అన్వేషించండి

chinni serial today April 27th: చిన్ని సీరియల్: మినిస్టర్ దేవా అరెస్ట్! కావేరి ఆత్మ నిజం నిరూపించేసిందా! చిన్నికి ఇక ఏ ప్రాబ్లమ్ లేనట్లేనా!

chinni serial today episode April 27th కావేరి ఆత్మ దేవాకి వినిపించి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని పడుకొని ఉంటే మ్యాడీ చిన్నిని చూస్తూ ఉంటాడు. చిన్ని లేచి ఏంటి మ్యాడీ ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. నిద్ర రావడం లేదు అని మ్యాడీ అంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్  అని చిన్ని అడుగుతుంది. ఏం లేదు అని మ్యాడీ అనడంతో ఇప్పుడు ఆలోచించింది చాలు ఇక పడుకో రేపు పొద్దున్నే లేచి మళ్లీ ఆలోచించు అని అంటుంది. సరే అని మ్యాడీ పడుకుంటాడు.

మ్యాడీ చిన్నిని చూసి మనసులో చిన్నప్పటి ఫ్రెండ్‌గా కానీ కాలేజ్‌ ఫ్రెండ్ మధుగా కానీ.. భార్యగా కానీ నువ్వు నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు కానీ నేనే నిన్ను బాధ పెట్టాను అని అనుకుంటాడు. ఇప్పటికైనా మించిపోయేది లేదు త్వరలోనే అసలు దోషులు ఎవరో తెలుసుకొని వాళ్లకి శిక్ష పడేలా చేస్తా అనుకుంటాడు. ఉదయం నాగవల్లి, దేవా తప్ప మిగతా అందరూ టిఫెన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. లోహిత ఇంకా రాలేదు అని శ్రేయ పిలుస్తుంది. లోహిత కిందకి వస్తుంది. లోహిత వాలకం  చూసి దెయ్యం పిన్ని వచ్చేసిందేమో అని శ్రేయ అనుకుంటుంది. లోహిత( పాత లోహిత స్థానంలో మరో నటి) వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటుంది. ఏంటి శ్రేయ అలా చూస్తున్నావ్ అని లోహి అడగ్గానే అందరూ వింతగా చూస్తారు. అంతలోనే లోహి దేవా వాయిస్‌లో అందరూ నన్నే చూస్తున్నారు ఏంటి అని వాయిస్ మార్చేస్తుంది. ఇదేంటి మా డాడీలా మాట్లాడుతున్నావ్ అని మ్యాడీ అంటే ఇంకా చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి చూపిస్తా అని అంటుంది. 

లోహిని వదిలేసిన ఆత్మ శ్రేయలోకి వస్తుంది. శ్రేయ పెద్దగా చూస్తూ చిన్నితో ఇవాళ కూడా ఇడ్లీనే చేశావా అని కోపంగా అడుగుతుంది. శ్రేయ లేచి ఏయ్ మేం ఏం టిఫెన్ చేయాలి అన్నది నువ్వే డిసైడ్ చేస్తావా అని నాగవల్లి వాయిస్‌లో చిన్నిని ప్రశ్నిస్తుంది. అందరూ వింతగా చూస్తారు. శ్రేయ నువ్వు అత్తయ్యాలా మాట్లాడుతున్నావే ఏంటి అని వరుణ్ అడిగితే అత్తయ్యాలా ఏంటి అవసరం అయితే నీలా కూడా మిమిక్రీ చేస్తా.. మా అమ్మతో కూడా మిమిక్రీ చేయిస్తా అని అంటుంది. శ్రేయకి పట్టిన ఆత్మ వదిలేసి వసంతకు పట్టుకొని నాకు మిమిక్రీ చేయడం రాదు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మళ్లీ ఆత్మ లోహిలోకి వెళ్లి సాంబారు చేయలేదా అని అరుస్తుంది. నీ ముందే ఉంది తీసుకో అని చిన్ని అనడంతో సాంబారు మూత తీసిన లోహికి రక్తంలా కనిపిస్తుంది. రక్తం రక్తం అని అరుస్తుంది. మిగతా అందరికీ అది సాంబారులా కనిపిస్తుంది. ఇంతలో దేవా వచ్చి రక్తం ఏంటి అని అరుస్తాడు. 

