Chinni Serial Today july 23rd: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!
Chinni Today Episode మధు తాగిన మైకంలో లోహిత భర్త్‌డే కేక్ పోగొట్టేయడం మహి కారులో నిద్రపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత తమకి బురిడీ కొట్టి పార్టీకి బయటకు వెళ్లిపోయిందని సరళ, చందుకి అర్థమవుతుంది. లోహితకు ఎన్ని సార్లు కాల్ చేసినా స్విఛ్ ఆఫ్ వస్తుంది. ఇక లోహిత పార్టీలో అందరూ డ్యాన్స్‌లు చేస్తుంటారు. చిన్నితో తాగించేస్తుంది. మత్తుగా చిన్ని తూగుతూ ఉంటుంది.
మధు మత్తులో పార్టీలో ఒకమ్మాయికి డ్యాస్ ఇచ్చేసి గొడవ పెట్టుకుంటుంది. ఇక లోహిత భర్త్‌డే కేక్ తీసుకొస్తుంటే మధు కేక్ తీసుకొచ్చిన అతన్ని ఢీ కొట్టి కేక్ కింద పడేలా చేస్తుంది. లోహిత చాలా ఫీలవుతుంది. మధు మాటలు చూసి తాగేశావ్ కదా.. నా భర్తడే నాశనం చేయడానికి ఇలా తాగి మొత్తం స్పాయిల్ చేసేసిందని అంటుంది. శ్రేయ కూడా మధుని చాలా తిడుతుంది. కావాలనే ముందే తినేసి తాగేసి ఇలా భర్త్‌డే నాశనం చేశావని అంటుంది. మధు మత్తులో వాళ్లతో వాదిస్తుంది. పొరపాటున చేయి తగిలి పడుంటుంది అని మధు అంటుంది. వరుణ్ వాళ్లతో పొరపాటున పడింది అని చెప్పింది కదా వదిలేయండి అంటుంది. లోహిత మాత్రం ఊరుకోదు.. నా భర్త్‌డే స్పాయిల్ చేసింది ఇలా మందు కొట్టి రచ్చ చేస్తుందని అంటుంది. మందు కొట్టావ్ అంటే నిన్ను కొడతా అని మధు అంటుంది. పద్దూ లోహితని చాలా బతిమాలుతుంది. మధు తాగిన డ్రింక్‌లో ఎవరో ఏదో కలిపారని అర్థం చేసుకో అని అంటుంది.
లోహిత పద్దూతో మధుని తీసుకొని బయటకు వెళ్లమని అంటుంది. లోహిత మధుతో తప్పు దీనిది కాదు ఇలా పెంచిన అమ్మానాన్నల్ని అనాలి అంటే మధు ఫైర్ అయిపోతుంది. తన అమ్మానాన్నల గురించి అంటే చంపేస్తా అని లోహిత మీదకు దూసుకెళ్తుంది. మధు తూగుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మధు తరఫున పద్దూ అందరికీ సారీ చెప్తుంది. మధు మత్తులో బయటకు వెళ్లి బుజ్జి స్కూటీ ఎక్కడ బుజ్జి స్కూటీ ఎక్కడ రా అంటూ మహి కారుని స్కూటీ అనుకొని డోర్ తీసి కారులో పడుకుండిపోతుంది.
పద్దూ మధు కోసం చీకట్లో మొత్తం వెతుకుతుంది. మధు ఎక్కడా కనిపించదు. లోహిత ఏడుస్తుంటే మహి, శ్రేయ, వరుణ్ సర్దిచెప్తారు. ఇక వరుణ్ మహిని వెళ్లిపోమని చెప్పి లోహిత మూడ్ సెట్ అయిన తర్వాత వస్తామని అంటాడు. లోహిత తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు తెగ సంతోషపడుతుంది. లోహిత వరుణ్‌ని హగ్ చేసుకుంటుంది. తన కోసం ఆలోచించినందుకు థ్యాంక్స్ చెప్తుంద. శ్రేయ షాక్ అయి చూస్తుంది. తర్వాత లోహిత శ్రేయని కూడా హగ్ చేసుకొని మీ అన్నాచెల్లెళ్లు నా కోసం ఆగిపోయారు థ్యాంక్యూ సోమచ్ అంటుంది.
మహి కారు స్టార్ట్ చేసుకొని బయల్దేరిపోతాడు. సగం దూరం వెళ్లే సరికి కారులో గురక సౌండ్ వస్తుంది. మహి కంగారు పడి మొత్తం చూసే సరికి వెనక మధు ఉంటుంది. మధుని చూసి బిత్తరపోతుంది. మహి డోర్ తీసి కారు దిగమని అంటాడు. నన్ను ఎవరో తాగించారు.. ఒకరు తాగించారు.. నేను ఇలా ఇంటికి వెళ్తే మా ఫాదర్ నాన్న.. మా మదర్ అమ్మ.. మా బ్రదర్ తమ్ముడు తట్టుకోలేరు.. ముఖ్యంగా మా నాన్న తట్టుకోలేరు ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అని బతిమాలుతుంది. మధు మహి దగ్గరకు వెళ్తుంటే మహి మూడు అడుగులు దూరం అంటాడు. దాంతో మధు నేను నిన్ను ముట్టుకోను నువ్వు నన్ను ముట్టుకో అని మహిని హగ్ చేసుకుంటుంది. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ నా తలంతా పట్టేసింది.. మా నాన్న తట్టుకోలేరు అని బతిమాలుతుంది. అటుగా వచ్చిన కొందరు అమ్మాయిలు వాళ్లని చూసి రోడ్డు మీద రొమాన్స్‌నా ఏయ్ ఏయ్ అంటూ వెటకారం చేస్తారు. ఇక మహి మధుని వాళ్ల ఇంటి దగ్గర దింపేస్తే ఏం గోల ఉండదు అనుకొని కారు ఎక్తిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!




















