Chinni Serial Today September 23rd: చిన్ని సీరియల్: మధుని కిడ్నాప్ చేసింది ఆఫ్‌టికెటా? కారణమేంటి? లోహికి షాక్ ఇచ్చిన శ్రేయ!
Chinni Serial Today Episode September 23rd మధు, ఆఫ్ టికెట్‌ని కలవడం అతన్ని చూసి ఎమోషనల్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారి

Chinni Serial Today Episode చిన్ని వచ్చింది.. చూసింది.. మిస్ అయిపోయింది.. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని నాగవల్లి దేవాతో చెప్తుంది. అది వచ్చిందని తెలిసింది కదా ఇప్పుడు ఇంకా పెద్దగా స్కెచ్ వేసి దాన్ని పట్టుకుందాం అని అంటాడు. మరోవైపు లోహిత మనిషి రెస్టారెంట్‌లో చాలా మంది ఫిక్స్ డ్రాయింగ్ వేయాలని మహి డ్రాయింగ్ వేసిన వాడిని తీసుకెళ్లిపోతాడు.
మహి వాళ్లు వచ్చే టైంకి పెయింటర్ ఇంట్లో ఉండదు. మహి చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. దొరుకుతుంది అనుకున్న ప్రతీ సారి దొరకడం లేదని మహి బాధ పడతాడు. లోహిత ఫ్రెండ్ పెయింటర్‌ని ఓ గదిలో బంధిస్తాడు. లోహితకు కాల్ చేయగానే నేను చెప్పే వరకు అతన్ని వదలొద్దని చెప్తుంది. మరోవైపు ఇద్దరు రౌడీలు మధుని పట్టుకొని ఓ రోడ్డు మీదకి తీసుకొస్తారు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఎవర్రా మీరు అని మధు అడిగితే మా అన్న తీసుకురమ్మన్నాడని చెప్తారు. ఎవర్రా మీ అన్న అని మధు అడిగితే వాళ్లు ఆఫ్ టికెట్‌ని చూపిస్తారు. మధు ఆఫ్ టికెట్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆఫ్ టికెట్‌ని పట్టుకొని ఏడుస్తుంది.
చిన్ని ఆఫ్ టికెట్‌తో నాన్న అబ్దికం ఏంటి అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు కార్యక్రమం చేస్తున్నారు అని అడుగుతుంది. అది మన వాళ్లు చేసేది కాదు అమ్మ.. ఎవరో కావాలనే చేస్తున్నారని చెప్తాడు. మరి నేను అక్కడికి వెళ్తున్నా అని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆటోలో అన్న ఫొటో కోసం నువ్వు వెతుకుతూ వెళ్లడం చూశా అని ఏం చేయాలో తెలీక ఇలా చేశానని చెప్తాడు. అన్నని కలిశానని చెప్తాడు. తర్వాత నాన్నని చూశాను.. అయితే ఇదంతా నేను బయటకు రావాలి అని చేశారా లేదంటే నాన్న తాలూకు వాళ్లు బతకకూడదు అని చేశారా అని అంటుంది. నాన్న గురించి నేను తెలుసుకుంటా నువ్వు మాత్రం ఎవరికీ చిన్ని అని తెలీకూడదు అని చెప్తాడు.
చిన్ని ఏడుస్తూ నాన్న ఎలాగూ నాతో లేరు నువ్వు అయినా నాతో ఉండు అని ఏడుస్తుంది. వద్దమ్మా నువ్వు నాతో ఉంటే నీకే ప్రమాదం నేను నీతో లేకపోయినా నిన్ను నీడలా కాపాడుకుంటానమ్మా అని చెప్పి చిన్నిని పంపిస్తాడు. తర్వాత శ్రేయ లోహితకు కాల్ చేస్తుంది. మినిస్టర్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు. నెస్ట్ వీక్ నిశ్చితార్థం అని చెప్తుంది. లోహిత షాక్ అయిపోతుంది. మా బావకి నాకు అదే ముహూర్తానికి పెళ్లి చేస్తారని శ్రేయ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత కాల్ చేస్తా అని లోహిత కట్ చేసేస్తుంది.
చందు, సరళ ఇంటికి వస్తారు. చిన్ని నిజంగానే వచ్చిందని కొంచెం సేపు ఉండుంటే దాన్ని చూసేవాళ్లం కానీ ఏం జరిగిందో ఏంటో ఒకటే పొగలు అని చిన్ని కిడ్నాప్ గురించి సరళ లోహితతో చెప్తుంది. ఆ దరిద్రం గురించి వదిలేయ్ అని లోహిత అంటుంది. చిన్ని ఎక్కడ ఉందో తెలీదు కానీ వచ్చింది చిన్నినే.. చిన్ని తప్ప ఇంకెవరికీ ఆ అవసరం లేదు అని అంటాడు. అది వస్తే వచ్చింది అయితే ఏంటి నీకు దండంరా దాని గురించి మాట్లాడకు అని లోహిత వెళ్లిపోతుంది. చందు చిన్నిని తలచుకొని చాలా బాధ పడతాడు.
మధు ఆటోలో వెళ్తూ మ్యాడీని చూసి పిలుస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. టీ తాగుదాం అని వెళ్తారు. మ్యాడీ మధుతో చూడటానికి ఏంజెల్‌లా ఉంటావ్.. బాగా చదువుకున్నావ్ ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతాడు. మధు మనసులో నిన్నే చేశానని ఎలా చెప్పాలి అని అనుకొని లేదని పైకి చెప్తుంది. పోనీ నిన్ను ఎవరైనా లవ్ చేశారా అని అడుగుతాడు. లేదు అని మధు చెప్తుంది. ఇంత అందమైన అమ్మాయికి ఎవరు చెప్పకుండా ఉంటారు చెప్పు అంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావ్ మధు కాలేజ్‌లో ఓ 20 మంది స్కూల్‌లో ఓ 20 మంది నిన్ను ప్రేమించిన వాళ్లు అంతా పిచ్చోళ్లు అయిపోయింటారని అని మధుని నవ్విస్తాడు. ఈ నవ్వు కోసమే ఇక్కడి వరకు తీసుకొచ్చా.. లేట్ అయింది కదా ఇక వెళ్దామా అని అంటాడు.
మ్యాడీ టీ డబ్బులు ఇస్తే అతను మీ జంట బాగుంది అన్నా అంటాడు. మేం ఫ్రెండ్స్‌రా అని అంటే తెలుసులే అన్న ముందు ఇలాగే అంటారు తర్వాత లవర్స్ అయిపోతారు అని అంటే మధు, మ్యాడీ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మధు ఏదో లోకంలో ఉంటే చిటికె వేసి మ్యాడీ పిలుస్తాడు. మధు మ్యాడీతో రేపు ఉదయం గుడికి వెళ్దాం పొలిమేర దగ్గర గుడికి రావాలి అని అంటుంది. మ్యాడీ సరే అని నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















