అన్వేషించండి

Chinni Serial Today December 9th: చిన్ని సీరియల్: షాకింగ్‌ ట్విస్ట్‌.. చెరువుగట్టు దగ్గర శవమైన మధు! మ్యాడీ, శ్రేయ పూజ చేశారా!

Chinni Serial Today Episode December 9th చెరువు గట్టు దగ్గరున్న శవం మధుదే అని మ్యాడీ, మధు తల్లిదండ్రులు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు కిడ్నాప్ అయ్యాయిందని తెలిసి మ్యాడీ శ్రేయతో జరగబోయే పూజని వదిలేసి వెళ్లిపోతుంటే నాగవల్లి మ్యాడీని ఆపుతుంది. ఓ ఆడపిల్ల జీవితం అమ్మా అని మ్యాడీ అంటే ఇక్కడ కూడా ఓ ఆడపిల్ల జీవితమేరా పూజ ఆగిపోతే శ్రేయకి ఎంత కష్టం వస్తుందో నీకు పట్టదా అని అంటుంది. దానికి మ్యాడీ ముందు మధుని కాపాడి తన తల్లిదండ్రులకు అప్పగించి తర్వాత శ్రేయతో పూజ చేస్తా అని చెప్పి వెళ్లిపోతాడు.

సుబ్బు, స్వరూప, చంటి మధు కోసం బాధ పడుతూ ఉంటారు. మధుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఏడుస్తారు. ఇంతలో మ్యాడీ రావడంతో సుబ్బు ఏడుస్తాడు. చంటీ మధు ఎలా కిడ్నాప్ అయ్యిందో మ్యాడీకి చెప్తాడు. కారు రంగు కూడా చెప్పడంతో మ్యాడీ వెతకడానికి వెళ్తానని అంటాడు. ఇక సుబ్బురావుతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మధు శవం గుట్ట దగ్గర ఉంది అని చెప్తాడు. సుబ్బారావు వాళ్లు ఏడుస్తూ వెళ్తారు. లోహిత మధు చనిపోయిందని విషయం నాగవల్లి వాళ్లకి చెప్తుంది. ఎవరో మధుని చంపేసి ఆ చెరువులో పడేసినట్లు ఉన్నారని అంటుంది. 

నాగవల్లి శ్రేయతో చూశావా శ్రేయ అది చేసిన పాపాలకు దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో నీకు మ్యాడీకి ఇక ఏ అడ్డు లేదు అంటాడు. మ్యాడీ మధు తల్లిదండ్రుల్ని తీసుకొని శవం దగ్గరకు వెళ్తాడు. ఆ బాడీ డ్రస్ చూసి చంటి ఏడుస్తూ అక్క డ్రస్సే అది అమ్మా అని ఏడుస్తాడు. ఇక అక్కడే పడి ఉన్న పట్టీని మ్యాడీ తీస్తాడు. అది స్వరూప చూసి ఇది నా కూతురిదే.. శవంలా ఉన్న నా కూతురిని చూడలేను అని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. మధు లాంటి మంచి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని మ్యాడీ అంటాడు. ఇక పోలీసులు బాడీ గుర్తించడానికి పిలుస్తారు. మ్యాడీ అందర్నీ తీసుకొని వెళ్తాడు. 

మ్యాడీ బాడీ చూసి తను మన మధు కాదు అంటాడు. సుబ్బు వాళ్లు కూడా చూసి తను మా కూతురు కాదు అని అంటాడు. మరో వ్యక్తి ఆ అమ్మాయిని గుర్తు పట్టి మా ఇంటి పక్కనే అంటాడు. ఇక మ్యాడీ మధుని తాను కనిపెడతా అని సుబ్బు వాళ్లని ఇంటి దగ్గరకు చేర్చేతాడు. ఇక నాగవల్లి మధుకి కాల్ చేస్తుంది. మధు బాడీ అనుకున్నాం కానీ అది కాదు మమ్మీ మధు బతికే ఉందని అంటాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. సూర్యోదయంలోపు వచ్చేయమని నాగవల్లి మ్యాడీకి చెప్తుంది. మధుని సంజు కిడ్నాప్ చేయిస్తాడు. సంజు తన మనుషులతో దాన్ని అక్కడే ఉంచరా.. రేపు ఎలా ఎక్కడికి మార్చాలో చూద్దాం అని అంటాడు. సంజు ఫ్రెండ్స్ టీ తాగడానికి వెళ్తామని అనుకోవడం మధు వింటుంది. 

మ్యాడీ ఇంటికి వచ్చిన తర్వాత శ్రేయ, మ్యాడీ పూజ చేస్తారు. మ్యాడీ మధు గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో చేయి కాల్చుకుంటాడు. ఎవరి కోసం ఆలోచిస్తూ అంత పరధ్యానంగా ఉన్నాడు మ్యాడీ కొంపతీసి మధు కోసం ఆలోచిస్తున్నాడు అని అంటుంది. ఎవరి గురించి ఆలోచించకుండా హోమం పూర్తి చేయ్ అని నాగవల్లి చెప్తుంది. మ్యాడీ, శ్రేయ హోమం పూర్తి చేస్తారు. ఇక మధు అక్కడే ఉన్న ఫోన్ తీసుకొని మ్యాడీకి మెసేజ్ చేసి లోకేషన్ పెడుతుంది. మ్యాడీ మెసేజ్  చూసి మధు ఎక్కడుందో తెలిసిపోయింది తనని సేవ్ చేస్తా అని అంటాడు. సుబ్బుకి కాల్ చేసి మధు దొరికిపోయిందని కాపాడటానికి వెళ్తున్నా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget