అన్వేషించండి

chinni serial today April 18th: చిన్ని సీరియల్: చిన్నిని చంపేయడానికి లోహిత, శ్రేయ ప్లాన్! ఎఫెక్ట్‌లు మొదలు పెట్టేసిన కావేరి!

chinni serial today episode April 18th చిన్నిని చంపేయాలని లోహిత, శ్రేయలు చిన్ని దగ్గరకు వెళ్లడం ఎఫెక్టులు మొదలవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ చిన్నిని పంపించేయడానికి ఒప్పుకోడు.. చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసిందో లేదో తేలే వరకు చిన్ని ఇక్కడే ఉంటుంది అని అంటాడు. పద చిన్ని అని చిన్నిని గదిలోకి తీసుకెళ్తాడు. శ్రేయ, లోహిత నాగవల్లి దగ్గరకు వెళ్లి చిన్నిని గెంటేస్తున్నప్పుడు ఎఫెక్ట్‌లు పడినప్పుడే అర్థమైంది.. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ ఆత్మనే మ్యాడీతో ఇలా చేయించిందని లోహిత, శ్రేయ చెప్తారు. 

చిన్ని ఇంటి నుంచి వెళ్లిపోతే దాన్ని చంపేయొచ్చు అనుకున్న  దేవా.. చిన్నిని మ్యాడీ ఇంట్లో ఉంచడంతో రగిలిపోతాడు.. ఆ చిన్నిని ఏదో ఒకటి చేస్తా అని అరుస్తాడు. చిన్ని ఏడుస్తూ థ్యాంక్యూ మ్యాడీ.. గడువు పూర్తయిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు థ్యాంక్యూ సోమచ్ అని మ్యాడీని వాటేసుకుంటుంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మ్యాడీ..నా జీవితానికి ఓ ఆశని కలిపించావ్ థ్యాంక్స్ మ్యాడీ.. మీ అమ్మానాన్నలను కాదని నన్ను ఇంట్లో ఉంచావంటే మా అమ్మ నిర్దోషి అని నీకు ఎక్కడో అనిపించే ఉంటుంది అని అంటుంది. డాడీ చెప్పింది నిజం అనుకుంటున్నా.. నువ్వు చెప్పింది అబద్ధం అనుకుంటున్నా కాబట్టి నిజనిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నా..నా ప్రయత్నంలో మీ అమ్మ నిర్దోషి అని తేలితే సరే కాదు మీ అమ్మ దోషి అని తెలిస్తే జీవితంలో మనం కలవలేం అని అంటాడు. లేదు మ్యాడీ మా అమ్మ నిర్దోషి అని నీకు తెలుస్తుంది.. మనం జీవితాంతం కలిసే ఉంటాం.. మా అమ్మ నిర్దోషి అని నువ్వు చెప్పిన తర్వాత.. నీ నోటి నుంచి ఆ మాట విన్న తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు అని చిన్ని ఏడుస్తుంది. తర్వాత చిన్ని తన బట్టలు అన్నీ సర్దుకుంటుంది. 

చిన్ని కాలి పట్టీ కింద పడిపోతుంది. అది చూసిన చిన్ని దాన్ని తీసుకొని పెట్టుకుంటూ మ్యాడీని చూసి అలా చూస్తూ ఉండే కంటే పెట్టొచ్చు కదా అంటుంది. మ్యాడీ పట్టీని చిన్ని కాలికి పెడతాడు. మరోవైపు లోహిత, శ్రేయలు చిన్ని పీడ పోతుంది అనుకుంటే మ్యాడీ వచ్చి మొత్తం నాశనం చేశాడని అనుకుంటారు. ఇక చిన్ని పట్టీల వేసుకొని నడుస్తూ ఉంటే లోహిత, శ్రేయలు విని ఇది కూడా దెయ్యం ఎఫెక్ట్ ఏమో అనుకుంటారు. చాలా కంగారు పడతారు. చిన్ని నడుచుకుంటూ వెళ్లడం చూసి హమ్మయ్యా అనుకుంటారు. చిన్నిని చంపేస్తే పీడ పోతుంది.. దాన్ని చంపేయడం నాకు పెద్ద పని కాదు కానీ నాగవల్లి ఆంటీ పర్మిషన్ ఇవ్వాలని లోహిత అంటుంది. శ్రేయ కూడా అలాగే అనడంతో నాగవల్లి వచ్చి చంపేయండి.. నేను మీకు పర్మిషన్ ఇస్తున్నా.. చిన్నిని చంపేయాలని తెగ ఉబలాటపడుతున్నారు కదా ఈ రోజు రాత్రికే చంపేయండి అని అంటుంది. గదిలో మ్యాడీ ఉంటాడని లోహిత అంటే మ్యాడీ ఆ టైంలో గదిలో లేకుండా నేను చేస్తా అని నాగవల్లి అంటుంది. మీ అత్తయ్యా వెటకారంగా చెప్పినట్లు ఉందని లోహిత అంటే ఎలా చెప్తే ఏంటి పర్మిషన్ ఇచ్చారు కదా చిన్నిని చంపేద్దాం అని శ్రేయ అంటుంది. 

రాత్రి చిన్ని మ్యాడీ ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్ని పడుకున్న తర్వాత లోహిత, శ్రేయలు గదిలోకి వస్తారు. తలగడ పట్టుకొని చిన్నిని చంపేయాలని చూస్తే కావేరి ఆత్మ చిన్నిలోకి వస్తుంది. చిన్ని లేచి నిల్చొంటుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. చిన్నిలోని కావేరి ఆత్మ ఇద్దరితో మీ ఇద్దరూ ఒకర్ని ఒకరు కొట్టుకుంటారా.. నన్ను కొట్టమంటారా అని అడిగితే మేమే కొట్టుకుంటాం అని ఇద్దరూ చితక్కొట్టుకుంటారు. తర్వాత ఇద్దరూ ఉక్కిరిబిక్కిరి అయి గదిలో నుంచి పారిపోతారు. లోహిత, శ్రేయలు వణికిపోతూ నాగవల్లి దగ్గరకు వెళ్లి గజగజ వణికిపోతూ జరిగింది అంతా చెప్తారు. ఇంతలో గదిలోకి పెద్దగా పొగ వస్తుంది. మ్యాడీ వరుణ్ వచ్చి నాగవల్లికి మందులు ఇస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
Godavari Serial Today July 15th: 'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
Mirchi Madhavi: రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు
రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget