అన్వేషించండి

Podharillu Serial Today April 27th:మాధవ్‌ కాళ్లుపట్టుకుని బ్రతిమాలిన తాయర్‌,పురుషోత్తం..గాయత్రి మెడలో మాధవ్‌ తాళి కట్టాడా లేదా..?

Podharillu Serial Today Episode April 27th:మాధవ్‌ కాళ్లుపట్టుకుని బ్రతిమాలిన తాయర్‌,పురుషోత్తం..గాయత్రి మెడలో మాధవ్‌ తాళి కట్టాడా లేదా..?

Podharillu Serial Today Episode: తెల్లారితే పెళ్లి పెట్టుకుని మాధవ్‌కోసం ఇల్లు వదిలేసి వచ్చిన గాయత్రిపై వాళ్ల మామ ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నువ్వు ఇలా వచ్చినందుకే నా కొడుకులు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని మండిపడతాడు. మర్యాదగా బయటకు వెళ్లిపొమ్మని ఆదేశిస్తాడు.  నా కొడుకు జీవితంతో ఆటలాడుకోవద్దని హెచ్చరిస్తాడు. నీవల్లే వాడు జీవచ్ఛవంలా  బతుకుతున్నాడని మండిపడతాడు.ఆ మాటలు విన్న గాయత్రి...తనకు ఆ పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని... తెల్లారితే  తాను బావకు శాశ్వతంగా దూరం అవుతానని అది నేను తట్టుకోలేకే వచ్చేశానని చెబుతుంది. ఆ మాటలు విన్న చ‌క్రి, కేశవ్‌ నిన్ను ఏమాత్రం నమ్మలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

నీ మాటలు నమ్మి మా అన్నయ్యను పెళ్లికి ఒప్పించి తీసుకొస్తే...గుడిలో అందరి ముందు తాళిపట్టుకుని ఎదురుచూస్తూ పిచ్చివాడిని చేశావని అంటారు.ఇంకోసారి నీమాటలు నమ్మిమోసపోలేమని చెబుతారు. నీకు అసలు ధైర్యం లేదని మండిపతారు. దీంతో గాయత్రి ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి బ్రతిమలాడుతుంది. ఈసారి మా అమ్మానాన్న వచ్చినా నేను వెనకడుకు వేయనని చెబుతుంది.ఈసారి తెగించి ఇంట్లో నుంచి వచ్చేశానని చెబుతుంది.
                    ఆరోజు మీ ఇంటికి వస్తే  మాధవ్‌ను చేసుకోవడం ఇష్టంలేదని చెప్పావుకదా అని చక్రి, మహా నిలదీస్తారు. మా అమ్మ ఇంట్లో కత్తిపీట పీకమీద పెట్టుకుని బెదిరించిందని....మీరు గుమ్మం బయట జరిగిందే చూశారని..లోపల ఏం  జరిగిందో మీకు తెలియదని అంటుంది.నా సుఖం కోసం నేను గడపదాటి వచ్చేసి ఉంటే...పంతానికిపోయి మా అమ్మ పీక కోసుకుని ఉండేదని అంటుంది.అందుకే భయపడి మీకు అబద్ధం చెప్పానని అంటుంది. అంతమంది ముందు ఎదురుగా నీకు నచ్చిన నీ బావను పెట్టుకుని కూడా నువ్వు వేరే అబ్బాయి చేతికి ఉంగరం తొడిగావాంటే రేపు మళ్లీ మీ అమ్మానాన్నల కోసం మాట మార్చవని నమ్మకం ఏంటని మహాలక్ష్మీ నిలదీస్తుంది. ఇప్పుడు చీకటిలో బాగానే వచ్చావని...తెల్లారిన తర్వాత ఈ ధైర్యం ఉంటుందని ఎలా నమ్మగలమని అడుగుతుంది. నేను శాశ్వతంగా  ఆ ఇల్లు వదిలేసి వచ్చేసినా అని చెబుతుంది.మా అమ్మానాన్న నిజంగా చనిపోయినా పట్టించుకోనని వేడుకుంటుంది.  

మాధవ్‌ వద్దకు, ఆదినారాయణ వద్దకు వెళ్లి ప్రాధేయపడుతుంది. దయచేసి నన్ను తిరిగి వెనక్కి పంపించొద్దని...పెళ్లిచేసుకోవాలని కోరుతుంది. ఇంతగా ఇది వేడుకుంటుంటే మనం కాదనడం భావ్యం కాదని ఆదినారాయణ కోడలు చేతిని తీసుకుని వెళ్లి మాధవ్‌ చేతిలో పెడతాడు. ఈ ఇంటికి ఏ ఆడపిల్లరాదని శాపం పెట్టిన మీ అత్త కూతురిని నువ్వు ఇప్పుడే ఇక్కడే ఈఇంట్లోనే పెళ్లి చేసుకుని దాని శాపం ఫలించదని నిరూపించాలంటాడు. తెల్లారితే  గాయత్రి లేదని తెలిసి మీ అత్తామామ గొడవ చేస్తారని....ఆలోగా పెళ్లి జరిగిపోవాలని అంటాడు. వెంటనే చక్రి లోపలికి వెళ్లి తాళిబొట్టు తీసుకుని వస్తాడు. కేశవ్, కన్నా వెళ్లి మాధవ్‌కు పట్టుబట్టలు కట్టించి తీసుకొస్తారు.అందిరి ముందు మాధవ్‌ తాళికట్టబోతుండగా  తాయర్‌, పురుషోత్తం అక్కడికి వస్తారు.


                          నా కూతురుకి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లిచేసుకుంటారా అని అరుస్తారు. కూతురిని తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించగా  గాయత్రి రానని తెగేసి చెబుతుంది.దీంతో షాక్‌ తిన్న పురుషోత్తం మాధవ్‌పై చేయిచేసుకునేందుకు వెళ్లగా...చక్రి,కేశవ్‌ అడ్డుకుని వాళ్ల మామను చితక్కొడతారు.మహా వాళ్లను ఆపి...ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకుండా మీ పెద్దరికాన్ని కాపాడుకోమని చెబుతుంది.లేదంటే పోలీసులను పిలుస్తామని వాళ్లే వీళ్లిద్దరి పెళ్లి చేస్తారని హెచ్చరిస్తుంది.మీ ఆయన దుబాయ్‌ కూడా పోకుండా కేసుపెట్టిస్తామని చెబుతుంది.  దీంతో చేసేదిలేక పురుషోత్తం మాధవ్‌ను పిలిచి మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్తాడు.

అల్లుడి కాళ్లు పట్టుకుని బ్రతిమాలడతాడు. ఇప్పుడు దాని పెళ్లి  ఆగిపోతే నలుగురిలో నేను తల ఎత్తుకుని బతకలేనని అంటాడు. తాయరు కూడా లోపలికి వచ్చి మాధవ్‌ కాళ్లమీద పడబోతుంది. నువ్వు చెబితే తప్ప అది రాదని...మాఇంటి పరువు కాపాడాలని వేడుకుంటుంది. లేదంటే మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని అంటుంది. గదిలో వీళ్లు మాట్లాడుతుండగా గాయత్రి బయట భయపడుతుంది. మావాళ్లు అందితే జుట్టు లేకపోతే కాళ్లుపట్టుకునే రకమని..మాధవ్‌ బావకు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారని అంటుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget