Illu Illalu Pillalu Serial Today October 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ మిస్‌ఫైర్! ధీరజ్‌కి లవ్ లెటర్ రాసిందెవరు? కోడళ్ల మీద రామరాజు ఆగ్రహం!
Illu Illalu Pillalu Serial Today Episode October 10th నర్మద, ప్రేమల వల్ల రామరాజుని సేనాపతి అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద తల్లిదండ్రులు కూడా బతుకమ్మ వేడుక దగ్గరకు వస్తారు. నర్మద చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మీరేంటి ఇక్కడ అని నర్మద అంటే సాగర్ మన ఇంటికి వచ్చాడు.. పండగ రోజు మీ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేని బాధ భరిస్తుంది మీరు రండి.. నన్ను ద్వేషించినా పర్లేదు మీ అమ్మాయి సంతోషం కోసం రండి అని బతిమాలాడు అందుకే మీ నాన్న కూడా ఏం మాట్లాడకుండా వచ్చారని నర్మదతో తల్లి చెప్తుంది.
నర్మద ఎమోషనల్ అయి దూరంగా ఉన్న సాగర్ దగ్గరకు వెళ్తుంది. నా కోసం మా పుట్టింటికి వెళ్లావా.. నిన్ను ద్వేషిస్తారు అని తెలిసి కూడా ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. దానికి సాగర్ నీ సంతోషం కోసం నేను ఎన్ని అవమానాలు అయినా భరిస్తా అని అంటాడు. దాంతో నర్మద భర్తని వాటేసుకుంటుంది. అందరూ బతుకమ్మ ఆడుతారు. నర్మద అత్తని తీసుకొచ్చి భద్రావతి పక్కనే నిల్చొపెట్టి ఆడిస్తుంది. తర్వాత ప్రేమని కూడా భద్రావతికి తల్లికి మధ్య నిల్చొపెడుతుంది. ఇక ప్రేమ నర్మద తల్లిని నర్మద దగ్గర పెడుతుంది. వల్లీ తల్లి భాగ్యం కూడా వస్తుంది. భాగ్యంతో కలిసి ఆడుతుంది.
ధీరజ్ దూరం నుంచి ప్రేమని ప్రేమ ధీరజ్‌ని చూసుకోవడం చూసిన నర్మద ప్రేమని బయటకు తీసుకొచ్చి ఇద్దరూ ఒకరికి ఒకరు సైట్ కొట్టుకుంది చాలా వెళ్లి నీ ప్రేమ చెప్పు అని అంటుంది. ప్రేమ భయం వేస్తుంది అంటే అయితే లైఫ్ లాంగ్ మీరు నువ్విక్కడ నేనిక్కడ అంటూ పాటలు పాడుకోండి అని నర్మద అంటుంది.. అలా అనకు అక్క సాయం చేయ్ అంటుంది. దానికి నర్మద నువ్వు చెప్పలేవు కాబట్టి ధీరజ్ నీ దగ్గరకు వచ్చేలా చేస్తా అని నర్మద ఓ పాప దగ్గరకు వెళ్లి ఓ లెటర్‌ని చిన్న పాపకి ఇచ్చి ధీరజ్‌కి ఇవ్వమని చెప్తుంది. ఎవరు ఇచ్చారంటే ప్రేమని చూపించమని అంటుంది. పాప ధీరజ్ దగ్గరకు వెళ్లి లెటర్ ఇస్తుంది. ఎవరు ఇచ్చారు అంటే పాప ప్రేమని చూపిస్తే ధీరజ్ ప్రేమ వెనకాలే ఉన్న ఐశ్వర్య ఇచ్చిందని అక్కడికి వెళ్తాడు. ప్రేమ షాక్ అయిపోతుంది.
ధీరజ్ ఐశ్వర్య దగ్గరకు వెళ్లి ఏంటి ఇది అని అడుగుతాడు. నువ్వే ఇచ్చి నన్ను అంటావా.. ఇలా లెటర్ రాయకుండా డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా అని అంటుంది. ప్రేమ బిత్తరపోతుంది. ప్రేమ కోపంగా వెళ్లి కొడితే 32 పళ్లు రాలిపోతాయ్.. అని ఐశ్వర్యని అంటుంది. మా ఆయనకు ఐలవ్‌యూ అని లెటర్ రాస్తావా అని తిడుతుంది. ఇంతలో నర్మద వచ్చి చిన్నగా ప్రేమ ఆ లెటర్ నువ్వు రాసినట్లు ధీరజ్‌కి రాసింది నేనే అంటుంది. నర్మద ధీరజ్, ఐశ్వర్యలను పంపేస్తుంది. ఇప్పుడే ఇలా అయిే ముందు ముందు ఇంకేం అవుతుందో అని ప్రేమ అంటుంది.
ఇక అందరూ బతుకమ్మను నీటిలో కలపడానికి వెళ్తారు. రామరాజుతో ఊరిపెద్దలు ఇద్దరు మాట్లాడుతారు. సేనాపతితో ఊరి పెద్ద మాట్లాడుతారు. మీరు మీ బావ కలిసి పోయారు అని అంటే సేన కాలర్ పట్టుకుంటాడు. దానికి ఆయన నిన్ను మీ కూతురు మీ ఇంటి బతుకమ్మ తీసుకురావడం మేం చూశాం అని చెప్తాడు. అంటే మీరు కలిసిపోయినట్లే కదా.. మీరు మీ బావ కృష్ణార్జునుల్లా కలిసిపోండి అంటాడు. సేన అరుస్తాడు. పనోడితో దిక్కులేని అనాథతో కలిసిపోవడం ఏంటి అని అంటాడు. నా కూతురిని అడ్డు పెట్టుకొని నాతో కలిసిపోవాలని చూస్తున్నాడని అంటాడు. మీతో ఎవరు కలిసి పోవాలని అనుకుంటున్నారురా.. మీరు వచ్చి కాలు పట్టుకున్నా నేను మీతో కలవనురా అని రామరాజు అంటాడు. దానికి సేన నువ్వు మాతో కలిసి పోవాలని ప్లాన్ చేయకపోతే నా కూతురు, నీ రెండో కోడల్ని ఎందుకు మా ఫ్యామిలీ దగ్గరకు పంపావురా అని అడుగుతాడు. కోడళ్లని అడ్డు పెట్టుకొని మాతో కలిసిపోవాలని అనుకుంటున్నావ్ అని అంటాడు. ఇద్దరూ గొడవ పడతారు. రామరాజు మనసులో ఈ కోడళ్లు ఇద్దరూ నా పరువు తీయడానికే వచ్చినట్లు ఉన్నారు అని అనుకుంటాడు.
వేదవతి రాజరాజుని పిలిస్తే అనవసరంగా ఇక్కడికి వచ్చా ఇంట్లో ఉంటే పరువు అయినా మిగిలేది అని అంటాడు. ఏమైంది అని వేదవతి అడిగితే నీ ఇద్దరు కోడళ్లు నర్మద, ప్రేమలు నాకు అవమానం జరిగేలా చేశారని అంటాడు. అది విన్న వల్లివెళ్లి వాళ్లు ఎప్పుడూ మీకు అవమానం జరుగుతుంది అని రెచ్చగొడుతుంది. మరోసారి మీకు ప్రేమ నర్మదల వల్ల చొక్కా చిరిగిపోయే అంత అవమానం జరిగిందా అని ధీర్ఘాలు తీస్తుంది. ఇద్దరు కోడళ్ల వల్ల నాకు మనస్శాంతి లేదని రామరాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















