అన్వేషించండి

Brahmamudi Serial Today September 9th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతి గురించి నిజం తెలుసుకున్న కనకం – స్వరాజ్‌ను అనుమనించిన రుద్రాణి

Brahmamudi serial today episode September 9th: స్వరాజ్‌ రేవతి కొడుకేనని ముసుగులో ఉన్నది రేవతియేనని కనకం నిజం తెలుసుకుంటుంది.    

Brahmamudi Serial Today Episode: సీతారామయ్య దగ్గరకు రేవతిని తీసుకెళ్లిన రాజ్‌, కావ్యలు ఎమోషనల్‌ అవుతున్న రేవతిని ఓదారుస్తుంటారు. ఇంతలో అక్కడకు స్వప్న, అప్పు, కళ్యాణ్‌ వస్తారు. అందరూ మాట్లాడుకుంటుండగా అపర్ణ, స్వరాజ్‌ను పిలుస్తూ వస్తుంది. అపర్ణ రావడం చూసి అందరూ కంగారు పడుతుంటారు. కావ్య, రాజ్‌, రేవతికి ఉన్న ముసుగు సరిచేస్తుంటారు. ఇందిరాదేవి, అపర్ణకు ఎదురుగా వెళ్తుంది.  

ఇందిరాదేవి: అపర్ణ నా ముఖం ఎలా ఉంది. ఇదిగో ఈ చెవి దుద్దులు ఎలా ఉన్నాయి.

అపర్ణ:  మీరెందుకు అంత కంగారు పడుతున్నారు.

ఇందిరాదేవి: దొరికిపోతామని..

అపర్ణ: ఏం దొరుకుతారు

కావ్య: అదే అత్తయ్యా పండగ సమయంలో ఏ విషయంలోనైనా తాతయ్య గారికి  దొరికిపోతానేమోనని కంగారు పడుతున్నారు

సీతారామయ్య: అవును నేనంటే చిట్టికి చాలా భయం అందుకే తెగ కంగారు పడిపోతుంది

అపర్ణ:  ఏంటో ఈరోజు అందరూ విచిత్రంగానే మాట్లాడుతున్నారు. ఆ రాధ అడగడం మర్చిపోయాను.. రాధ మిమ్మల్నే పిలుస్తున్నాను..

రేవతి: ఏంటండి.. చెప్పండి

అపర్ణ: ఆండి ఎందుకు ఆంటీ అనోచ్చు కదా

రాజ్: ఆంటీ అనడం ఇష్ట లేకపోతే అమ్మా అని పిలువు అక్కా నేను ఎలాగూ నిన్ను అక్కా అంటున్నాను కదా

ఇందిరాదేవి: పండగ పనులు పక్కన పెట్టి అందరూ ఇక్కడ మీటింగ్‌ పెడితే ఎలా

అంటూ ఇందిరాదేవి చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. హాల్లో వెళ్తున్న రుద్రాణిని రేవతి కొడుకు స్వరాజ్‌ పిలుస్తాడు. రుద్రాణి దగ్గరకు వెళ్తుంది.

రుద్రాణి: ఏంట్రా పిలిచావు..

స్వరాజ్‌: నాకు ఆరెంజ్‌ జ్యూస్‌ కావాలి అర్జెంట్‌ గా తీసుకురావా

రుద్రాణి: నేను నీకెందుకు జ్యూస్‌ తీసుకురావాలిరా.. నువ్వేమైన మైసూర్‌ మహరాజువా..?

స్వరాజ్‌: నేను ఈ ఇంటికి కాబోయే వారసుణ్ణి

రుద్రాణి: ఫ్రెండ్‌ అంటే వారసుడు అనుకున్నావా..? ఫ్రెండ్‌వు ఫ్రెండ్‌ లాగా ఉండు నేనేం నీకు పని మనిషిని కాదు

స్వరాజ్‌: హలో నేను అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను.. నేనే ఈ ఇంటికి కాబోయే వారసుణ్ని

రుద్రాణి: ( మనసులో) నేనేదో వీడి గురించి ఆరా తీస్తుంటే..  వీడే మొత్తం చెప్తున్నాడు.. వెతకబోయే తీగ కాళ్లకు తగిలినట్టు ఉంది.  

