అన్వేషించండి

Podharillu Serial Today April 16th: గాయత్రి నిశ్చితార్థంలో తాయరు అవమానించినా తలవంచుకుని వచ్చిన మాధవ్‌ కుటుంబం.

Podharillu Serial Today Episode April 16th: గాయత్రి నిశ్చితార్థంలో తాయరు అవమానించినా తలవంచుకుని వచ్చిన మాధవ్‌ కుటుంబం.

Podharillu Serial Today Episode: గాయత్రి నిశ్చితార్థానికి మాధవ్‌తోపాటు కుటుంబం మొత్తం హాజరవుతుంది. వాళ్లను చూసిన గాయత్రి పెళ్లికొడుకుకు ఉంగరం పెట్టేందుకు తొలుత కొంత ఆలోచించినా...తాయర్‌ చచ్చిపోతానని మళ్లీ బెదిరించడంతో చేసేదిలేక పెళ్లికొడుకుకు ఉంగరం పెడుతుంది. దీంతో  ఆమె నిశ్చితార్థం ఎలాంటి గొడవ లేకుండానే సాఫీగా సాగిపోతుంది.దీంతో మాధవ్‌తోపాటు అందూర లేచి వెళ్లబోతుండగా...పెళ్లికొడుకు తండ్రి వచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారని చెప్పి బలవంతంగా వాళ్లను భోజనాల వద్దకు తీసుకెళ్తాడు. రమణయ్యను,భూషణాన్ని పిలిచి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు మీరు చేయకపోతే మేం చేయాలా అని నిలదీస్తాడు.దీంతో వాళ్లు నారాయణకు,మాధవ్‌కు భోజనం వడ్డిస్తారు.తనను ఎప్పటి నుంచో అవమానిస్తున్న అన్నయ్యపై పగ తీర్చుకునేందుకు నారాయణ భోజనం సరిగా లేదని...ఇలాంటి తిండి కుక్కలు కూడా తినవని చెప్పి అవమానిస్తాడు.ఇంతలో పెళ్లికొడుకు తండ్రి  పక్కకు వెళ్లగానే తాయర్‌ వచ్చి వాళ్లందరినీ తిడుతుంది.పిలవని పేరంటానికి ఎవరు రమ్మన్నారని నిలదీస్తుంది. నా కూతురు ఎంగేజ్‌మెంట్ చెడగొట్టడానికే వచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  ఆ పని చేయాలంటే నాకొడుకు ఎప్పుడో చేసేవాడని..వాడి మంచితనం వల్లే ఇప్పుడు నీకూతురు నిశ్చితార్థం జరిగిందని చెబుతాడు.ఆమె అన్న మాటలకు బాధపడి అందరూ  అక్కడి నుంచి భోజనం చేయకుండానే  వెళ్లిపోతారు.
               ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నారాయణ మాధవ్‌ను తిడతాడు.అసలు నువ్వు చేయబట్టే ఇదంతా జరిగిందని అంటాడు. చూశావుగా వాళ్ల బుద్ది ఎలాంటిదోనని అంటాడు. మనం నిజం చెప్పి ఉంటే ఈ నిశ్చితార్థం జరిగి ఉండేది కాదని అంటాడు. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్లను ఎలా  చూసుకున్నామని....ఇప్పుడు వాళ‌్లు ఎలా ప్రవర్తించారని అంటాడు. మనం నిజం చెబితే గాయత్రి బతుకు ఏమవుతుందో ఆలోచించావా అని మాధవ్ అంటాడు.దాని పెళ్లి చేడిపోతే అవమానభారంతో  ఆత్మహత్య చేసుకుంటుందని చెబుతాడు.నీ మంచితనమే నీకు శాపమంటూ  నారాయణ కొడుకును తిట్టి వె‌ళ్లిపోతాడు.దీంతో మాధవ్‌ కూడా బాధపడుతూ లోపలికి వెళ్లిపోతాడు.                                            శైలూ దిగాలుగా కూర్చుని ఉండటంచూసి కీర్తి అడుగుతుంది. ఇప్పుడు నువ్వు  పెద్ద సెలబ్రేటివని నీ రీల్స్‌కు వ్యూస్‌ మిలియన్స్‌లోఉన్నాయని అంటుంది.ఆ ముంగిసగాడితో తీసిన రీల్స్‌మాత్రం దూసుకుపోతున్నాయని...నేను సోలోగా చేసిన రీల్స్‌ ఎవడూ చూడటం లేదని దిగాలుగా ఉంటుంది. అయితే వాడే నీకు మంచి జోడీ అనుకుంటా అని కీర్తి  అంటుంది. ఛీఛీ వాడి ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుందని వాడు నాకు జోడీ ఏంటని అంటుంది. అయినా నేను చేసిన యాక్టింగ్ చూసే ఆ రీల్స్‌ చూస్తున్నారని వాడిని ఎవరు చూస్తారని అంటుంది. వాడికి నాకు లవ్‌ అసలు సెట్‌ అవ్వదని చెబుతుంది.ఇంతలో శైలూకి ఓ పెయిడ్‌ ప్రమోషన్ చేయాలంటూ కాల్‌ వస్తుంది. ఒక్కో రీల్‌కు 20వేలు ఇస్తామని చెప్పడంతో  ఎగిరి గంతేస్తుంది. వాళ్లు ఆఫీసుకు వచ్చి  మాట్లాడుకోమని చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది.
                      ఇంట్లో అందరూ బయటకు వెళ్లిపోవడంతో మహాకు  ఆధార్‌కార్డు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని నిహారిక భావిస్తుంది. నెమ్మదిగా వాళ్ల అత్తయ్య  గదిలోకి వెళ్లి  ఆధార్‌ కార్డు కోసం వెతుకుతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ఆది భార్య దేనికోసం వెతుకుతుందోనని చూస్తాడు. ఆమె ఆధార్‌కార్డు తెచ్చుకుని నెంబర్‌ నోట్‌బుక్‌లో నోట్‌ చేసుకుని మళ్లీ తీసుకెళ్లి అక్కడ పెట్టేయడం చూస్తాడు. అంటే నాకు తెలియకుండా   ఇంట్లో నుంచి తనకు కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ పంపిస్తున్నది నువ్వే అన్నమాట అనుకుని ఆమె రాసిన నెంబర్లు మార్చిపడేస్తాడు. ఇది తెలియని నిహారిక....మహాలక్ష్మీకి నెంబర్‌ పంపిస్తుంది. తన ఆధార్‌ నెంబర్‌ తనకు దొరికిందని మహా సంబరపడిపోతూ.. చక్రికి ఈ విషయం చెప్పగా...అతను గతుక్కుమంటాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget