అన్వేషించండి

chinni serial today April 16th: చిన్ని సీరియల్: దేవా వర్సెస్ కావేరి ఆత్మ! మ్యాడీకి తెలిసిన నిజమేంటి? గడువుకి ఇంకా కొన్ని గంటలే!

chinni serial today episode April 16th మ్యాడీకి అద్దం మీద కావేరి రాతలు కనిపించడం ఎంక్వైరీ చేయడంతో కావేరి తన తల్లిని చంపలేదు అని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీకి అద్దం మీద కావేరి నిజాన్ని మాత్రమే నమ్ము.. నువ్వు నమ్ముతున్నది మాత్రం నిజం కాదు అని కనిపించేలా చేస్తుంది. మ్యాడీ అది చదివి తర్వాత చూసే సరికి లేకపోవడంతో చాలా కంగారు పడతాడు. ఫొటోల మీద పార్వతిని చంపింది కావేరి కాదు అని చూసింది గుర్తు చేసుకొని మళ్లీ ఫొటోలు చూసేసరికి అద్దం మీద కనిపించిన రాతలే ఫొటో మీద కనిపిస్తాయి.. మళ్లీ చూస్తే ఉండవు.. మ్యాడీ కంగారు పడి ఏదో తెలుసుకోమని ఎవరో నాకు చెప్పాలని ట్రై చేస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలి.. ఎవరిని అడగాలి అని అనుకుంటాడు. 

మ్యాడీ ఆల్బమ్ చూసి ఆ అడ్రస్‌కి వెళ్తే అంతా తెలిసిపోతుందని అనుకుంటాడు. చిన్ని ఎక్కడికి వెళ్తున్నావ్ ఆల్బమ్ ఎందుకు అంటే ఇది పాడైపోయావి వెళ్లి స్టూడియోలో ఇస్తా అంటాడు. మ్యాడీలో ఏదో మార్పు వచ్చిందని చిన్ని అనుకుంటుంది. దేవా కావేరి గురించి ఆలోచిస్తూ నువ్వు చచ్చిన తర్వాత దెయ్యం అయ్యావేమో.. నేను బతికుండగానే దెయ్యాన్ని నాతో పెట్టుకోవద్దు అని అనుకుంటాడు. నాగవల్లి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అంటే సాయంత్రం ఆరు అవ్వగానే ఆ చిన్ని టైం పూర్తయిపోతుంది. ఆది మన ఇళ్లు దాటగానే దాన్ని వాళ్ల అమ్మ దగ్గరకి పంపాలి.. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దెయ్యం వదులుతుందని దేవా అంటాడు. నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత వదులుతుంది.. ఈ ఇంటికి పట్టిన దెయ్యం వదులుతుందని దేవా అంటే వదలదు.. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకునే వరకు.. నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా ఒప్పుకునే వరకు నేను నిన్ను వదలను అని కావేరి ఆత్మ అంటుంది. ఏయ్  ఇలా కనపడకుండా వినపడటం కాదే.. నీకు దమ్ముంటే నా ముందుకి వచ్చి కనపడు కాల్చి చంపేస్తా అని దేవా గన్ తీసి మొత్తం వెతుకుతాడు. ఎటు వైపు గాలి వస్తే అటు వెళ్లి రావే దమ్మ ఉంటే నువ్వో నేనో తేల్చుకుందాం రావే అని అరుస్తాడు. 

మ్యాడీ ఆల్‌బమ్ తీసుకొని స్టూడియోకి వెళ్తాడు. ఓ పెద్దాయన అక్కడ ఉంటే అతనికి ఆల్బమ్ చూపించి వీళ్ల గురించి మీకు తెలుసా అంటే బాగా తెలుసు బాబు.. అప్పట్లో దేవేంద్ర వర్మ గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నేనే ఫొటోలు తీసేవాడిని అని అంటాడు. కావేరి, పార్వతిని చూపించి వాళ్లిద్దరూ ఎప్పుడు పడితే అప్పుడు ఫొటోలు తీసుకునే వాళ్లు.. వాళ్లకి ఫొటోలు కంటే ఒకరికి ఒకరు చాలా ఇష్టం.. ఏ కారణం చేత అయినా దూరం అయితే ఈ ఫొటోలు ఉంటాయని చాలా ఫొటోలు దిగేవాళ్లు.. వాళ్ల మధ్య స్నేహ బంధం కంటే అంత కంటే గొప్ప బంధం ఏదో ఉంది.. అందుకే ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు అని ఫొటో స్టూడియో అతను అంటాడు. అంత ప్రాణంగా ఉంటే కావేరి పార్వతి గారి ప్రాణాలు ఎందుకు తీసింది అని మ్యాడీ అడుగుతాడు. దానికి పెద్దాయన ఛా ఛా అలా ఏం జరగలేదు బాబు.. ఈ కావేరి మేడం పార్వతి మేడంని చంపలేదు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. 

