అన్వేషించండి

Chinni Serial Today february 2nd: చిన్ని సీరియల్: మధు చిన్ననాటి ఫోటోలు మ్యాడీ చూసేశాడా! తిలక్ ఎంట్రీ! దేవా ఏం చెప్పాడంటే?

Chinni Serial Today Episode february 2nd చంటి మ్యాడీకి గిఫ్ట్‌గా మధు చిన్ననాటి ఫొటోలు ఇవ్వడం మధు వాటిని మ్యాడీ చూడకుండా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా మందు తాగుతూ చిన్నిని ఎలా కనిపెట్టాలి.. ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. తన మనిషి నాయక్‌ని పిలిచి బాలరాజు కోసం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన చిన్ని గురించి చెప్పిన సెంట్రీకి కాల్ చేయమని అంటాడు. నాయక్ వెంటనే కాల్ చేయడంతో మళ్లీ ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతాడు. వచ్చిందని చెప్పడంతో సీసీ టీవీ ఫుటేజ్ వెంటనే పంపించమని అడుగుతాడు.  

చిన్ని దొరికినంత సంబరపడిపోతాడు దేవా.. మరోవైపు చంటి లోహిత చెప్పినట్లు మధు చిన్ననాటి ఫొటోలు ఫ్రేమ్ చేసి తీసుకొస్తాడు. అందరినీ పిలిచి బావగారికి గిఫ్ట్ ఇవ్వనున్నాను అంటాడు. ఏంటి అది అని మ్యాడీ మధు అందరూ అడిగితే ఈ గిఫ్ట్‌లో నీ చిన్నప్పటి ఫొటోలు ఉన్నాయి అని అంటాడు. మధు, స్వరూప, సుబ్బారావు షాక్ అయిపోతారు. మ్యాడీ ఆ ఫొటోలు చూస్తే మీ అక్క పని అయిపోతుంది..

బతికుండి కూడా జీవచ్ఛవంలా బతుకుతుంది అని లోహిత అనుకుంటుంది. చంటి మ్యాడీకి గిఫ్ట్ ఇస్తాడు. మ్యాడీ తీసుకొని ఓపెన్ చేస్తాడు. మ్యాడీ సరిగ్గా చూసే టైంకి మధు తీసుకుంటుంది. ఎందుకు లాగేసుకున్నావ్ అని మ్యాడీ అడిగితే ఇవి ఇక్కడ చూడకూడదు అని మ్యాడీ చెవిలో ఇందులో కొన్ని ఫొటోలు నువ్వు మాత్రమే చూడాలి అని అంటుంది. అందరూ చూస్తే ఏమవుతుందని మ్యాడీ అడిగితే నాకు సిగ్గేస్తుంది అని అంటుంది. మ్యాడీ అందరితో మేం ఇద్దరం ఉన్నప్పుడు చూసుకుంటాం అని అంటాడు. మధు తల్లికి ఇచ్చి ఫొటోలు దాయమని చెప్తుంది. 


మధు లోహిత దగ్గరకు వెళ్లి ఈ ప్లాన్ నీదే కదా అంటుంది. నాకేం తెలీదు అని లోహిత అంటే ఇలాంటి సర్‌ఫ్రైజ్లు ఇచ్చే అంత తెలివి వాడికి లేదు ఇది కచ్చితంగా నీ ప్లానే.. నేనే చిన్ని అని మ్యాడీ చెప్పాలని చూస్తే నీ పని చెప్తా అని మధుమిత అంటుంది. ఏం చేస్తావే అని లోహిత అడిగితే మ్యాడీకి నేనే చిన్ని అని ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు.. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిజనిజాలు మ్యాడీకి తెలిసేలా చేసి అప్పుడు నేనే చిన్ని అని చెప్తా ఈలోపు నువ్వు ఇలా చేస్తే నీ సంగతి చెప్తా.. కోటీశ్వరురాలిని అని చెప్పి వరుణ్‌ని వలలో వేసుకొని పెళ్లి చేసుకొని చీటింగ్ చేశావ్,, నీ వాళ్ల గురించి అడిగితే జర్మన్‌లో ఉన్నారు.. జపాన్లో ఉన్నారు అని చెప్తున్నావ్,, ఇంకోసారి నన్ను మ్యాడీని దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తే నువ్వు చేస్తున్న చీటింగ్ గురించి నాగవల్లి అత్తయ్యకి చెప్తా.. సరళ అత్తయ్యని చందుని తీసుకొచ్చి నిజం చెప్పిస్తా..  అప్పుడు నీ బతుకు ఏం అవుతుందో ఆలోచించుకో అని అంటుంది.  

సుబ్బారావు, సరళలు తిలక్‌ని కలుస్తారు. మధుని మ్యాడీ వాళ్లకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని నాగవల్లి, దేవా చాలా కోపంగా ఉన్నారు.. వాళ్లు రాజకీయనాయకులు అని గుర్తుంచుకోండి.. అందరి ముందు కోడలిగా ఒప్పుకున్నా వెనకాలే గోతులు తవ్వుతారని గుర్తించుకోండి అని చెప్తాడు. మీ అమ్మాయి ఎప్పటికప్పుడు అక్కడ జరిగేవి నన్ను ఓ మేనమామ అనుకొని అన్ని చెప్తుంది. నా మేనకోడలిని చూసుకోవడం నా బాధ్యత. మీ ఇంటి చుట్టే నా మనుషులు ఉన్నారు.. మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా ఏం చేయాలి అంటే అని విషయం చెప్తాడు. తిలక్ సుబ్బారావు వాళ్లతో మాట్లాడటం దేవా చూస్తాడు. తిలక్ మధు తల్లిదండ్రులను ఎందుకు కలుస్తున్నాడు.. చిన్నికోసమే తిలక్ మళ్లీ వచ్చాడా అని అనుకుంటాడు. 

మ్యాడీ మధు ఫొటో చూస్తూ ఉంటాడు. పెళ్లాం ఫోటో చూసి మురిసిపోతున్నావా నాన్న అని ప్రమీల అడిగితే అవును పెద్దమ్మా అని మ్యాడీ అంటాడు. తర్వాత తేరుకొని కాదు అంటాడు. పెళ్లి తర్వాత నీ ముఖంలో ఇంత సంతోషంగా మొదటి సారి చూస్తున్నా జీవితాంతం నువ్వు ఇలాగే ఉండాలి అంటుంది. నువ్వు మధు అంత క్లోజ్ అయినా మీకు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే రాలేదు కానీ మీరు పెళ్లి అయింది అంటే ఆ దేవుడు మీకు రాసి పెట్టాడు. మీరు ఎంత సంతోషంగా కాపురం చేసుకుంటారో మీ చేతిలో ఉంది.. ఎప్పటికీ గొడవలు వచ్చినా సంతోషంగా ఉండాలి అని అంటుంది.

పిచ్చిది పిచ్చిగా చెప్తున్నా అనుకున్నావా అంటే లేదు పెద్దమ్మ అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నావ్ .. వరసకు పెద్దమ్మ అయినా నువ్వు మాత్రం నాకు అమ్మే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
Gundeninda Gudigantalu August 7th: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget