Chinni Serial Today April 21st: చిన్ని సీరియల్: నీ శ్రేయాభిలాషి మా నాన్నే.. కావేరితో నిజం చెప్పేసిన చిన్ని!
Chinni Serial April Episode ఉష చిన్ని బాలరాజు కోసం గొడవ పడటం నిన్ను కాపాడిన నీ శ్రేయాభిలాషి మా నాన్నే అని చిన్ని కావేరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today April Episode చిన్నికి ఉషకి మధ్య బాలరాజు గురించి గొడవ జరుగుతుంది. తండ్రి మంచోడు మారిపోయాడు ఒక్క సారి తన గురించి ఆలోచించు అని చిన్ని అంటే ఆ దుర్మార్గుడు మారడు వాడి గురించి నువ్వు మర్చిపో అని కావేరి అంటుంది. చిన్ని అలిగిపోతుంది. తండ్రి గురించి ఆలోచించే వరకు మాట్లాడను అని తల్లితో చెప్పేస్తుంది. తల్లీకూతుళ్లు గొడవ తర్వాత చిన్ని కిందకి వస్తే సరళ వాళ్లు తింటుంటారు. సత్యంబాబు మేనకోడలికి తినడానికి పిలిస్తే టీచరమ్మ కడుపు నిండా పెట్టింది అని చెప్పి చిన్ని వెళ్లిపోతుంది. అది విన్న కావేరి బాధ పడుతుంది.
చిన్ని కోసం ఫుడ్ తీసుకొచ్చిన రాజు..
చిన్నికి తల్లికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది అని భారతి రాజుకి చెప్పడంతో రాజు చిన్ని కోసం క్యారేజీ తీసుకొని బయల్దేరుతాడు. సత్యంబాబుకి తెలిస్తే గొడవ అవుతుందని ఆఫ్ టికెట్ అంటాడు. ఇక సరళ ఫోన్‌కి ఆఫ్ టికెట్ కాల్ చేసి చందు ఫ్రెండ్ అని చందుతో మాట్లాడి చిన్నిని బయటకు పంపించమని అంటాడు. తింటున్నా తినేసి ఆ అసైన్ మెంట్ పూర్తి చేస్తాను అంటాడు. చందు చిన్ని దగ్గరకు వెళ్లి నీ కోసం మామయ్య క్యారేజ్ తీసుకొచ్చాడు పద అంటే నేను తినలేదు అని నాన్నకి ఎలా తెలుసు నేను రాను అంటుంది. దాంతో చందు కాల్ చేసి చిన్ని రాను అంటుంది. మీరు వెళ్లిపోండి అని అంటాడు.
నీ చేతి వంట తినే ఖర్మ ఎవరికీ లేదు..
ఆఫ్ టికెట్ విషయం బాలరాజుకి చెప్తే నేనే లోపలికి వెళ్తాను అని రాజు అంటాడు. వద్దు అని ఆఫ్ టికెట్ ఎంత చెప్పినా ఏం కాదు అని నా కూతురి కోసం సత్యంబాబు తిడితే పడతా కొడితే పడతా అంటాడు. సత్యంబాబు రాజుని చూసి ఆపుతాడు. నువ్వు ఎందుకు వచ్చావ్రా అని సత్యంబాబు అడుగుతాడు. చిన్ని కోసం అన్నం తెచ్చానని రాజు అంటే నీ చేతి వంట తినే ఖర్మ ఎవరికీ పట్టలేదు వెళ్లరా అని తిడతాడు. సరళ కూడా బాలరాజుని తిడతుంది. సత్యంబాబు రాజుని తోసేస్తాడు. బాక్స్ కింద పడిపోతుంది. అది చూసి ఏం కలిపి తీసుకొచ్చావ్‌రా అందులో విషం కలిపావా మా అందరిని చంపాలి అని తీసుకొచ్చావా అని అడుగుతాడు.
అన్నంలో ఏం కలిపావ్‌రా..
బాలరాజుకి కాలర్ పట్టుకొని సత్యంబాబు తిడుతుంటే చిన్ని వస్తుంది. మామ్య ఏం అనుకు వెళ్లిపోతాడు అంటుంది. తండ్రికి దండం పెట్టి పంపేస్తుంది. దిగులుగా రాజు వెనుతిరుగుతాడు. చిన్ని ఏడుస్తూ వెళ్లిపోతుంది. సత్యంబాబు సరళతో ఆ అన్నం కుక్కలకు వేసేయమని అంటాడు. తర్వాత తలో ఓ దిక్కున చేరి ఆలోచిస్తూ బాధ పడతారు. భర్త బాధని చూసి సరళ కూడా బాధ పడుతుంది.
మళ్లీ తల్లీకూతుళ్ల గొడవ
చిన్ని దగ్గరకు ఉష అన్నం తీసుకొని వెళ్తుంది. అన్నం తినాలి అని చెప్తుంది. గోరు ముద్దలు పెట్టబోతే నువ్వు నా మాట విని నాన్నతో మాట్లాడమ్మా అంటుంది. ఆ దుర్మార్గుడితో నేనేం మాట్లాడాలే వాడిని మళ్లీ మన జీవితాల్లోకి పిలిచి మా జీవితాలు నాశనం చేయాలా అని అడుగుతుంది. నా చావుకి వాడే కారణం అయ్యాడు ఎవడో శ్రేయాభిలాషి కాపాడాడు కాబట్టి నేను బతికాను లేదంటే వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయేది అని కావేరి అంటుంది. మన చావు కోరుకున్న అలాంటి రాక్షసుడు చస్తే కానీ మనకు పీడ వదలదు అని కావేరి అనగానే చిన్నిఅమ్మా అని గట్టిగా అరుస్తుంది. కావేరి షాక్ అయిపోతుంది.
నిజం చెప్పేసిన చిన్ని..
ఎందుకే నేను ఆ నీచుడు గురించి నేను మాట్లాడకూడదు అని ఉష అంటే ప్రపంచం దృష్టిలో నువ్వు కావేరిలా చనిపోయిన నిన్ను ఉషలా మార్చింది మా నాన్నే నిన్ను శ్రేయాభిలాషిలా కాపాడుకుంటూ వస్తుంది మా నాన్నే అని చెప్తుంది. కావేరి షాక్ అయిపోతుంది. కావేరి తనకు శ్రేయాభిలాషిలా ఏసీపీకి దొరక్కుండా కాపాడింది.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను కాపాడుతుంది మా నాన్నే అని చెప్తుంది. ఉష షాక్ అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడైనా నాన్నని నమ్ముతావా అమ్మ అని చిన్ని అడిగితే చచ్చినా నమ్మను అని కావేరి అంటుంది. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇలా నన్ను కాపాడాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!





















