Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 24th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అక్క కోసం పరుగులు తీసిన జాను.. నర్శింహతో చేతులు కలిపిన మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీని చంపేస్తామని రౌడీలు జానుకి కాల్ చేయడం జాను పరుగులు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ క్రేన్ డ్రైవర్‌కి వార్నింగ్ ఇస్తుంది. రౌడీలు నర్శింహ దగ్గరకు వెళ్లి లక్ష్మీ బెదిరించిందని తనని మేం ఎదుర్కోలేమని అంటారు. దానికి ఆయన ఆ ఆడదానికి భయపడతారేంట్రా.. మనం స్థలాలు, పొలాలు కొనేశాం కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మాత్రమే మిగిలిందని అంటాడు. రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా ఆ లక్ష్మీ ఆపేస్తుందని రౌడీలు అంటారు. ఇక ఇంతలో పొలంలో ధాన్యం ఇంటికి తీసుకెళ్లేలా గ్రామస్తుల్ని లక్ష్మీ ఆపుతుందని ఫోన్ వస్తుంది. దాంతో మల్లేశం వెంటనే అక్కడికి బయల్దేరుతాడు.
లక్ష్మీ, మిత్రలు పొలాల్లో ఆ గ్రామస్తులకు ధైర్యం చెప్తుంది. మీ వెంట మేం ఉన్నాం అని చెప్పి వాళ్ల డబ్బు వాళ్లకి ఇచ్చేసి ఇళ్లు, పొలాలు తీసుకోవాలని అంటారు. ఇక లాయర్‌ని మిత్ర పిలిపిస్తాడు. ఈ ఊరిలో ఫ్యాక్టరీ కట్టాలని ఊరుని ఖాళీ చేయించారని కోర్టులో పోరాడాలని చెప్తాడు. దాంతో లాయర్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే చేయొచ్చని అంటాడు. లక్ష్మీ అందరి దగ్గర సంతకాలు తీసుకుంటుంది. మన పోరాటం మొదలైందని మీరు పండించిన ధాన్యం ఇళ్లకు తీసుకెళ్లమని లక్ష్మీ అంటుంది. ఇక మిత్ర లక్ష్మీని పొగిడేస్తాడు. మరోవైపు జానుకి రియలిస్టేట్ వాళ్లు కాల్ చేస్తారు. పక్క ఊరిలో సమస్య వస్తే మీ అక్క అందులో దూరిందని లక్ష్మీని చంపేస్తారని చెప్తారు. దాంతో జాను షాక్ అయిపోతుంది. కంగారు పడుతున్న జాను దగ్గరకు మనీషా, దేవయాని వస్తారు. జాను వాళ్లతో విషయం చెప్తే పీడా పోతుందిలే అని మనీషా అంటుంది. జాను షాక్ అయిపోతుంది.
మనీషా: వాళ్లు మీ అక్కని చంపేస్తే నీకు ఇక ఏ సమస్య ఉండదు జాను ఆస్తి మొత్తం నీదే.
జాను: మనీషా అని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ తను మా అక్క. నన్ను అమ్మలా పెంచిన మా అక్క. నా ప్రాణం మా అక్క. అలాంటి మా అక్క చావాలి అంటావా. నేను నా భర్త బాగు కోరుకున్నా కానీ మా అక్క నాశనం కాదు. ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తా. నాకు మా అక్కకి మధ్య వంద గొడవలు ఉండొచ్చు అలా అని బయట వాళ్లు మా అక్క జోలికి వస్తే ఊరు కోను. మా అక్క ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా నేను కాపాడుకుంటా.
దేవయాని: ఏంటి మనీషా ఇది ఇలా అపరిచితురాలిలా మాట్లాడుతుంది. లక్ష్మీ మీద దీనికి పీకల దాకా కోపం ఉంది అనుకున్నా కానీ ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉందా. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి.
మనీషా: అది ట్విస్ట్ కాదు రక్త సంబంధం. జాను నిజమే మాట్లాడింది. తను ఎప్పుడూ వివేక్ మంచే కోరుకుంది కానీ లక్ష్మీ చెడు కాదు. ఇప్పుడు నేను లక్ష్మీ అంతు చూస్తా. ఆ రియలస్టేట్ వాళ్లతో చేతులు కలిపి లక్ష్మీని కీర్తిశేషురాలిని చేస్తా.
వివేక్: ఏంటి జాను ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావ్.
జాను: మా అక్కకి ప్రాబ్లమ్ వచ్చిందండి. పక్క ఊరిలో సమస్య అందులోకి అక్క వెళ్లింది వాళ్లు అక్కని చంపేస్తామని నాకు చెప్పారు.
