Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 17th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మనీషా కుట్ర చేసిందని నిరూపించడానికి ఒక అవకాశం ఇవ్వమని అరవిందని అడగటం అరవింద సరే అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీలు మాట్లాడుకుంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని మిత్ర లక్ష్మీ చేతిలో చేయి వేసి అంటాడు. ఏం జరిగినా నన్ను వదలొద్దు లక్ష్మీ అని చెప్తాడు. మిత్ర, లక్ష్మీ మాటలు జయదేవ్ వింటారు. ఇంట్లో జరిగిన అన్నీ సంఘటనల్ని గురించి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద దగ్గరకు జయదేవ్ వస్తారు. అరవింద కంపెనీ గురించి ఆరాతీస్తుంది.
జయదేవ్: ఇప్పుడు అవి ముఖ్యం కాదు. అసలు అరవింద మాలిని నువ్వేనా. దేవతలాంటి లక్ష్మీకి అన్యాయం చేస్తావా. ఆ మనీషాని కోడలిగా అంగీకరిస్తావా. మిత్ర తప్పు చేశాడు అని నమ్ముతున్నావా. మన పెంపకాన్నే అనుమానిస్తున్నావా ఎందుకు ఇలా చేశావు అరవింద. ఎందుకు చేశావ్.
అరవింద: మిత్ర కోసం అండీ మిత్ర ప్రాణాలు కోసం. రాబోయే గండం నుంచి మిత్రని శాశ్వతంగా కాపాడే శక్తి లక్ష్మీకి లేదండి అది కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురికే ఉంటుంది. నాగసాధువు చెప్పారండీ. నేను కుంభమేళాకి వెళ్లినప్పుడు ఓ సాధువుని కలిసి మిత్ర జాతకం చూపించాను.
నాగసాధువు అరవిందతో మిత్ర పుట్టిన తర్వాత మీకు మరోసారి గర్భం రావడం మీకు తప్పు వల్ల అది పోయింది. దాని వల్ల మీ కొడుకుకి గండం వచ్చిందని మీకు జరిగిన గర్భవిచ్ఛిత్తి వల్ల ఆడబిడ్డ చనిపోయింది అమె కోపం వల్ల మీ కొడుకుకి శాపం తగిలింది ఇప్పుడు మీ కొడుకు రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే అన్నీ గండాలు పోతాయని చెప్తారు. లక్ష్మీతో బిడ్డను కనమని చెప్తామనుకున్నా కానీ లక్ష్మీ చేజేతులారా పోగొట్టుకుందని అందుకే మనీషాని కోడలిగా అంగీకరించానని అంటుంది.
లక్ష్మీ ఉదయం పూజ చేస్తూ తన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఇవ్వమని దేవుడిని కోరుకుంటుంది. దేవుడి గదిలో ఫ్యాన్ గాలికి దీపం కొండెక్కుతుందని ఫ్యాన్ ఆపడానికి వెళ్లకండా లక్ష్మీ తన రెండు చేతుల్ని అడ్డు పెట్టుకొని దీపాన్ని కాపాడుకుంటుంది. దాంతో లక్ష్మీ చేతులు కాలిపోతాయి. అరవింద వచ్చి ఫ్యాన్ ఆపి లక్ష్మీని తీసుకెళ్లి వెన్న పూస్తుంది. ఇలా ఎందుకు చేశారు అత్తయ్య అంటుంది. మీకు నిజం తెలిసిన రోజు నీకు అ బాధ ఉండదు అని అంటుంది. దానికి లక్ష్మీ మనీషా కడుపు, పెళ్లి అన్నీ అబద్ధం అని అంటుంది. సాక్ష్యం ఏంటి అని మనద్దరిమే అని అంటుంది. దానికి అరవింద మనీషా ఫ్రాండ్ చేసిందని నిరూపించు అంటుంది. లక్ష్మీ సరే అని అంటుంది.
మనీషా సరయుకి కాల్ చేసి నా ప్రెగ్నెంట్ గురించి టెన్షన్‌గా ఉందని అంటుంది. నీ ఫేక్ ప్రెగ్నెన్సీ వల్ల ఆమె నిన్ను నమ్మారు కాబట్టి ఆవిడ అన్నది నిజం చేయు అని నిజంగా ప్రెగ్నెంట్ అవ్వమని అంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చేవరకు హాస్పిటల్స్, ఇంజక్షన్‌లు సిరంజిలకు దూరంగా ఉండు అని చెప్తుంది. లక్ష్మీ నిజం ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తూ ఉంటే వివేక్ జానుని తీసుకొని వస్తాడు. జానుని చూసి లక్ష్మీ చాలా సంతోష పడుతుంది. ఇంట్లో జరిగింది అంతా తెలిసింది సారీ అక్క అని జాను చెప్తుంది. మనీషా నాటకం ఆడుతుందని నిరూపించాలని అత్తయ్య ఓ అవకాశం ఇచ్చారని లక్ష్మీ వివేక్, జానులకు చెప్తుంది. ఎలా నిరూపిస్తాం అని జాను అంటే మనీషాకి తెలీకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దామని లక్ష్మీ అంటుంది. ఎలా అక్క డాక్టర్ రావాలి కదా లేదంటే మనమే హాస్పిటల్‌కి వెళ్లాలి కదా అంటే అవసరం లేదు అని వివేక్ అంటాడు. హెచ్‌సీజీ టెస్ట్ (బ్లెడ్ టెస్ట్) చేస్తే తెలుస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

