Chinni Serial Today july 9th: చిన్ని సీరియల్: బాలరాజుని బాంబ్‌లతో పేల్చేసిన దేవా.. మహి డిసప్పాయింట్.. ఇదే అసలు ట్విస్ట్!
Chinni Today Episode మహి చిన్ని కోసం చందు వాళ్ల ఇంటికి వెళ్లడం బాలరాజుని బాంబ్‌లు వేసి దేవా చంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి, తన ఫ్రెండ్‌తో కలిసి చిన్ని కోసం వెతుకుతాడు. చిన్ని తాను కలిసిన గుర్తులు అన్నీ గుర్తు చేసుకుంటాడు. మహి చిన్ని వాళ్ల పాత ఇంటికి వెళ్తాడు. అక్కడ తాళం వేసి ఉండటం చూసి అక్కడే ఉన్న వారిని కలిసి అడుగుతాడు. చందు వాళ్లు ఎవరూ లేరని పదేళ్లగా ఇళ్లు ఖాళీగా ఉందని చెప్తారు.
మహి చాలా బాధ పడతాడు. నీ గురించి ఏమైనా తెలుస్తుందని అనుకున్నా చిన్ని అని బాధ పడతాడు. బాలరాజు జైలు నుంచి విడుదల అవుతాడు. ఆఫ్ టికెట్ బాలరాజు ఒకర్ని ఒకరు హగ్ చేసుకొని చాలా సంతోషపడతారు. దేవాని వదిలి పెట్టొద్దని ఆఫ్ టికెట్ అంటాడు. ఇంతలో దేవా మనుషులు వచ్చి బాలరాజుని తీసుకెళ్లిపోతారు. ఆఫ్ టికెట్ కారు వెనక పరుగులు పెట్టి ఏడుస్తాడు. దేవా బాలరాజుతో వీడియో కాల్ మాట్లాడుతాడు. హోంమినిస్టర్ దేవాని చూడటం ఇక నీ వల్ల కాదని టీవీలో చూడటం తప్పా ఇంకేం చేయలేవు అని అంటాడు. నాగవల్లి కూడా చూస్తుంది. బాలరాజుని చంపేయమని అంటాడు.
మధుమిత కాలేజ్‌కి వెళ్తుంటుంది. బాలరాజు వాళ్ల కారు ఆగిపోతే ఆ వెనకాలే మధు స్కూటీ ఆపుతుంది. మధు మొత్తం చూసి తండ్రిని గుర్తు చేసుకుంటుంది. నాన్నని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. బాలరాజు కూడా తెలీకుండా కన్నీరు పెట్టుకుంటాడు. రౌడీలు బాలరాజుని ఓ చెరువు దగ్గరకు తీసుకెళ్లి తల మీద కొట్టి బాంబ్ పేల్చేస్తారు. బాలరాజు చనిపోతాడు. అది రౌడీలు వీడియో తీస్తారు. వీడియో చూసి నాగవల్లి తన పగ పూర్తయిందని ఇప్పుడు తృప్తిగా ఉందని అంటుంది. అక్క ఫోటో దగ్గరకు వెళ్లి నిన్ను చంపిన వాళ్లని చంపేశాం ఇక నా పగ పూర్తయింది అక్క అని అంటుంది. ఈ రోజు అసలైన పండగ అని సెలబ్రేట్ చేసుకోవాలి అంటుంది. శత్రు శేషం పూర్తయిందని దేవా అంటే చిన్ని ఉందని నాగవల్లి అంటుంది. చిన్ని చనిపోయింది కదా అని దేవా అంటే అప్పుడు చచ్చింది ఇప్పుడు బతికే ఉందని దాన్ని చంపేయాలి అంటుంది.
దేవాకి ఏం అర్థం కాకపోవడంతో చిన్ని మన ఊహల్లో ఇంకా బతికే ఉంది. మహి ఊహల్లో ఉన్న చిన్నిని చంపేస్తే కానీ మనకు తృప్తి కాదు అంటుంది. దానికి దేవా మహి ఊహల్లో ఉన్న చిన్నిని నువ్వు మాత్రమే చంపేయాలని వాడు నీ మాట మాత్రం కచ్చితంగా వింటాడు అని అంటాడు. మహిని నా మీద ఉన్న ప్రేమ అడ్డు పెట్టుకొని చిన్నిని చంపేస్తా అని అంటుంది. మహి చిన్నిని తలచుకొని కాలేజ్‌లో బాధగా ఉంటాడు. మహిని తన ఫ్రెండ్స్ ఎంటర్‌టైన్మెంట్ కావాలి అంటారు. మహి నీటి ముళ్లే నన్ను గిల్లే అని పాట పాడుతూ గిటారు వాయిస్తాడు. చిన్నిని తలచుకుంటూ పాడుతాడు. మధు వచ్చి మహిని ఇరిటేట్ చేసేలా పెద్ద సౌండ్ పెట్టి తీన్మార్ ఆడుతుంది. మహి అరిచి ఆపమని అంటే ఎవరు అది పిల్లిగడ్డం మాస్టారా అంటుంది. మధు ఊరమాస్ వీరమాస్ అని బొంబాయ్ పాట పెట్టమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!





