వివేక్: వదిన కోసం జాను కంగారు పడుతుంది. ఇదేదో నాకు కలిసి వచ్చేలా ఉందే.
జాను: మీరు త్వరగా వెళ్లి అక్కని ఇంటికి తీసుకొచ్చేయండి.
వివేక్: తను మీ అక్క కదా నాకు చెప్తావ్ ఏంటి. ఏదైనా ఉంటే నువ్వే వెళ్లి చెప్పుకో నాకు చెప్తావ్ ఏంటి. మీ అక్క మీద ఇష్టం ప్రేమ ఉంటే నువ్వే వెళ్లు. నేను చెప్పడం కంటే నువ్వు చెప్తేనే మీ అక్క ఉంటుంది. మీ అక్క ప్రమాదంలో ఉన్నా కూడా నీకు ఈగో అడ్డు వచ్చిందా.
జాను: నాకేం ఈగో లేదు నన్ను అక్క దగ్గరకు తీసుకెళ్లండి నేను చెప్తా.
మనీషా, నర్శింహకి కాల్ చేస్తుంది. లక్ష్మీ జోలికి వెళ్లొద్దని లక్ష్మీ చాలా డేంజర్ అని తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని తనని ఇబ్బంది పెట్టిందని డ్రాప్ అయిపోమని చెప్తుంది. దాంతో నర్శింహ తగ్గేదే లేదని రెచ్చిపోతాడు. ఇలా చేశావ్ ఏంటి మనీషా అని దేవయాని అంటే లక్ష్మీ మీద ఫుల్‌గా కోపం వచ్చేలా చేశానని ఇప్పుడు ఆయన లక్ష్మీతో కూర్చొని మాట్లాడకుండా చంపుకుంటారని అంటుంది. లక్ష్మీ వాళ్లు ఉన్న దగ్గరకు జాను, వివేక్ వెళ్తారు. ఇలా వచ్చారేంటి అని మిత్ర అడిగితే జాను వదినకు ఏదో చెప్పాలి అని అంటాడు. మిత్ర వివేక్ చెవిలో మళ్లీ గొడవనారా అని అంటే కాదు అన్నయ్య కలిసిపోయే విషయం అంటాడు. జాను దగ్గరకు లక్ష్మీ వెళ్లి నాకు ఏమైనా చెప్పాలా అని అంటుంది. దానికి జాను ఇవన్నీ మనకు అవసరమా దీని వల్ల నీకు ఏమైనా అవుతుందని అంటే ఈ పేదవాళ్ల పక్కన మనం ఉండాలని అంటుంది. దాంతో జాను వాళ్లు నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని నాకు కాల్ చేశారని చెప్తుంది.
లక్ష్మీ: నాకు ఏమైనా అవుతుందని భయపడుతన్నావా జాను.
జాను: చంపేస్తా అంటే భయపడనా మరి. ఎదుటి వాళ్లకి డబ్బు కావాలి అంటే ఇవ్వొచ్చు ఇంకేమైనా ఇవ్వొచ్చు కానీ ప్రాణాలు ఇచ్చేస్తావా. అక్కకి మీరు అయినా చెప్పుండి బావగారు.
మిత్ర: ఎలా చెప్తాను జాను లక్ష్మీ చేసేది మంచి పని కదా అడ్డుకోలేకపోతున్నా. ఊరిని సమాధి చేసి దాని మీద ఫ్యాక్టరీ కట్టాలి అనుకున్న వాళ్లని ఆపాలి అని అనుకుంటుంది. ఎలా ఆపగలను.
వివేక్: ఊరి వారి కోసం మీ అక్క ఇంత చేస్తే నువ్వు భయపడకూడదు ఆమె చెల్లి అయిన నువ్వు ఆమెలా ఆలోచించాలి వెనకడుకు వేయకు.
లక్ష్మీ: నువ్వు భయపడకు ఇంటికి వెళ్లు జాను.
జాను: నేను మాత్రం ఎందుకు వెళ్తా నేను ఇక్కడే ఉంటా.
వివేక్: నా కోసమా.
జాను: ఊరి కోసం.
మిత్ర: మనం అక్కా చెల్లెళ్ని కలపాలి అని ఎన్నో చేశాం కానీ దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు దీన్ని వదులుకోకూడదురోయ్. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోడిలా ఏడుస్తున్న కార్తీక్.. 2 రోజుల్లో ఆపరేషన్.. శౌర్య బతుకుతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