ఎవరో హత్య చేసి ఆ నేరాన్ని కావేరి మీద వేశారు.. సాక్ష్యాధారాల ప్రకారం పాపం కావేరికి శిక్ష పడింది అని అతను చెప్తాడు. నిజనిజాలు నాకు ఎలా తెలుస్తాయి అని మ్యాడీ అంటే కావేరి మేడం భర్తని అడిగినా పార్వతి మేడం భర్తని అడిగినా నిజనిజాలు తెలుస్తాయి  అయినా నువ్వు ఎవరు బాబు ఎప్పుడో అయినదాన్ని ఇప్పుడు అడుగుతున్నావ్ అని అతను అడిగితే ఇద్దరికీ బాగా కావాల్సిన వాడిని అని మ్యాడీ అంటాడు. ఈరోజుతో గడువు పూర్తయిపోతుందని చిన్నిని ఎప్పుడెప్పుడు పంపేస్తామా అని  శ్రేయ, లోహితలు చాలా సంబరపడిపోతారు. ఇంతలో కావేరి ఫొటో కర్టెన్లు ఊగడం చూసి ఇప్పుడు విశ్వరూపం సీన్ ఉందేమో అని అనుకుంటారు. ఈ ఒక్క రోజే కదా ఉంటే ఉన్ని.. ఆ చిన్ని వెళ్లిపోతుంది కదా అని లోహిత అంటే లోహితకు కావేరి మాటలు వినిపిస్తాయి. దాంతో దెయ్యం దెయ్యం అంటుంది. అప్పుడే వచ్చిన నాగవల్లి ఏంటే నన్ను దెయ్యం అంటున్నావ్ అంటే మిమల్ని కాదు ఆంటీ అంటుంది. 

ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు అని నాగవల్లి అడుగుతుంది. ఇంతలో లోహితలోకి కావేరి ఆత్మ వస్తుంది. నాగవల్లి మీద లోహిత అరుస్తుంది. దాంతో నాగవల్లి లోహితతో ఎక్కువ మాట్లాడితే ముఖం పగలగొడతా అని అంటుంది. లోహిత మీద ఉన్న కావేరి ఆత్మ ఏంటే నా కోడలి ముఖం పగలగొడతావా నువ్వు నా కోడలి ముఖం పగలగొడితే నేను నీ ముఖం పగలగొడతా అని లోహితలోని కావేరి ఆత్మ అంటే నాగవల్లి లాగిపెట్టి కొడుతుంది. దాంతో లోహిత మీద ఉన్న ఆత్మ వెళ్లిపోతుంది. నన్ను ఎందుకు కొట్టారు అని లోహిత అంటే నువ్వు నాకు కోడలు ఏంటే అని అంటుంది నాగవల్లి. దాంతో లోహిత మనసులో కోడలు అంది అంటే నా మీదకు కావేరి అత్త ఆత్మ వచ్చిందన్న మాట అని అనుకుంటుంది. ఇక లోహిత మీదకు దెయ్యం వచ్చిందని నాగవల్లికి అర్థమై లోహితకు జాగ్రత్త అని చెప్తుంది. 

లోహిత, శ్రేయ మాట్లాడుకుంటూ ఉంటే దెయ్యం ఎఫెక్ట్ మొదలవుతుంది. దాంతో ఇద్దరూ విశ్వరూపం ఎఫెక్ట్ మొదలైనట్లు ఉంది పారిపోదాం అనుకుంటే కుర్చీలకు అతుక్కుపోతారు. ఇద్దరూ కుర్చీలతో నడిస్తే వరుణ్ చూసి ఏమైందని అలా కుర్చీలతో నడుస్తున్నారు అని అడుగుతాడు. వరుణ్ భార్య, చెల్లిని కుర్చీల నుంచి లాగాలని ప్రయత్నిస్తాడు. చాలా సేపు తర్వాత ఇద్దరూ వస్తారు. ఇద్దరూ కుయ్యోమొర్రో అనుకుంటారు. చిన్ని వెళ్లిపోయిన వరకు మనకు ఈ తిప్పలు తప్పవు అనుకుంటారు. చిన్ని తల్లి ఫొటో దగ్గర ఏడుస్తూ అమ్మా గడువు ఈరోజుతో పూర్తయింది. కానీ ఏ సాక్ష్యాలు లేవు అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి దగ్గర లక్ష్మీ కోసం మాట తీసుకున్న యమున! పద్మాక్షి మీద అంబిక పగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి దగ్గర లక్ష్మీ కోసం మాట తీసుకున్న యమున! పద్మాక్షి మీద అంబిక పగ!
Godavari Serial Today November 27th: 'గోదావరి' సీరియల్: కన్నతల్లి గతం వెనుక చేదు నిజం! తల్లిని అసహ్యించుకుంటున్న సంజు మనసు మార్చేదెవరు?
'గోదావరి' సీరియల్: కన్నతల్లి గతం వెనుక చేదు నిజం! తల్లిని అసహ్యించుకుంటున్న సంజు మనసు మార్చేదెవరు?
Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget