Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అక్కాబావల రొమాన్స్ వివేక్‌తో రిహార్సల్ చేసిన జాను.. మనీషా సరయు ముంచేస్తుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషాని కోర్టుల చుట్టూ తిప్పుతూ రోడ్డుకి ఈడ్చేస్తా అంటూ సరయు మ్యానేజర్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode భాస్కర్ లక్ష్మీకి నిజం చెప్పే టైంకి అతని భార్య సుధ ఫోన్ పగలగొట్టేస్తుంది. లక్ష్మీకి నిజం తెలిస్తే మనీషా మనల్ని బతకనివ్వదని ఒక వేళ మీకు నిజం చెప్పాలి అనిపిస్తే నన్ను చంపేసిన తర్వాత వెళ్లి నిజం చెప్పమని అంటుంది. ఇక లక్ష్మీ ఎంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వదు. ఇక జయదేవ్ వచ్చి లక్ష్మీ భాస్కర్ అన్నది విని ఎవరు అని అడుగుతుంది. ఆ భాస్కర్ ఈ భాస్కర్ ఒకటి కాదని లక్ష్మీ కవర్ చేసేస్తుంది.
జయదేవ్: నీకో విషయం తెలుసా లక్ష్మీ లక్కీ తల్లి ఆ భాస్కర్ ఇంట్లోనే ఉండేది. భాస్కరే లక్కీని మిత్రకు చేరేలా చేశాడు. కానీ ఈ పార్వతి ఎవరో తెలీడం లేదు. ఆ భాస్కర్ వస్తేనే ఈ పార్వతి ఎవరో తెలుస్తుంది.
లక్ష్మీ: షాక్ అయి తనలో తాను భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఉన్నది నేనే కదా మరి ఆ రోజు నాకు పుట్టింది జున్ను మాత్రమే. మరి భాస్కర్ అన్నయ్య ఎవరి బిడ్డను మిత్ర గారికి ఇచ్చారు. ఈ పార్వతి లక్కీ తల్లి కాదని అన్నయ్య చెప్పాడు. ఇంకెదో చెప్పేలోపు ఫోన్ కట్ అయిపోయింది. గతంలో కూడా అన్నయ్య నాకు ఏదో చెప్పాలి అనుకున్నాడు. అది ఏ విషయం అయింటుంది. ఏమైనా లక్కీ కన్నతల్లి ఎవరో అన్నయ్యకు తెలుసు అన్నయ్యని ఎలా కాన్‌టాక్ట్ చేయాలి.
పార్వతి: యాక్టింగ్ అంటే వచ్చాను కానీ ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు నా వల్ల కాదు.
దేవయాని: ఒప్పుకున్న తర్వాత వల్లకాదు అంటే ఎలా. ఒప్పుకున్నాక అన్నీ చేయాలి.
పార్వతి: ఈ కేసులు ఉన్నాయని మీరు చెప్పలేదు కదా. పొట్ట కూటి కోసం వేషాలు వేసేదాన్ని నన్ను ఇందులోకి లాగకండి నేను వెళ్లిపోతాను.
దేవయాని: నువ్వు వెళ్లిపోతే ఆ లక్ష్మీ నిన్ను వదిలేస్తుందని అనుకుంటున్నావా లక్ష్మీ పాతాళంలో ఉన్న వెతికి మిత్ర ముందు పెడుతుంది.
మనీషా: నువ్వు కన్న తల్లి కాదని తెలిస్తే మిత్ర నిన్ను ఉండను. కోర్టులో నిజం తెలీకుండా మేం చూసుకుంటాం. కేసు గెలిపిస్తాం. సరయుకు కాల్ చేసి పార్వతి దొరికిపోయేలా ఉంది. లక్ష్మీ కోర్టులో నోటీసులు వేసింది. కోర్టులో మనమే గెలవాలి. వెంటనే మంచి లాయర్ చూడు.
సరయు: మంచి లాయర్ అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడే ఆలోచించుకో మనీషా ఇదంతా నీకు అవసరమా.
మనీషా: ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గేదే లేదు. నా ప్లాన్ పక్కాగా జరిగిపోవాలి మనమే కేసు గెలవాలి.
సరయు: పార్వతి బయట పడుతుంది రాజు గారు కానీ ఇందు నుంచి మనీషా బయట పడదు. లాయర్ ఫీజు అని దాని దగ్గర నుంచి చాలా డబ్బు గుంజుతా. దాని బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేయించి దాన్ని రోడ్డున పడేస్తాను.
జున్ను లక్కీ దగ్గరకు వెళ్లి నిన్ను ఆవిడతో పంచించకుండా అమ్మ ఆపుతుందని అంటుంది. ఇదంతా నా వల్లే అని నేను అమ్మని చూడాలి అనుకోకుండా ఉండుంటే బాగున్ను అని ఎమోషనల్ అవుతుంది. లక్కీ, జున్నుల మాటలు మిత్ర వింటాడు. మా అమ్మ లక్ష్మీ అమ్మలా ఉండాలి అనుకున్నా కానీ నాకు ఇప్పుడొచ్చిన ఆవిడ అమ్మలా లేదని లక్ష్మీ అమ్మే మా అమ్మ అనుకొని ఉంటే బాగుండేది అని అంటుంది. దానికి జున్ను ఇప్పుడేం కాదు లక్కీ మా అమ్మే మీ అమ్మ మన ఇద్దరి అమ్మ ఒకరే అని అమ్మ నీ కోసం నాన్న కోసం చాలా కష్టపడుతుందని అంటాడు. పిల్లల మాటలు విన్న మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. నీ కోసమే వచ్చానని మిత్ర అంటే దానికి లక్ష్మీ మళ్లీ తిట్టడానికే వచ్చారు కదా తిట్టుకోండి అని బుంగమూతి పెట్టుకుంటుంది. లక్కీ కోసం ఫైట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ తప్పుగా అనుకున్నందుకు సారీ అని చెప్తాడు. లక్కీ విషయంలో నిన్ను సరిగా అర్థం చేసుకోలేదని అంటాడు. లక్ష్మీని హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు.
ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటుండా జాను వచ్చి అక్కా అని పిలిచి చూసి సారీ అని చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ ఆగు అని చెప్పినా వినకుండా జాను వెళ్లిపోతుంది. మిత్ర సిగ్గైపోతాడు. జాను వేరేలా అర్థం చేసుకుంది ఏం అనుకోవద్దని లక్ష్మీ అంటే మిత్ర నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. జాను సరదాగా వివేక్ దగ్గరకు వెళ్లి బ్యూటిఫుల్ సీన్ చూశానని బావ అక్కని హగ్ చేసుకున్నాడని చెప్తుంది. ఎలా అర్థం కాలేదు అంటే సంతోషంలో జాను వివేక్‌ని హగ్ చేసుకొని చెప్తుంది. మరోవైపు సరయు తన మ్యానేజర్‌తో కలిసి కోర్టు దగ్గరకు వెళ్తుంది. మనీషా, పార్వతి, దేవయాని కూడా అక్కడికి వస్తారు. దిల్లీ నుంచి పెద్ద లాయర్‌ని మాట్లాడానని సరయు మనీషాతో చెప్తుంది. ఇంతలో లాయర్ చాణక్య వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

