అన్వేషించండి

Chinni Serial Today May 7th: చిన్ని సీరియల్: లోహి తన చెల్లి అని చందు వరుణ్‌కి చెప్పేస్తాడా! చావు బతుకుల మధ్య ఉన్న శ్రేయ మెడలో మ్యాడీ తాళి కడతాడా!

Chinni Serial Today Episode May 7th: శ్రేయ చావు బతుకుల మధ్య ఉందని తాళి కట్టమని మ్యాడీతో వసంత చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత వసంత చెప్పడంతో హాస్పిటల్‌లో నుంచి చిన్ని మెడ పట్టుకొని గెంటేస్తుంది. అప్పుడే చందు లోహితను మ్యాడీ ఫ్యామిలీతో చూసి షాక్ అయిపోతాడు. లోహితకు పెళ్లి అయింది అని కూడా చందుకి తెలిసిపోతుంది. మ్యాడీ లోహితో వాళ్లు అంటే ఏదో చెప్తారు.. నువ్వు అలా చేస్తావా.. చదువుకున్నావ్ కదా ఏం చేయాలో చేయకూడదో తెలీదా.. చిన్నికి ఎవరూ లేరు అనుకున్నావా నేను ఉన్నా ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. మ్యాడీ చిన్నిని తీసుకొని వెళ్తాడు. అప్పుడే చిన్ని చందుని చూస్తుంది. 

వరుణ్ లోహితో మా బావ కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.. అదే ఇంకెవరు అయిన అయితే చెంప పగల గొట్టేసేవాళ్లు నిజానికి నీ భర్తగా నేనే ఆ పని చేయాలి అని వరుణ్ అంటాడు. చందు చూసి అంటే లోహిత మ్యాడీ వాళ్ల బావని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉందన్నమాట అనుకుంటాడు. చందు ఓ చోట బాధగా కూర్చొంటే అక్కడికి చిన్ని వెళ్తుంది. ఏంటి చిన్ని ఇది లోహి మహి వాళ్ల బావని పెళ్లి చేసుకోవడం ఏంటి.. మీతో పాటు మీ ఇంట్లో ఉండటం ఏంటి అని అడుగుతాడు. లోహి గురించి మనకు తెలిసిందే కదా చందు.. అని జరిగింది అంతా చందుకి చిన్ని చెప్తుంది. వరుణ్‌కి లోహికి పెళ్లి అయిన తర్వాత తెలిసింది తను మన లోహిత అని.. నిజనిజాలు వరుణ్ వాళ్లకి చెప్పమని నేను చాలా ప్రయత్నించాను.. కానీ వినలేదు.. పైగా నన్ను ఆ ఇంట్లో నుంచి పంపేయాలని చూస్తుందని చిన్ని అంటుంది. దాని సంగతి ఇప్పుడే చెప్తా అని చందు అంటే వద్దు తర్వాత మాట్లాడుదువు.. తను చేసిన తప్పు ఎలా సరిదిద్దాలో తర్వాత చూద్దాం అని చిన్ని అంటుంది. మ్యాడీ వస్తున్నాడు లోహి విషయం ఏం మాట్లాడొద్దు అని చిన్ని అంటుంది. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కన్నీటి సాక్షిగా తల్లిని నిలదీసిన వల్లీ! ప్రేమ నగలు తాకట్టు గుట్టురట్టు!

చందు చిన్ని వాళ్లతో మీకు పెళ్లి అయిందని తెలిసి కూడా  శ్రేయ అలా ఎలా చేసిందో అర్థం కావడం లేదు అని చందు అంటే.. అది శ్రేయ తప్పే కాదు.. చిన్నప్పటి నుంచి తనని నన్ను పెళ్లి చేస్తామని పెంచారు.. చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసింది కాబట్టి మా ఇద్దరినీ విడదీసి శ్రేయకి నాకు పెళ్లి చేయాలి అని ఇప్పటికీ అనుకుంటున్నారు.. అని మ్యాడీ అంటాడు. ఇక చందు సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తాడు. వీళ్లని పట్టుకుంటే హరి అంకుల్ ఎక్కడుంటాడో తెలుస్తుందని చిన్ని వాళ్లు అనుకుంటారు. శ్రేయ డిశ్చార్జీ అయిన తర్వాత పట్టుకుందాం అని అనుకుంటారు. ఇంతలో బాలరాజు కాల్ చేస్తాడు. లాయర్ హరిని కాల్ చేశారా.. అని బాలరాజు అంటే లాయర్ అంకుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని మ్యాడీ చెప్తాడు. బాలరాజు మనసులో దేవానే చేయించుంటాడు అని అనుకుంటాడు.

Also Read: తన భర్తను రౌడీలతో మరోసారి కిడ్నాప్ చేయించిన ప్రియంవద...తనకు ఏమైనా అవుతుందేమోనని కంగారుపడిన లక్ష్మీ

మరోవైపు లోహితకు కొత్త నెంబరు నుంచి కాల్ వస్తుంది. లోహిత లిఫ్ట్ చేయకపోవడంతో వరుణ్ మాట్లాడమని అంటాడు. లోహిత సిగ్నల్ లేదని పక్కకెళ్లి మాట్లాడుతుంది. ఇంతలో చందు వచ్చి లోహిత దగ్గర నిల్చొంటాడు. లోహిత షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటావా.. అని అడుగుతాడు. నీ చెల్లి గొప్పింటి కోడలు అయినందుకు సంతోషించాలి కానీ అంటావేంటి అని అడుగుతుంది. నువ్వు నిజంగా తప్పు చేయకుండా గొప్పింటి కోడలు అయ్యుంటే సంతోషించేవాడిని.. కన్నతల్లికి తోడబుట్టిన అన్నయ్యకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎలా సంతోషిస్తా అని అడుగుతాడు. అన్నయ్య అయినా అమ్మ అయినా పెంచి పెద్ద చేసిన వరకే.. పెళ్లిలో దూరకూడదు అని అంటుంది. నీ మోసానికి మరో పర్సన్ బలైపోతే నేను చూస్తూ ఉండను.. నీ నిజస్వరూపం వరుణ్ ముందు పెడతా అని అంటాడు. లోహిత షాక్ అయిపోతుంది. అలాగే చెప్పు.. అలాగే నాకు తలకొరివి పెట్టమని చెప్పు అని అంటుంది. లోహి బ్లాక్‌మెయిల్‌తో చందు షాక్ అయిపోతాడు. 

Also Read: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన జేడీ..? ధాత్రికి ఊహించని షాక్‌ ఇచ్చిన అవినాష్

వరుణ్ అటు నుంచి వెళ్తుంటే లోహిత పిలిచి చెప్పు అని అంటుంది. ఏంటి అని వరుణ్ అంటే మీ చెల్లి శ్రేయ కండీషన్ గురించి లోహి చెప్పింది సార్.. అదే అడుగుతున్నా.. శ్రేయకి ఏం కాదు అని చందు అనేస్తాడు. మరోవైపు శ్రేయని కలవడానికి నాగవల్లి వెళ్తుంది. శ్రేయ మాస్క్ తీసుకొని ఎలా ఉంది నా నటన అని అంటే ఇప్పటి వరకు అంతా ఓకే మ్యాడీ నీ మెడలో తాళి కట్టినట్లు చేస్తాం.. ఆ తాళి నీ గుండెల మీద పడగానే కళ్లు తెరు.. మెల్లగా మ్యాడీని చూసి దండం పెట్టాలి అని అంటుంది. ఇక డాక్టర్‌తో నాగవల్లి నేను చెప్పినట్లు చెప్పండి అంటుంది. 

నాగవల్లి వెళ్లి వచ్చిన తర్వాత అందరూ శ్రేయకి ఎలా ఉందని అడుగుతారు. చెప్పలేను అని నాగవల్లి ఏడుస్తుంది. డాక్టర్ బయటకు వచ్చి శ్రేయ పరిస్థితి బాలేదు.. అందరూ తన దగ్గర ఉండండి అని అంటుంది. వసంతం చాలా చాలా ఏడుస్తుంది. శ్రేయ దగ్గరకు అందరూ చూస్తారు. నా కూతురు ప్రశాంతంగా కన్ను మూయాలి అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని చిన్నిని వసంత పంపేస్తుంది. చిన్ని వెళ్లిపోయిన తర్వాత వసంత మ్యాడీతో రేయ్ మ్యాడీ నీభార్యగా బతికే అదృష్టం దానికి లేదు.. కనీసం నీ భార్యగా అయినా తనని చనిపోయే అదృష్టం ఇవ్వరా.. తన మెడలో మూడు ముళ్లు వేస్తావా అని అడుగుతుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget