అన్వేషించండి

Chinni Serial Today December 3rd: చందును బర్త్‌డే పార్టీకి తీసుకురావడంతో లోహిత వాళ్ల అన్నకు కనిపించకుండా ఉండేందుకు ఏం చేసింది..?

Chinni Serial Today Episode December3rd : మ్యాడీ బర్త్‌డే పార్టీలో లోహితకు మధు ఇచ్చిన వార్నింగ్ ఏంటి..? మ్యాడీ తులాభారంలో ఏం జరిగింది..?

Chinni Serial Today Episode: చందుకు కనిపించకుండా లోహి  డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు మధు కావాలనే  చందును  డైనింగ్  టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. దీంతో డైనింగ్ టేబుల్ కింద లోహిత భయంతో వణికిపోతుంది. అక్కడే కూర్చుని చందు....టీ తాగేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లోహిత  మధుపై మండిపడుతుంది. చందును ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని నిలదీస్తుంది. అదేంటి నిన్న నువ్వే నాకు వార్నింగ్ ఇచ్చావు...ఈ బర్త్‌డే ఫంక్షన్‌కు రావొద్దని చెప్పావు...ఇవాళ నువ్వే భయంతో  వణికిపోయావ్‌ అంటూ  గేలి చేస్తుంది. అనవసరంగా నన్ను భయపెట్టాలని చూస్తే....నేను ఇలాగే భయపెడతాను అని హెచ్చరిస్తుంది. నేను నీలా వార్నింగ్‌లు ఇవ్వను....డైరెక్ట్‌గానే భయపెడతానని చెబుతుంది.

నేను మీ అన్నయ్యను తీసుకొస్తేనే  డైనింగ్ టేబుల్ కింద దాక్కున్న దానివి...నేను అసలు విషయం చెబితే ఎక్కడ దాక్కుంటావ్ అని ప్రశ్నిస్తుంది. నువ్వు నన్ను నీ మేనత్త కుమార్తెనని భావించకపోయినా...నీను నిన్ను ఇంకా నువ్వు నా మేనమామ కూతురువని అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఎన్ని కుట్రలు చేసినా...నేను ఇంకా క్షమించి వదిలేస్తున్నాను. ఇకపై నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుందని మధు లోహితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికైనా మారి అందరికీ నిజం చెప్పమని సలహా ఇస్తుంది. ఏదో ఒకరోజు అత్త, చందు నిన్ను వెతుక్కుంటూ వస్తారని...అప్పుడు ఎక్కడికి పారిపోతావంటూ నిలదీస్తుంది.

   మ్యాడీ కోసం శ్రేయ సర్‌ప్రైజ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ తెచ్చి ఇస్తుంది. గ్రీంటింగ్‌కార్డు చూసి ఎంతో మెచ్చుకున్న మ్యాడీ ఆ తర్వాత శ్రేయ ఇచ్చిన నెమలి పించం చూసి మాత్రం కోపంతో రగిలిపోతాడు. చిన్నప్పుడు  తాను చిన్నికి ఇచ్చిన నెమలి పించం గుర్తుకు వచ్చి అలా చేస్తాడు.  ఎంతో ప్రేమగా గిఫ్ట్‌ ఇస్తే దాన్ని అలా పడేశావేంటని శ్రేయ ప్రశ్నిస్తుంది. నువ్వు గిప్ట్‌ ఇచ్చావు తీసుకున్నా...ఇక దీని గురించి వదిలేయమంటాడు.అలా మొక్కుబడిగా తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందని శ్రేయ ఏడుస్తుంది. దీంతో నాగవల్లి వచ్చి ఎందుకు ఇలా చేశావ్ మ్యాడీ అని అడుగుతుంది. నువ్వు బర్త్‌డే సెలబ్రేషన్లు చేసుకునే మూడ్‌లో లేకున్నా మా అందరినీ సంతోషపెట్టేందుకే ఈపార్టీకి ఒప్పుకున్నావని మాకు తెలుసు. అలాగే శ్రేయను కూడా సంతోషపెట్టేలా ఆమె గిప్ట్‌ తీసుకోమని తండ్రి  చెప్పడంతో  మ్యాడీ కొంచెం మెత్తబడతాడు. మూడ్‌ ఆఫ్‌లో ఉండి అలా చేశానంటూ  శ్రేయకు  మ్యాడీ సారీ చెప్పడంతో అక్కడ అంతా సంతోషిస్తారు.


    
   చిన్నప్పుడు  మ్యాడీ పుట్టినరోజుకు చేసినట్లే  తులాభారం ఏర్పాట్లు చేస్తారు. దీన్నిచూసి మ్యాడీకి మళ్లీ చిన్ని గుర్తుకు వస్తుంది. ఇలా ఎందుకు చేశారని తల్లిదండ్రులను మ్యాడీ అడగ్గా...ఎప్పుడో చిన్నప్పుడు నీ బర్త్‌డే చేశాం. మళ్లీ ఇన్నాళ్లకు చేస్తున్నాం కదా అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని చెబుతారు. తులాభారంలో ఒకవైపు మ్యాడీని కూర్చోబెట్టి  మరోవైపు బెల్లం పెడుతుంటారు. శ్రేయ బెల్లాన్ని తులాభారంలో పెడుతూ ఉంటుంది. బెల్లం అయిపోవడంతో  అందూ తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు త్రాసులో వేస్తుంటారు. అయినప్పటికీ మ్యాడీ తూగడు. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
Godavari Serial Today October 29th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
Gundeninda Gudigantalu Oct 29:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
గుండెనిండా గుడిగంటలు:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget