Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial December 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లాయర్ నోటీస్ ఇచ్చి పార్వతికి చెక్ పెట్టిన లక్ష్మీ.. లక్కీ తల్లి కోసం లక్ష్మీకి చెప్పిన భాస్కర్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode పార్వతికి లాయర్ నోటీసులు లక్ష్మీ ఇచ్చి పాపని వెళ్లకుండా ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీని పార్వతి తీసుకెళ్లకుండా ఎలా ఆపాలా అని లక్ష్మీ ఆలోచిస్తూ ఉంటుంది. బయట పార్వతి లక్కీని తీసుకొని వెళ్తుండగా మీడియా మాట్లాడుతుంది. దాంతో జాను గదిలోకి వచ్చి లక్ష్మీని బయటకు వచ్చి ఏదో ఒకటి చేయమని అడుగుతుంది. కానీ లక్ష్మీ ఏం మాట్లాడదు. ఇక పార్వతి పాపని తీసుకెళ్తుండగా లాయర్ వచ్చి పాపని తీసుకెళ్లడానికి వీలు లేదు అంటారు.
పార్వతి: అది చెప్పడానికి మీరు ఎవరు.
లాయర్: చెప్తుంది నేను కాదు కోర్టు.
పార్వతి: నేను ఈ పాప కన్న తల్లిని తనని తీసుకెళ్లే హక్కు నాకు ఉంది.
లాయర్: మీరు పాప కన్న తల్లి అని నిరూపించుకొని తీసుకెళ్లాలి అప్పటి వరకు పాప ఇక్కడే ఉంటుంది. కాదని తీసుకెళ్తే కోర్టు దిక్కరణ కింద శిక్ష పడుతుంది. ఇవిగోండి కోర్టు నోటీసులు. మీరే పాప కన్న తల్లి అని కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించి అప్పుడు పాపని తీసుకెళ్లండి లేదంటే శిక్షార్హలు అవుతారు.
పార్వతి: పాప నా కన్న కూతురు కాదని ఎవరు చెప్పారు.
లాయర్: లక్ష్మీ అనే ఆమె కోర్టులో ఫిటిషన్ వేసింది. పాపని మీరు బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీస్ స్టేషన్‌లో కేసు వేసింది. మీ మీద కేసు ఫైల్ అయింది. మీరు కోర్టుకు రావాల్సిందే. అప్పటి వరకు మీరు ఈ ఇళ్లు దాటి ఎక్కడికీ వెళ్లొద్దు లోపలికి వెళ్లండి.
మనీషా: లక్ష్మీ కోర్టు నోటీసులు ఇవ్వడం ఏంటి మిత్ర మీడియాలో పోయిన పరువు పోయింది ఇప్పుడు కోర్టులో కూడా పోవాలా.
పార్వతి: నా కన్న కూతురి కోసం నేను ఇంత అవమాన పడాలా. ఇదేనా మీ సంస్కారం.
జయదేవ్: నా కోడలు ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది.
మనీషా, దేవయానిలు కావాలనే లక్ష్మీని మిత్ర ముందు తిడతారు. దాంతో మిత్ర లక్ష్మీ ఎక్కడని అడుగుతుంది. మరోవైపు సరయు రాజుతో లక్ష్మీ కావాలనే మీడియాని కోర్టుని ఇన్వాల్వ్ చేసిందని అంటుంది. దాంతో రాజు కోర్టులో పార్వతి నిజం చెప్తే మనకు ప్రాబ్లమ్ అవుతుందని అంటే దానికి సరయు మనకి ఏం కాదు ఏమైనా అయితే మనీషా పని అయిపోతుందని అంటుంది. మరీ ఎక్కువైతే మనీషానే తనతో ఈ పని చేయించిందని చెప్తా అని అప్పుడు మిత్ర మనీషాని మెడ పెట్టుకొని గెంటేస్తాడని అంటుంది. ఇంటి లోపలికి వెళ్లి మనీషా లక్ష్మీ లక్ష్మీ అని అరుస్తుంది. మా అక్క తప్పు చేసినట్లు అలా మాట్లాడుతావేంటి అని జాను మనీషాతో అంటుంది. ఇంతలో లక్ష్మీ కిందకి వస్తుంది.
లక్ష్మీ: అన్నీ నేనే చేశాను. లక్కీ కోసం చేశాను.
పార్వతి: అంటే నా కూతురిని నాకు కాకుండా చేస్తావా రక్త సంబంధాన్నే అనుమానిస్తావా.
లక్ష్మీ: మీది రక్తసంబంధమో కాదో నాకు తెలీదు. నేను నా కూతురిలా చూసుకొని రక్తం ఇచ్చి కన్న కూతురిలా చూసుకున్నా.
మిత్ర: ఇదంతా ఎవరికి చెప్పి చేశావ్ లక్ష్మీ.
జయదేవ్: ఎవరికి చెప్పి చేయాలిరా లక్కీ నీ కూతురు మాత్రమే కాదు లక్ష్మీకి కూడా కూతురే.
మనీషా: లక్కీ ఇక్కడే ఉండేలా పార్వతిని ఒప్పించాను కానీ ఈ లక్ష్మీ అంతా నాశనం చేసింది.
జయదేవ్: లక్ష్మీ నాశనం చేయలేదు మంచి చేసింది చూడు మిత్ర అసలు ఈ పార్వతి లక్కీ కన్న తల్లి కాకపోతే.. లక్కీని కావాలనే తీసుకొని వెళ్లిపోయి ఎవరికైనా అమ్మేస్తే. ఆ తర్వాత నిజం తెలిసిన రోజు ఎంత బాధ పడినా లక్కీ తిరిగి వస్తుందా. ఏయ్ అసలు లక్కీ లేకుండా నువ్వు బతకగలవారా. ఇప్పటి వరకు లక్ష్మీ ఏం చేసినా నీ కోసం లక్కీ కోసమే చేసిందిరా. ఈ పార్వతి లక్కీ కన్న తల్లి కాదనే అనుమానంతో లక్ష్మీ ఇదంతా చేస్తుంది కానీ నీకు అన్యాయం చేయాలని కాదు. లక్ష్మీ అనుమానం నిజమై లక్కీ తల్లి ఈమె కాకపోతే లక్కీ అన్యాయం అయిపోతుందిరా అనాథ అయిపోతుందిరా. రోడ్డు మీద భిక్షాటన చేసే ఎంతో మందిలో తను ఒకర్తి అయిపోతుందిరా. లక్కీ తల్లి ఎవరైనా కావొచ్చు కానీ తన అసలైన తల్లి లక్ష్మీనేరా అందుకే పోరాడు తుంది.
పార్వతి: నా కూతురిని నాకు కాకుండా చేస్తున్నావ్ నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు.
లక్ష్మీ: లక్కీ నీ కూతురని కోర్టులో తేల్చుకో అప్పుడు నేనే నీ కూతురిని ఇస్తాను. కాదని తేలిందో అప్పుడు నీ సంగతి నీ వెనక ఉన్న వాళ్ల సంగతి తేల్చుతా. లక్కీని నేను కనకపోచ్చు కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ బాధ్యత ఉంది, నా భర్త ప్రాణాలు లక్కీలో ఉన్నాయి అందు కోసం ఏమైనా చేస్తా.
భాస్కర్ తిండి దగ్గర కూర్చొంటాడు. కానీ ముద్ద కూడా దిగదు. తిండి దగ్గర నుంచి లేచేసి చేయి కడిగేస్తాడు. లక్ష్మీ ఫోన్‌కి కాల్ చేస్తాడు. జున్ను మాట్లాడి లక్ష్మీకి ఫోన్ ఇస్తాడు. లక్కీ తల్లి తను కాదని లక్కీ తల్లి ఎవరో నాకు తెలుసని అంటాడు. ఎవరు అన్నయ్యా అని లక్ష్మీ అడుగుతుంది. భాస్కర్ చెప్పే టైంకి భాస్కర్ భార్య వచ్చి ఫోన్ పగలగొట్టేసి సిమ్ విరిచేస్తుంది. నిజం చెప్తే మనీషా మన ప్రాణాలు తీసేస్తుందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

