అన్వేషించండి

Chinni Serial Today October 10th: చిన్ని సీరియల్: మ్యాడీ లుంగీతో నవ్వులు, లోహితకు కష్టాలు.. దేవా పగ తీర్చుకుంటాడా?

Chinni Serial Today Episode October 10th బాలరాజు పరిస్థితి బాలేక దేవా మనుషులు హాస్పిటల్‌లో చేర్చడం దేవా చూడటానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధు వాళ్ల ఇంటికి వరుణ్, లోహితల్ని తీసుకొని వస్తాడు. మ్యాడీకి మధు గది చూపిస్తుంది. మ్యాడీ చిన్నతనంలో తనకు మధు ఇచ్చిన పెళ్లికూతురు బొమ్మని చూసి అక్కడే టేబుల్ మీద పెడతాడు. గది మొత్తం చూస్తాడు. ఇక మ్యాడీ డ్రస్‌తో ఇబ్బంది అవుతాడు. ఈ డ్రస్‌తో పడుకోవడం కష్టం అని అనుకుంటాడు. 

మధుకి విషయం చెప్తాడు. మధు వాళ్ల నాన్నతో లుంగీ తీసుకురమ్మని చెప్తుంది.  సుబ్బు లుంగీ, టీషర్ట్ ఇస్తాడు. మ్యాడీ తనకు వద్దని లుంగీ కట్టుకోనని అంటాడు. మధు లుంగీ ఎలా కట్టుకోవాలో చెప్తా అని చెప్తుంది. ఓ ఇంత ఈజీనా అని మ్యాడీ గదిలోకి వెళ్తాడు. టీ షర్ట్ వేసుకుంటాడు.. కానీ లుంగీ కట్టుకోలేకపోతాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటాడు. ఇక మధు బయట నుంచి అయిపోయిందా అని అడుగితే మధు కాదు అంటాడు. ఇక బయట నుంచి మధు చెప్తే లోపల మ్యాడీ కట్టుకుంటాడు. మ్యాడీ లుంగీ కట్టుకొని బయటకు వస్తే సూపర్ ఉన్నావ్ మ్యాడీ అని మధు అంటుంది. ఇక వంట చేస్తానని చెప్పి మధు వెళ్తుంది. 

మ్యాడీ వెళ్తూ అక్కడే ఉన్న మధు బొమ్మలు చూస్తాడు. అందులో తల్లిబిడ్డల బొమ్మ చూసి మమ్మీ నువ్వు నా గురించి ఎంత బాధ పడుతుంటావో నాకు తెలుస్తుంది.. సారీ మమ్మీ అని అనుకుంటాడు. నాగవల్లి ఏడుస్తూ ఉంటుంది. భోజనం కూడా చేయదు.. ప్రమీల వచ్చి భోజనం చేయమని చెప్తుంది. నా కొడుకు బయట ఎన్ని బాధలు పడుతున్నాడో.. టైంకి తింటున్నాడో లేదో అని ఏడుస్తుంది. నన్ను బలవంతం పెట్టొద్దని అంటుంది. శ్రేయ, వసంత వస్తారు. శ్రేయ తినమని తినిపిస్తుంది. నాగవల్లి వద్దని అంటుంది. దేవా వచ్చి మ్యాడీ కళ్లలో కనీసం రిగ్రేట్ లేదు కూడా అని దేవా అంటే కన్నతల్లిని కదా బావ అని నాగవల్లి ఏడుస్తుంది. 

దేవాకి రౌడీల నుంచి కాల్ వస్తుంది. బాలరాజు కళ్లు తిరిగి పడిపోయాడని చెప్తారు. దాంతో దేవా మనకి సంబంధించి హాస్పిటల్‌లో చేర్పించమని అంటాడు. నాగవల్లి విషయం తెలుసుకొని వాడిని చంపేయ్ బావ వాడు ఎందుకు అని అంటే నాకు వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉందికానీ చిన్నిని పట్టుకోవాలి అంటే వాడు ఉండాలి అని దేవా అంటాడు. ఇక మధు వాళ్ల ఇంట్లో అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తారు. మధు వరుణ్, లోహిత, మ్యాడీలను పిలుస్తుంది. 

స్వరూప అందరికి అన్నం వడ్డిస్తుంది. లోహిత కూర్చొడానికి ఇబ్బంది పడితే సుబ్బు సారీ చెప్పి అడ్జెస్ట్ అవ్వమని అంటాడు. లోహిత అడ్జెస్ట్ అవుతుందని వరుణ్ అంటాడు. లోహిత మనసులో ఎలా బతకాలి అనుకున్నా ఏ లైఫ్ వద్దు అనుకున్నానో అదే బతకాల్సి వస్తుందని అనుకుంటుంది. మధుకి లెగ్ పీస్ ఇష్టమని అంటే మ్యాడీ తన లెగ్ పీస్ ఇచ్చేస్తాడు. ఇక లోహిత తినకపోయే సరికి మా వంటలు నచ్చడం లేదా అని సుబ్బు అంటాడు. అలా ఏం లేదని లోహిత అంటుంది. మ్యాడీ పొలమారితే ఎవరో తలచుకుంటున్నారని మధు అంటే మా మమ్మీ అని మ్యాడీ అంటాడు. మ్యాడీ భోజనం చేసిన తర్వాత మధు మ్యాడీ ప్లేట్ తీసుకుంటుంది. ఇక వరుణ్ వరుణ్ ప్లేట్ లోహిత లోహిత ప్లేట్ పట్టుకొని బయటకు వస్తుంది. ఇక మధు బయట ప్లేట్ తోముతూ వరుణ్ దగ్గర ప్లేట్ లోహితను తీసుకోమని అంటుంది.

లోహితకు ఇద్దరి ప్లేట్స్ తోముకోమని చెప్తుంది. ఇదేం ఖర్మరా ఛీ యాక్ అని లోహిత అనుకుంటుంది. లోహిత నీకు తోమడం రాదా అని మధు నేర్పిస్తుంది. ఈ తన తల్లి దగ్గర వంటలు కూడా నేర్చుకోమని మధు చెప్తుంది. లోహిత ముఖం మాడ్చుకుంటుంది. బాలరాజుని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కి దేవా వెళ్తాడు. నా పగ కోసం అయినా వీడు బతకాలి అని అనుకుంటాడు. డాక్టర్ వచ్చి నీరసంగా ఉన్నాడు.. అన్ కాన్సియస్‌లో ఉన్నాడని చెప్తాడు. దేవా డాక్టర్‌తో వాడు బతకాలి అని అంటాడు. బాలరాజు దగ్గరకు వెళ్లి నిన్ను చంపడం నాకు ఒక్క క్షణం పనిరా కానీ నీ కళ్ల ముందే నీ కూతురిని చిత్ర హింసలు పెట్టి మీ ఇద్దరినీ కలిపి చంపుతానురా అని అంటాడు. దేవా మాటలకు బాలరాజుతో చలనం వచ్చి పిడికిలి బిగిస్తాడు. దగ్గరల్లో ఉన్న చాక్ తీసుకొని దేవా చేతి మీద పొడుస్తాడు. దాంతో దేవా ప్లేట్‌తో బాలరాజుని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget