Chinni Serial Today January 6th: చిన్ని సీరియల్: మధు-మ్యాడీల బంధం ప్రశ్నార్థకం! లోహితకు సీక్రెట్స్ తెలిసిపోయావా! ఒకే బెడ్ మీద మధు, మ్యాడీ!
Chinni Serial Today Episode January 6th మధు, మ్యాడీని మాటలతో రెచ్చగొట్టి బెడ్ మీద పడుకునేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుకి మరో పెళ్లి చేస్తాను అని మహి అంటే నువ్వే నా భర్త అని మధు అంటుంది. అది పెళ్లి కాదు.. నువ్వు నా భార్య కాదు.. నువ్వు నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే.. చిన్నిని ప్రేమించిన నేను ఇంకెవరినీ ప్రేమించను.. భార్యగా చూడను.. నలుగురిలో మాత్రమే మనం భార్యభర్తలం. గదిలో ఫ్రెండ్స్ అంతే.. అలాగే ఉంటాం.. ఉంటున్నాం అని మ్యాడీ తేల్చి చెప్పేస్తాడు. మధు షాక్ అయిపోతుంది.
దేవాకి మినిస్టర్ కాల్ చేసి మీ కొడుకు పెళ్లి జరిగింది కదా.. ప్రపంచం మొత్తం వీడియో వైరల్ అయింది.. పెళ్లిని అంగీకరించారా అని అడిగితే మీరు మీ కొడుకుకి ఇలా పెళ్లి అయితే ఏంచేస్తారో నేను అదే చేస్తా అంటాడు. దేవాకి చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇరిటేట్ అయి ఫోన్ విసిరేస్తాడు. నాగవల్లి వచ్చి ఏమైందని అడిగితే అందరి ముందు పరువు పోయింది.. నా రాజకీయ భవిష్యత్ పోయిందని దేవా అంటే ఏం కాదు బావ.. నీ పొలిటికల్ కెరీర్ బాగుండేలా నేను ప్లాన్ చేస్తున్నా అందరి ముందు నువ్వు ఈ పెళ్లి ఇష్టం అన్నట్లు ఉండు మిగతా అంతా నేను నడిపిస్తా అని నాగవల్లి చెప్తుంది.
స్వరూప, సుబ్బు కావేరి ఫొటో ముందు నిల్చొని కావేరి ఫొటోతో మాట్లాడుతారు. నువ్వు చెప్పినట్లే చిన్నిని తన గతానికి దూరంగా పెంచామని కానీ మధు రాజమండ్రిలో చదివినప్పుడు నుంచి గతానికి చేరువైందని.. తనని ఎంతో ప్రేమించిన మహినే పెళ్లి చేసుకుంది.. మ్యాడీ వాళ్ల అమ్మ హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లింది.. అత్తింట్లో నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడు తల్లీ అని అనుకుంటారు.
మధు మ్యాడీ మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ గదిలోకి వస్తాడు. మధుకి సారీ చెప్తాడు. నిన్న కూడా ఇలాగే సారీ చెప్పావ్.. మ్యాడీ, మధు పేర్లు మర్చిపో అని మధు అంటుంది. మర్చిపోను అని మ్యాడీ అంటే పేర్లే మర్చిపోలేకపోతే మనకు జరిగిన పెళ్లి ఎలా మర్చిపోతా అని మధు అంటుంది. ఇక ఆ టాపిక్ వదిలేయ్ అని మ్యాడీ అంటాడు. పడుకుందామని చెప్పి మ్యాడీ బెడ్ షీట్, పిల్లో తీసుకొని బయటకు వెళ్తే బాగోదని మధు ఆపుతుంది. దాంతో మ్యాడీ కింద పడక వేసుకుంటాడు. నేను కింద పడుకుంటా.. నువ్వు బెడ్ మీద పడుకో అని అంటాడు.
మ్యాడీ ఇష్టం లేదు అని అంటే నువ్వు రావడం లేదు నా పక్కన బెడ్ మీద పడుకోవడం లేదు అంటే నీ మనసు చలిస్తుంది అనే కదా అని అంటుంది. దాంతో మ్యాడీ కోపంగా వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. మధు, మ్యాడీ ఒకే గదిలో ఉంటున్నారని లోహితకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నిజంగా మ్యాడీ, మధు ప్రేమించుకొనే పెళ్లి చేసుకున్నారా.. లేదంటే మధుని కాపాడటానికి మ్యాడీ అలా చెప్పాడా.. ఇద్దరూ ఎలా ఉన్నారో రూం దగ్గరకు వెళ్లి సీక్రెట్‌గా వాళ్ల మాటలు వినాలి అని లోహిత వెళ్తుంది.
లోహిత లేచి మ్యాడీ వాళ్ల గది దగ్గరకు వచ్చి తొంగి చూస్తుంటే ప్రమీల చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. దాంతో లోహిత మీకు కూడా మంచి నీరు కావాలా అని అడగటానికి వచ్చానని అంటుంది. ఎప్పుడూ లేదని ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అని అంటుంది. నీ మాటలు చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. నిన్ను ఓ కంట కనిపెట్టమని చిన్నమ్మాయికి చెప్తా అని ప్రమీల అంటే వద్దని లోహిత బతిమాలుతుంది. ప్రమీల వెళ్లిపోయిన తర్వాత లోహిత తొంగి చూస్తూ ఉంటుంది. ఆ సౌండ్‌కి మధు లేచి డోర్ తీస్తే లోహిత మధు కాళ్ల దగ్గర పడుతుంది.
మధు, లోహితను బయటకు తీసుకెళ్లి ఎందుకు డోర్ దగ్గర నిలబడ్డావని అడుగుతుంది. వేరే వాళ్ల రూం దగ్గరకు కాదు మీ రూంకి వెళ్లాలి అని అంటుంది. నువ్వేమైనా గుడిలో పొగ పెట్టావా అని మధు అడిగితే నేనేం పెట్టలేదు.. అని అంటుంది. ఉదయం మధు స్నానం చేసి ఇళ్లంతా ధూపం వేసి దేవుడికి పూజలు చేసి హారతి ఇస్తుంది. అందరూ ఉదయం ఏంటి అని బయటకు వస్తారు. ఏంటి ఇది అని నాగవల్లి అడిగితే కొత్త కోడలితో పూజ చేయించడం మన ఇంటి పద్ధతి కదా అని ప్రమీల చెప్తుంది. అయితే చేయించేస్తావా అని నాగవల్లి అడుగుతుంది. నాగవల్లి కోపం అయిందని ప్రమీల షాక్ అయితే నాగవల్లి నవ్వుతూ కంగారు పడకు అక్క నేనే దగ్గరుండి పూజ చేయిద్దాం అనుకున్నా నువ్వు చేయించేశావ్ అని కవర్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















