అన్వేషించండి

chinni serial today April 9th: చిన్ని సీరియల్: కావేరి విశ్వరూపం చూసి వణికిపోయిన లోహిత! చిన్ని మీద ప్రేమ బయట పెట్టేసిన మ్యాడీ!

chinni serial today episode April 9th చిన్నికి ఏదో అయిందని మ్యాడీ కంగారు పడటం చిన్నికి ఏం కాకపోవడంతో దేవా డిసప్పాయింట్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని రౌడీలు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే చిన్ని మీదకు కావేరి ఆత్మ ఆవహిస్తుంది. ఏంట్రా ఆగిపోయారు.. రండిరా రండి అని చిన్ని అంటుంది. దాంతో రౌడీలు వెళ్లి వాళ్లలో వాళ్లని వాళ్లే కొట్టుకుంటారు. లోహిత మొత్తం చూస్తూ షాక్ అయిపోతుంది. చిన్ని మీద ఉన్న కావేరి ప్రభావం వల్ల చిన్ని సైగ చేస్తే చాలు వాళ్లు కొట్టుకుంటారు. నన్ను చంపడం మీ వల్ల కాదురా.. కాదు అని వస్తే మీరు వల్లకాటికి వెళ్తారు.. ఇంకెప్పుడూ ఈ ఛాయలకు కూడా రావొద్దు పోండి అని అంటుంది. రౌడీలు వెళ్లిపోతారు. 

చిన్ని గదిలోకి వెళ్లి పడుకుండిపోతుంది. అదంతా చూసిన లోహిత కళ్లు తిరిగి పడిపోతుంది. హాల్‌లో పడిపోయి ఉన్న లోహిత మీద అందరూ నీళ్లు విసురుతారు. ఇక్కడ పడుకున్నావేంటి అని అడుగుతారు. లోహిత మొత్తం పిచ్చి చూపులు చూస్తే ఏంటి అలా చూస్తున్నావ్ కొంపతీసి రాత్రి దెయ్యం చూశావా ఏంటి అని ప్రమీల అడగటంతో లోహిత పెద్దగా అరుస్తూ భయపడుతుంది. దెయ్యం ఎలా ఉంటుంది ఆంటీ.. దెయ్యాలు వస్తాయా అని లోహిత కంగారు పడి అడుతుంది. చిన్ని ఎందుకు అలా ప్రవర్తించింది అని అనుకుంటుంది. అందరికి లోహిత ఏదేదో చెప్తుంది. అందరూ కూడా మాకు ఈ రోజు మొద్దు నిద్ర పట్టేసింది తల నొప్పిగా ఉందని అనుకుంటారు. త్వరగా ఫ్రెష్ అయిరా అందరం కాఫీ తాగుదాం అని లోహితను ప్రమీల పంపిస్తుంది. 

మ్యాడీ ఉదయం లేచి ఫ్లవర్ వాజ్, కావేరి ఫొటో కింద పడిపోవడం చూసి ఏమైంది ఇలా ఉంది.. రాత్రి నాకు తెలీకుండా గదిలో ఏదో జరిగింది అని చిన్ని చిన్ని అని పిలుస్తాడు. దేవా, నాగవల్లి లేచి కాఫీ తాగుతూ నాగవల్లి కూడా ఏంటి ఎప్పుడూ లేనిది తల ఇంత నొప్పిగా డిమ్‌గా ఉందని అంటుంది. అందరీ ఇలాగే ఉందని ప్రమీల అంటుంది. దేవా మనసులో మత్తుమందు కలిపిన స్వీట్ తింటే ఇలాగే ఉంటుందని అనుకుంటాడు. కిందకి వచ్చి అందరికీ చిన్ని ఎక్కడా.. చిన్నిని ఏమైనా చూశారా అని అడుగుతాడు. అందరూ చూడలేదు అని అంటారు. చిన్ని ఎక్కడికి వెళ్లింది అని మ్యాడీ చాలా కంగారు పడతాడు. ఏదో జరిగింది.. రాత్రి మన ఇంట్లో ఏదో జరిగింది అని అంటాడు. అవును ఏదో జరిగింది అని లోహిత అంటే ఏం జరిగింది చెప్పు లోహి అని మ్యాడీ అంటాడు. కరెంట్ పోయింది.. ఉరుములు మెరుపులు అని లోహిత అంటే అది కాదు ఇంకేదో జరిగిందని మ్యాడీ అంటాడు. ఇంతలో చిన్ని తులసి కోటకి పూజ చేసి వస్తుంది. 

చిన్నిని చూసిన దేవా ఇది బతికి చచ్చిందేంటి అని షాక్ అయిపోతాడు. చిన్ని నీకు ఏం కాలేదా.. రాత్రి నీకు ఏదో అయినట్లు నాకు కీడు శంఖించిందని అంటాడు. నాకేం కాలేదు రాత్రి నేను ఒళ్లు తెలికుండా నిద్ర పోయాను అంటుంది. నిజంగా నువ్వు అలా నిద్రపోయావా,, రాత్రి కరెంట్ పోవడం పెద్ద గాలి రావడం నీకు ఏం గుర్తు లేదా అని లోహిత అడుగుతుంది. నా గురించి మా శ్రీవారు ఎందుకు అంత కంగారు పడిపోయారు అని చిన్ని అంటే ప్రేమ అయింటుందని ప్రమీల అంటే.. వాడి మనసు తెలుసుకోకుండా మాట్లాడకు పెద్ద అక్క.. ఒకసారి దాన్ని ప్రేమించినందుకే ఇలా అయిపోయాడు అని నాగవల్లి అంటుంది. ఎన్ని ఏం జరిగినా నేను ఇళ్లు దాటను అని చిన్ని అంటే త్వరలోనే వెళ్లిపోతావ్ అని దేవా అంటాడు. ఎందుకు వెళ్లిపోతానో చెప్పండి మామయ్యా అని చిన్ని అడిగితే దానికి నాగవల్లి త్వరలోనే గడువు ముగిసి మీ అమ్మ నిర్దోషి అని నిరూపించలేక విడాకుల పేపర్ల మీద సంతకం చేసి వెళ్లిపోతావ్ అని నాగవల్లి అంటుంది. నేను సంతకం చేయడం కాదు.. మా అమ్మ నిర్దోషి అని నిరూపించి మీ అందరూ నా దారిలోకి వచ్చేలా నేను చేస్తా అని చిన్ని అంటుంది.

చిన్ని ఎందుకు అలా మాట్లాడుతుంది బావ.. ఏం చూసుకొని అంత ధైర్యంగా మాట్లాడుతుందని నాగవల్లి అంటే అదే నాకు అర్థం కావడం లేదు అని దేవా అంటాడు. మనసులో మాత్రం దీని దగ్గర ఏవో సాక్ష్యాలు ఉన్నాయి అందుకే ఇలా అవుతుందని అనుకుంటాడు. చిన్ని కావేరి ఫొటో తీసి.. ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి అందుకే తలస్నానం చేసి పూజ చేయడానికి వెళ్లిపోయా సారీ అమ్మా అని అనుకుంటుంది. తల్లి ఫొటో పెట్టి పెంకులు క్లీన్ చేస్తుంది. ఇంతలో మ్యాడీ వస్తే నేను కనిపించకపోయే విలవిల్లాడిపోయారు అని అంటుంది. ఫొటో, ఫ్లవర్ వాజ్ పడిపోవడం నువ్వు కనిపించకపోయే సరికి టెన్షన్ అయ్యానని అంటాడు. అదేం కాదు లవ్ అని చిన్ని అంటుంది. దానికి మ్యాడీ నీకు ఎన్ని సార్లు చెప్పాలి లవ్ లేదు ఏం లేదు అని పోయి పని చూసుకో అంటాడు. సరే పోతా అని చిన్ని వెళ్తుంటే గాజు పెంకు చూసిన మ్యాడీ చిన్ని మట్టేస్తుందేమో అని లాగుతాడు. ఇద్దరూ బెడ్ మీద పడిపోతారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ప్రేమ లేదు అన్నారు ఇదేంటి అని చిన్ని అడిగితే ప్రేమ లేదు దోమ లేదు గాజు పెంకు అని మ్యాడీ అంటాడు. దాంతో చిన్ని చూసి గాజు పెంకు లేదుగా అంటుంది. నేను గాజు పెంకు చూశా.. ఇదేదో మాయలా ఉందని అంటాడు. చూశావా అమ్మ మీ అల్లుడి గారి ప్రవర్తన ఎలా ఉందో. నేను అంటే ప్రేమ ఉన్నా లేదని చెప్తున్నాడు.. తన మనసులో ప్రేమ తొందర్లోనే ఎలా చెప్పిస్తానో చూస్తూ ఉండు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget