయాని: ఏయ్ నువ్వు ఇప్పుడు ఎవరిని వదినా అన్నావే.
సంజన: లక్ష్మీ వదినను.
మనీషా: నువ్వు లక్ష్మీని అన్నట్లు లేదు జానుని అన్నట్లుంది.
అరవింద: జాను కూడా వరసకు వదినే కదా.
దేవయాని: ఉన్న వరసలు సరిలే వదినా ఇంకా కొత్తగా కలపకు అక్క.
సంజన: శారీలో నువ్వు చాలా బాగున్నావ్ జాను.
మనీషా: ఆ శారీ అందంగా ఉంది తనేం అందంగా లేదు
లక్ష్మీ: మీరేం అన్నా ఈ రోజు నా చెల్లి చాలా అందంగా ఉంది కదా అత్తయ్య
అరవింద: నువ్వు లక్ష్మీ అయితే తను మహాలక్ష్మీ.
లక్ష్మీ చెల్లికి దిష్టి చుక్క పెడుతుంటే సంజన కావాలనే పిలుస్తుంది దాంతో జాను బుగ్గ మీద చుక్క పెడుతుంది లక్ష్మీ. ఇక సంజన అందరినీ పూజ దగ్గరకు తీసుకెళ్లి పంతులుకి పూజ మొదలు పెట్టమని అంటుంది. ఇక సంజన తన వాళ్లు ఎవరూ లేరని మిమల్ని నమ్ముకొని పూజ పెట్టుకున్నా మీరు పూజ చేయడానికి సాయం చేయమని అంటుంది. పంతులు కూడా సంజనకు అండగా ఉంటాడు. అందరూ మీ వాళ్లే కదా మీ సమక్షంలో పూజ చేస్తానని అంటాడు. దేవయాని జానుతో పక్కకెళ్లు జాను ఇది మా ఫ్యామిలీ పూజ అని అంటుంది.
వివేక్: మనీషా నువ్వు కొంచెం పక్కకి వెళ్లు.
దేవయాని: వివేక్ ఏంట్రా ఆ మాటలు.
సంజన: మనీషా మన సొంత మనిషేం కాదు కదా అమ్మ. ఇక జాను అయితే లక్ష్మీ వదినకు స్వయానా చెల్లెలు. కాబట్టి మన కుటుంబమే.
పంతులు: అంటే ఈ అమ్మాయి మీ కుటుంబం కాదమ్మా.
దేవయాని: తను మా మిత్రకు కాబోయే భార్య పంతులు.
జయదేవ్: స్వయానా ఏం కాదు పంతులు గారు
మనీషా: ఆంటీ మీరు జానుని ప్రతీ విషయానికి దూరం పెట్టకండి వీళ్లు నన్ను దూరం పెడతారు.
పంతులు వివేక్‌తో గణపతి పూజ చేయాలి అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. లక్ష్మీకి అనుమానం వస్తుంది. సంజన లక్ష్మీతో వదినా అన్నయ్యని మీ చేతుల మీదగా కూర్చొపెట్టండని అంటుంది. జయదేవ్ కూడా లక్ష్మీని వివేక్‌ని కూర్చొపెట్టమని అంటాడు. మిత్రని కూడా ఓ చేయి వేయమని అంటాడు. మిత్ర లక్ష్మీలు వివేక్ని కూర్చొపెడతారు. ఏదో తేడాగా ఉందని లక్ష్మీ అనుకుంటుంది. ఇక సంజన పెద్దమ్మ పెద్దనాన్నల్ని కూర్చొమంటుంది. దానికి జయదేవ్ అమ్మానాన్నల తర్వాత అంతటి వాళ్లం మనం పద కూర్చొందామని అంటాడు. పూజలో అరవింద, జయదేవ్ కూర్చొంటారు. లక్ష్మీ అందరిన్ని పరిశీలిస్తుంది. సంజన చాలా సంతోషంగా ఉంటడం చూసి అనుమానంతో సంజనను పక్కకు పిలుస్తుంది. అది మిత్ర చూస్తాడు.
లక్ష్మీ: సంజన అసలు ఇక్కడేం జరుగుతుంది . నువ్వు శాంతి పూజ చేయడానికి వివేక్‌తో వినాయక పూజ ఎందుకు.
సంజన: ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు కదా అందుకే డౌట్ ఉంది.
మిత్ర: నీ డౌట్ ఏంటి.
లక్ష్మీ: పెళ్లిలో కూడా ఇలాగే చేస్తారు కదా. ఏంటి సంజన అంత ఆలోచిస్తున్నావ్ నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావా.
మిత్ర: కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఇది నీకు తెలిసిన విషయమే తెలీకుండా ఏం జరగదు.
సంజన: అవును వదినా నాకు నీ అండ దండలు కావాలి. ఆ ధైర్యంతోనే నేను వివేక్ అన్నయ్యా ఈ పనికి పూనుకున్నాం.
మనీషా: ఆంటీ లక్ష్మీ సంజనలు లేరు.
సంజన: అన్నయ్య వదినను కాస్త నువ్వే చూసుకో నువ్వు ఉంటే వదిన ప్రశ్నలు వేయడం మానేస్తుంది.
లక్ష్మీ సంజన వెంట పడుతుంటే మిత్ర లక్ష్మీ చేయి పట్టుకొని ఆపుతాడు. దేవయాని, మనీషాలు అది చూసి షాక్ అయిపోతారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని మనీషా తల పట్టుకుంటుంది. వివేక్ చాలా సంతోషంగా ఉంటాడు. మిత్ర, లక్ష్మీలు వస్తారు. పంతులు మర్చిపోయి అబ్బాయితో వినాయకుడి పూజ అయింది ఇక పెళ్లి కూతురితో గౌరీ పూజ అని అనేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దాంతో దేవయాని పూజ అన్నారు ఇక్కడ పెళ్లి అవుతుందా అని ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.