అనుకుంటూ అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తారు.

రుద్రాణి: ఇన్ని రోజులు మీకు తెలియని నిజం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.

ఇందిరాదేవి: ఏం నిజం చెప్పబోతున్నావు

రుద్రాణి: అసలు వీడు ఎవడో తెలుసా..?

అపర్ణ: నా ఫ్రెండ్‌ అనగానే.. కాదు వీడు ఈ ఇంటి వారసుడు

అందరూ షాక్‌ అవుతారు.

అపర్ణ: ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది స్వరాజ్‌ మన ఇంటి వారసుడు ఏంటి..?

ఇందిరాదేవి: తనే ఈ ఇంటి వారసుడు అని ఎవరు చెప్పారు..?

రుద్రాణి: ఎవరో చెప్పడం ఏంటి అమ్మా.. వీడే చెప్పాడు తనే ఈ ఇంటి వారసుడు అని

రాజ్: ఏంటి అత్తయ్యా మీరు చిన్నపిల్లాడు తెలియక వారసుడు అంటే అదే నిజమని నమ్మేయడమేనా..? కొంచెం కూడా కామన్‌ సెన్స్‌ ఉండక్కర్లేదా…

రుద్రాణి: కామన్‌ సెన్స్‌ ఉంది. కాబట్టే కన్‌ఫం చేసుకున్నేంత వరకు మిమ్మల్ని పిలవలేదు. ముందు నేను కూడా  చిన్న పిల్లాడు ఏదో తెలియక మట్లాడుతున్నాడని అనుకున్నాను.. కానీ వీడికి అన్ని తెలిసే మాట్లాడుతున్నాడని ఆ తర్వాతే అర్థం అయింది. ఈ ఇంటికి వారసుడు అయ్యే అవకాశం రాజ్‌, కళ్యాణ్‌, రాహుల్‌ లకు పుట్టబోయే పిల్లలకు తప్పా ఇంకొకరికి ఉంటుంది నీకు తెలుసా..? వదిన  నువ్వు వద్దని ఇంట్లోంచి వెళ్లగొట్టిన రేవతి కొడుక్కి కూడా ఉంటుంది.

అందరూ షాక్‌ అవుతారు.

ఇందిరాదేవి: రుద్రాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్తం అవుతుందా..? వాళ్ల అమ్మను ఎదురుగా పెట్టుకుని వాడు మన ఇంటి బిడ్డకు పుట్టిన వాడు అంటే ఏం బాగుంటుంది.

రుద్రాణి: ఆ ముసుగులో వచ్చిన ఆవిడ రేవతి కాదని ఏం గ్యారంటీ ఉందమ్మా..?  

కావ్య: ఏం మాట్లాడుతున్నారు మీరు.. రేవతి గారు ఇలా ముసుగులో రావడానికి ఆవిడకు ఏం అవసరం..

రుద్రాణి: అయితే ఒక్క నిమిషం ఉండండి తనెవరో ఇప్పుడే బయటపెడతాను.

అంటూ ముసుగు తీసయబోతుంటే అపర్ణ తిట్టి ఆపేస్తుంది. వాళ్ల ఆచారాన్ని నువ్వు పాడు చేస్తావా..? ముందు ఆవిడకు సారీ చెప్పు అంటూ… స్వరాజ్‌ను ఎందుకు వారసుణ్ని అన్నావు అని అడుగుతుంది అపర్ణ. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇల్లు నాది అన్నావు కదా ఇల్లు నాది అయినప్పుడు నేను ఈ ఇంటికి వారసుణ్ని అవుతాను కదా అందుకే చెప్పాను అంటాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ముసుగులో వచ్చింది రేవతి అని ఆ స్వరాజ్‌ రేవతి కొడుకే అని తెలుసుకుంటుంది. మరోవైపు రుద్రాణి కావ్య, అప్పుల కడుపు పోయేందుకు తీర్థంలో పాయిజన్‌ కలుపుతుంది. అది స్వరాజ్‌, కనకం చూస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget