Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషానే నా భార్య.. మిత్ర నిర్ణయంతో సవతుల పోరు తప్పదా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటున్నాడని దేవయాని పిల్లలతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని వివేక్‌ని పిలిచి రంగారావు మామయ్య వాళ్ల అమ్మాయి లలిత అని ఇద్దరిని పరిచయం చేస్తుంది. ఇంతలో జాను వస్తే వివేక్ నా భార్య అని పరిచయం చేస్తాడు. నాకు పెళ్లికి పిలవలేదని రంగారావు అంటే వాడు నాకే చెప్పలేదని అంటుంది. ఇక రంగారావు దేవయానితో నా కూతురిని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఇలా అయిపోయింది అంటాడు.
దేవయాని వాళ్లతో జరగాలి అని ఉంటే ఎప్పుడైనా జరుగుతుందని అంటుంది. ఇక లలిత బావ అని వివేక్ చేయి పట్టుకుంటుంది. జాను ఫీలయిపోతుంది. ఇక్కడుంటే ఇరుక్కుపోతానని వివేక్ వెళ్లిపోతాడు. మిత్ర తండ్రి దగ్గరకు వెళ్లి మనీషా గురించి ఓ నిర్ణయం తీసుకున్నానని అంటాడు. మనీషాకు నాకు మధ్య ఏం జరిగిందో మీకు తెలుసు కదా ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా మన పరువు కోసం మనీషా అబార్షన్ చేసుకోవాలి అనుకుంది. అందుకే నాకు మనీషాని బతికించుకోవడానికి వేరే దారి లేదని అందుకే తప్పని పరిస్థితిలో ఓ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. మరి లక్ష్మీ అన్యాయం అయిపోతుందని జయదేవ్ అంటే నేను ఇద్దరికీ న్యాయం చేస్తానని మిత్ర అంటాడు. అది నీ వల్ల కాదని తండ్రి అంటే ప్రయత్నిస్తాను అంటాడు. నిర్ణయం తీసుకున్నా తప్పు అయినా సరే మీరు అంగీకరించాలని అంటాడు. మిత్ర తండ్రితో చెప్పిన మాటలన్నీ లక్ష్మీ విని షాక్ అయిపోతుంది. ఏడుస్తూ వెళ్లిపోతుంది.
లక్ష్మీ వెళ్తుంటే మనీషా ఎదురొచ్చి నీ దారికే కాదు నీ జీవితానికి అడ్డు వస్తున్నా అని అంటుంది. మా పెళ్లి చూడటం తప్పు ఏం చేయలేవు అని అంటుంది. దానికి లక్ష్మీ రాని ప్రెగ్నెన్సీ వచ్చిందని నాటకం ఆడి ఆయన్ను తప్పుదారి పట్టించావ్ నీ సంగతి నేను తేల్చుతా అని అంటుంది. ఇప్పటి వరకు నాలుగు ఐదు సార్లు ఆయన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించావు కానీ అవ్వలేదు. ఈ సారి ఆయనే ఈ పెళ్లి ఆపుతారు. నీ గురించి తెలిసి నిన్ను గెంటేస్తారని ఇలా జరగకపోతే నేను భాగ్యలక్ష్మీనే కాదని లక్ష్మీ ఛాలెంజ్ చేస్తుంది.
పిల్లలు తల్లిదండ్రులు డల్‌గా ఉన్నారని ఏమైందో అడగటానికి జాను, వివేక్‌ల దగ్గరకు వెళ్తారు. అమ్మానాన్నలకు ఏమైంది ఎందుకు అలా ఉన్నారని అడుగుతారు. జాను, వివేక్‌లు ఏం కాలేదని సర్ది చెప్పబోతే దేవయాని వచ్చి మీకు వాళ్లు అబద్దాలు చెప్తున్నారని అంటుంది. కొడుకు కోడలు చెప్పొద్దన్నా వాళ్ల అమ్మానాన్న సమస్య వాళ్లకి తెలియాలి అంటుంది. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మీ నాన్న మనీషాలు పెళ్లి చేసుకుంటున్నారని మీ అమ్మ ఎక్కడికి పోతుందో ఏమైపోతుందో మాకు తెలీదని అంటాడు. ఇక జున్నుతో మీ అమ్మ ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి అని లక్కీతో ఇక నుంచి నువ్వు మనీషానే అమ్మ అనాలి అంటుంది. పిల్లులు బాధగా వెళ్లిపోతారు. నువ్వు మనిషివి కాదని వివేక్ తల్లిని తిడతాడు. పిల్లలు మిత్రతో మాట్లాడటానికి వెళ్తే మనీషా డోర్ మూసేస్తుంది. మేం నాన్నతో మాట్లాడుతాం అంటే వద్దని అంటుంది.
మా అమ్మ ఉండగా నువ్వు మా నాన్నకి భార్యవి అవ్వవు అని జున్ను అంటుంది. దాంతో మనీషా పిల్లల్ని నెట్టేస్తుంది. దాంతో లక్ష్మీ వచ్చి పట్టుకొని నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను అంటుంది. వాళ్ల నాన్నని వాళ్లు కలవాలి అంటే నీ పర్మిషన్ ఎందుకు అంటే రేపు మా పెళ్లి అయితే నువ్వు కూడా పర్మిషన్ తీసుకోవాలి అంటుంది. లక్ష్మీ పిల్లల్ని తీసుకెళ్లగానే మిత్ర వచ్చి ఏంటి సౌండ్ ఎవరు వచ్చారు అంటే ఎవరూ లేరు అని మిత్రని మనీషా పంపేస్తుంది. పిల్లలు లక్ష్మీతో అమ్మా నాన్న మనీషాని పెళ్లి చేసుకుంటారా మనం నలుగురం కలిసి ఉండాలమ్మా అంటారు. దాంతో లక్ష్మీ మనం కలిసే ఉంటాం ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