శ్రేయ, లోహిత గదిలోకి వెళ్లి మనకు గొంతు మారడానికి దెయ్యమే కారణమా.. మొత్తానికి మ్యాడీ వాళ్ల ముందు ఫూల్స్ అయిపోయాం అని అనుకుంటారు. ఏదో ఒకటి చేసి దెయ్యాన్ని వదిలించాలి అని లోహిత అంటే అంత సీన్ లేదు.. ఆ దెయ్యం మనతోనే ఆడుకుంటుందని తెలిసి కూడా నాగవల్లి అత్తయ్య ఏం చేయలేకపోతుంది., ఇక మనం ఏం చేస్తాం అని శ్రేయ అంటుంది. మామయ్యకి దెయ్యం గురించి తెలిస్తే దాని సంగతి తేల్చేస్తారు. మామయ్యకి తెలిసేలా చేయాలి అని శ్రేయ అంటే చిన్నిని ఇబ్బంది పెడితే దెయ్యం వస్తుంది అప్పుడు అంకుల్‌కి తెలిసేలా చేద్దాం అని లోహిత అంటుంది. ఇంతలో ఎఫెక్ట్‌లు మొదలవ్వడంతో దెయ్యం వచ్చేసినట్లు ఉంది చిన్ని దగ్గరకు వెళ్దాం పద అని ఇద్దరూ పరుగులు తీస్తారు. ఇంతలో డోర్ లాక్ అయిపోతుంది. తర్వాత దెయ్యం ఒకరి తర్వాత ఒకరిలోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరూ కొట్టుకునేలా చేస్తుంది. ఇద్దరి ముఖాల మీద దెబ్బలు విపరీతంగా ఉంటాయి. తర్వాత ఇద్దరూ తేరుకొని మన ఇద్దరం కొట్టుకునేలా దెయ్యం చేసింది.. ఈ దెబ్బలు మామయ్యకి చూపించాలి అని అనుకుంటారు. 

సీన్ కట్ చేస్తే దేవా చేతికి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తారు. చూస్తే ఇదంతా దేవా కల. ఉలిక్కి పడి దేవా నో అని అరిచి లేస్తాడు. ఇంతలో కావేరి ఆత్మ పెద్దగా నవ్వి.. ఏంటి దేవా అరెస్ట్ అయినట్లు ఊహ వస్తేనే చెమటలు పట్టేశావ్.. నిజంగా అరెస్ట్ అయితే ఇంకేమైపోతావ్.. ఖర్మ ఎవరినీ వదలదు దేవా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతిని చంపేశావ్.. ఆ విషయం నేను బయట పెడతాను అని నన్ను చంపేశావ్.. మా అన్నయ్యని అతి దారుణంగా చంపేశావ్.. ఆ నేరం నా భర్త మీద వేసి జైలుకి పంపావ్.. ఇన్ని నేరాలు చేసిన నువ్వు తప్పించుకోలేవ్.. ఇది ప్రస్తుతం టీజర్ మాత్రమే.. అసలైన సినిమా ముందు ఉంది.. త్వరలోనే నిజం తెలుసుకున్న పోలీసులు నీ కొడుకు ముందు నిన్ను కొట్టు కుంటూ పోలీస్‌ స్టేషన్‌ని ఈడ్చుకొని వెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది.. ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉండు అని అంటుంది. ఇలా కనిపించకుండా వినపడటం కాదు.. నా ముందుకు రా తేల్చుకుందాం అని అంటాడు. ఏంట్రా నీ ముందుకు వచ్చేది.. నేను ముందుకు వస్తే నీ గుండె ఆగిపోతుంది. చేసిన నేరాలకు శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు అని అంటుంది. 

ప్రమీల మ్యాడీ దగ్గరకు వెళ్లి నువ్వు నిజా నిజాలు తెలుసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్తుంది. చిన్ని వాళ్ల అమ్మ మా అమ్మని చంపలేదు అని నువ్వు నమ్ముతున్నావా పెద్దమ్మా అని మ్యాడీ అడిగితే నూటికి నూరు పాళ్లు నమ్ముతున్నా అని  చెప్తుంది. మీ అమ్మ ఎప్పటికప్పుడు కాల్ చేసి కావేరి గురించి గొప్పగా చెప్పేది అని ప్రమీల చెప్తుంది. ఇంతలో లోహిత, శ్రేయలు మామయ్య మామయ్య అని అరుస్తూ వచ్చి చిన్ని మమల్ని రక్కింది.. మా మీద పడి ఎలా కొట్టిందో చూడండి అని గాయాలు చూపిస్తుంది. నాకేం సంబంధం లేదు అని చిన్ని అంటుంది. ఇంతలో ఆత్మ లోహి  లోకి వచ్చి ఏయ్ అబద్ధాలు చెప్పకు మాకు మేం కొట్టుకొని నీ మీద నిందలు వేస్తున్నాం అనుకున్నావా అని అడుగుతుంది. అది మీకే తెలియాలి అని చిన్ని అంటే ఏం కూసావ్ అని లోహి చిన్నిని కొట్టడానికి చేయి ఎత్తితే వరుణ్ అడ్డుకొని లోహిని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget