అన్వేషించండి

Chinni Serial Today February 6th: చిన్ని సీరియల్: మధు కిడ్నాప్ వెనక అసలు సూత్రధారి ఎవరు? తండ్రిని అనుమానించిన మ్యాడీ!

Chinni Serial Today Episode February 6th మధుని దేవానే కిడ్నాప్ చేశాడు అని తిలక్ పోలీసుల్ని తీసుకొని ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు కనిపించడం లేదని మ్యాడీ గదిలో బాధగా ఉంటాడు. గదిలో ఉన్న మొక్క చూసి దానికి భర్తగా నేనే నీరు పోయాలి అన్నారు.. నేను భర్తగా అలా చేయడం లేదు అని ఇలా ఎవరో కిడ్నాప్ చేసినట్లు ఉన్నారు అని మ్యాడీ మొక్కకి నీరు పోసి సంవత్సరానికి ఒక్కసారి పూసే పువ్వుని మధుకి ఇస్తా అనుకుంటాడు. ఇంతలో నాగవల్లి చూసి వీడేంటి ఇలా చేస్తున్నాడు.. కొంపతీసి మధుని భార్యగా ఒప్పుకున్నాడా అనుకుంటుంది. 

మ్యాడీ నాగవల్లిని చూసి నా వల్లే మధుకి ఇలా అయింది మమ్మీ అంటాడు. తన జాతకంలో అలా ఉంది నాన్న అని నాగవల్లి అంటే మార్చాలి మమ్మీ తన జాతకం మార్చాలి.. ఇప్పటి వరకు నేను తనని ఫ్రెండ్‌గానే  చూశా కానీ చిన్నిని నేను ఎంతలా ప్రేమించానో తను నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తుంది.. తనతో నేను ఎన్నో మాట్లాడి అనుకున్నా.. కానీ అనుకోని ఈ కిడ్నాప్ వల్ల మధు నాకు దూరం అయింది.. కానీ మమల్ని ఎవరూ దూరం చేయలేరు మమ్మీ.. దూరం చేయలేరు మధు ఎక్కడుందో తెలుసుకుంటా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంటికి తీసుకొస్తా అంటాడు. నాగవల్లి ఏం మాట్లాడకుండా ఉంటే.. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావ్.. నేను ఇదంతా చేయలేనా అంటే నువ్వు చేస్తావ్ నాన్న అని నాగవల్లి అని మనసులో వీడేంటి ఇలా ప్లేట్ తిప్పేశాడు వీలైంత త్వరగా ఆ చిన్నికి వీడి ప్రేమకి సమాధి కట్టాలి అనుకుంటుంది. 

తిలక్ పోలీసుల్ని తీసుకొని మినిస్టర్ దేవా ఇంటికి వస్తాడు. మంత్రిగారు అని దేవాని పిలుస్తాడు. పోలీసులు దేవాతో తిలక్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని చెప్తాడు. దేనికి అని దేవా అడిగితే కిడ్నాప్ గురించి అని అంటాడు. కిడ్నాప్ అయింది సాక్ష్యాత్తు మీ కోడలు.. మీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ కోడలే కిడ్నాప్ అయ్యింది మంత్రిగారు అని తిలక్ అంటే.. మా కోడలు కిడ్నాప అయితే మేం ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వడం ఏంటి అని దేవా అడిగితే నీ మీద నువ్వు కిడ్నాప్ ఇవ్వలేవు కదా.. నీ కోడల్ని నువ్వే కిడ్నాప్ చేశావ్ కదా అని తిలక్ అంటాడు. పొద్దున్నే మందు కొట్టావా.. రాత్రి తాగింది దిగలేదా అని దేవా అడిగితే మందులు నీకే అలవాటు నాకు కాదు.. వాళ్ల పెళ్లి నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వే కిడ్నాప్ చేసుంటావ్ అంటాడు. తిలక్ గారు మీరు ఇలా అనుమానించడంలో తప్పు లేదు.. కానీ మేం వాళ్ల పెళ్లిని ఒప్పుకున్నాం కాబట్టే అంత ఖర్చు పెట్టి రిసెప్షన్ చేశాం అని నాగవల్లి అంటుంది. దానికి తిలక్ మీ మీద అనుమానం రాకుండా ముందే ప్లాన్ చేసి అలా రిసెప్షన్ చేసి ఇప్పుడు ఇలా కిడ్నాప్ చేసుండొచ్చు కదా అంటాడు. 

మ్యాడీ తిలక్‌తో తిలక్ గారు మా డాడీ ఫ్రెండ్‌గా మీ మీద నాకు అభిమానం.. కానీ మా డ్యాడీని ఇలా అని మీ విలువ తగ్గించుకోవద్దు.. మా డ్యాడీ, మమ్మీ ఎలాంటి వాళ్లో నాకు తెలుసు.. నా కోసం ఏం చేశారో కూడా నాకు తెలుసు.. అలాంటిది నేను ప్రేమించి అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా చేస్తారు.. మా డ్యాడీ ఫ్రెండ్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా లేదంటే మరోలా ఉండేది అని అంటాడు. కొడుకు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్,, కానీ మీ నాన్న ఫ్రెండ్‌గా అతని గురించి నాకు తెలుసు అంటాడు. దేవా కోపంగా నోర్ముయ్ ఎదిగిన నా లాంటి వాడిని చూసి నీలాంటి వాడు ఇలాంటి నిందలే వేస్తాడు.. నా గురించి నా కొడుకుకి బాగా తెలుసు అని అంటాడు. పోలీసులు రెండు రోజుల్లో మధుని తీసుకొచ్చి కిడ్నాప్ చేయాలని నిరూపించుకోవాలి అని అంటారు. మ్యాడీ కోపంగా రెండు రోజుల్లో మధుని నేను తీసుకొస్తా ఇంతలో మీరు మా డ్యాడీ గురించి తప్పుగా ప్రచారం చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్తాడు. 

మ్యాడీ గదిలో పరధ్యానంగా ఉంటే నాగవల్లి, దేవా వెళ్తారు. ఏంటి మధు గురించి ఆలోచిస్తున్నావా అని నాగవల్లి అడిగితే లేదు డ్యాడీ గురించి ఆలోచిస్తున్నా అంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే డ్యాడీ ఆ తిలక్ చెప్పినట్లు మీరు మధుని కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు. దేవా, నాగవల్లి షాక్ అయిపోతారు. మ్యాడీకి అనుమానం వచ్చేలా చేయడానికే ఆ తిలక్ గాడు పోలీసుల్ని తీసుకొచ్చి ఇలా చేశాడు.. రాజకీయంగా ఏం చేయలేక మన కుటుంబంలో గొడవలు పెట్టాలి అని చూస్తున్నాడు ఆ తిలక్,, చూడు నాన్న నువ్వు కోరుకున్న ప్రతి చిన్ని సంతోషం మాత్రం ఇవ్వాలి అనుకున్నది నేను మీ డ్యాడీ మాత్రమే మా తర్వాత మధు.. మా ముగ్గురిని ఎప్పుడూ అనుమానించకు అని అంటుంది. మ్యాడీ తండ్రికి క్షమాపణ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget