అన్వేషించండి

Brahmamudi Serial Today September 30th:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య డిజైన్స్‌ చూసి సామంత్‌ షాక్‌ – డిజైన్స్‌ బాగా లేవని శృతిని తిట్టిన రాజ్‌

Brahmamudi Today Episode: కావ్య తీసుకొచ్చిన డిజైన్స్ చూసిన అనామిక, సామంత్‌ షాక్‌  అవుతారు. ఇక స్వరాజ్ గ్రూప్‌ అంతం మొదలైందని అనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రాజ్‌ తనకు ముద్దు పెట్టినట్టు తన్మయం చెంది. ఎంత మర్చిపోదామనుకున్నా ఆ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయేంటి అనుకుంటుది. ఇంతలో కనకం వస్తుంది. పేపరు మీద కావ్య తాను రాజ్‌తో గడిపిన క్షణాలను గీస్తుంది. అది చూసిన కనకం షాక్‌ అవుతుంది. మరోవైపు రాజ్‌ కూడా కళావతి పేరు మీద లెటర్‌ రాస్తుంటాడు. ఇందిరాదేవి చూసి ఇంట్లో కావాల్సిన సరుకుల లిస్టు అని ఇవ్వబోతుంటే నాకెందుకు ఇస్తున్నావు నాన్నమ్మ కళావతికి ఇవ్వు అంటాడు. దీంతో ఇందిరాదేవి రాజ్‌కు  క్లాస్‌ తీసుకుంటుంది. కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కనకం కూడా కావ్యకు క్లాస్‌ తీసుకుంటుంది తనను కన్వీన్స్‌ చేయాలని ట్రై చేస్తుంది. మరోవైపు కళ్యాణ్‌ ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పు భోజనం తీసుకుని వస్తుంది.

అప్పు: ఇదిగో తిను..

కళ్యాణ్‌: నాకేమొద్దు.. నువ్వే తిను.

అప్పు: పిచ్చి గానీ లేసిందా? నీకు కోచింగ్‌ సెంటర్‌ నుంచి వచ్చిన్నప్పటి నుంచి అలా ఉన్నావు.

కళ్యాణ్‌: అవును ఇలాగే ఉంటాను. అటు మా ఇంట్లో వాళ్లు నా మాట వినరు. బయటి వాళ్లు నా మాట వినరు. ఆఖరికి ఈరోజు నువ్వు కూడా నా మాట వినడం లేదు. కట్టుకున్న భార్యని పోలీస్‌ చేయాలనుకోవడం కూడా తప్పేనా..?

అప్పు: అది కాదు కూచి ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు అన్ని డబ్బులు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం.

కళ్యాణ్‌: అది నా బాధ ఏదైనా పడతాను. నీకెందుకు.

అప్పు: నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? పెళ్లికి ముందు నేను కష్టపడ్డాను. నువ్వు రాకుమారిడిలా పెరిగావు. కానీ ఇప్పుడు నా కోసం కష్టపడుతున్నావు.

కళ్యాణ్‌: భర్తగా నేను ఓడిపోతున్నానేమోనని నాకు బాధగా ఉంది. ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు. మా ఇంట్లో వాళ్లే నన్ను నమ్మలేదు. ఆఖరికి పెళ్లి చేసుకున్న నేను ఏమీ  చేయలేనని వదిలేసింది.

 అంటూ కళ్యాణ్‌ బాధపడుతుంటే సరేలే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ కళ్యాణ్‌కు అన్నం తినిపిస్తుంది అప్పు. మరోవైపు రాజ్‌ ఆఫీసుకు వెళ్తుంటే పూజ చేస్తున్న అపర్ణ తూలి పడిపోబోతుంటే..

రాజ్: మమ్మీ.. ఇటురా .. ఇక్కడ కూర్చో

అపర్ణ: ఏంటిరా..రాజ్‌ ఏమైంది…

రాజ్‌: ఎందుకు మమ్మీ రెస్ట్‌ తీసుకోమంటే ఈ పనులన్నీ చేస్తున్నావు.

అపర్ణ: పూజ పని కాదు. మన భారాన్నంతా భగవంతుని మీద వేయడానికి మనకు ఉన్న  సాధనం అదొక్కటే. మనుషులు చేయలేని పని ఆయనకు  అప్పజెప్పితే అది మంచి కోరికే అయితే ఆయనే తీరుస్తాడు అన్న నమ్మకంతో పూజ చేస్తాం కదా?

రాజ్‌: నువ్వు కొంచెం కోలుకునే వరకు ఎవరైనా దీపం వెలిగిస్తారులే మమ్మీ.

అపర్ణ: ఎవరు వెలిగిస్తారు. దీపం వెలిగించడానికి వచ్చిన ఇంటి కోడలును వెల్లగొట్టిన మహానుబావుడివి కదా? నువ్వు నాకు సలహాలు  ఇస్తున్నావా?

రాజ్‌: నువ్వు ఆవేశ పడకు మమ్మీ..

అపర్ణ:  ఆవేశం కాదురా.. ఆక్రోషం. ఎవర్ని ఏమనాలో తెలియని నిస్సహాయతలోంచి పుట్టుకొచ్చిన ఆక్రోషం. నీ వల్ల నా కోడలు మనసు విరిగిపోయింది. వెళ్లి తీసుకురామంటే.. మళ్లీ మనసు విరిచేశావు.

రాజ్‌: రాని వాళ్ల గురించి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించడం అవసరమా?

  అంటూ రాజ్‌ ఇక తాను ఎప్పటికీ కావ్యను తీసుకురావడం కుదరదని చెప్పి వెళ్లిపోతాడు. ఇందిరాదేవి  వచ్చి అపర్ణను ఓదారుస్తుంది. మరోవైపు సామంత్‌, అనామిక, మేనేజర్‌ సురేష్‌ ముగ్గురు కలిసి కావ్య గురించి మాట్లాడుకుంటుంటే కావ్య అక్కడకు వస్తుంది. కావ్యను చూసిన అనామిక, సామంత్‌ టేబుల్ కింద దాక్కుంటారు. సురేష్‌ కు డిజైన్స్‌ తీసుకొచ్చానని చెప్తుంది కావ్య. ఇద్దరు కలిసి కిందకు వెళ్లిపోతారు.

   మరోవైపు ఆఫీసులో ఎంప్లాయీస్‌ వేసిన డిజైన్స్‌ చూసి రాజ్‌ కోప్పడతాడు. ఎక్స్‌ ఫోకు ఇంత చెత్త డిజైన్స్‌ వేస్తారు అంటూ తిడతాడు. ఇంకోవైపు కావ్య వేసిన డిజైన్స్‌ చూసి సామంత్‌ షాక్‌ అవుతాడు. చాలా బాగా డిజైన్స్‌ వేసిందని మెచ్చుకుంటాడు. ఈ డిజైన్స్‌ ను వాడుకుని ఎక్స్‌ ఫోలో ఆ రాజ్‌పై పై చేయి సాధిస్తానని చెప్తాడు సామంత్‌. మరోవైపు కళ్యాణ్‌ ఆటో నడపడం చూసిన అప్పు ఫీల్‌ అవుతుంది. నాతో కూడా అబద్దం చెప్తావా? అంటూ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Maruti Suzuki Price Hike: 2025లో భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు - ఎంత పెంచుతున్నారంటే?
2025లో భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు - ఎంత పెంచుతున్నారంటే?
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Maruti Suzuki Price Hike: 2025లో భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు - ఎంత పెంచుతున్నారంటే?
2025లో భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు - ఎంత పెంచుతున్నారంటే?
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Moto G35 5G: రూ.10 వేలలోపే మోటొరోలా 5జీ ఫోన్ - జీ35 5జీ లాంచ్ అయ్యేది అప్పుడే!
రూ.10 వేలలోపే మోటొరోలా 5జీ ఫోన్ - జీ35 5జీ లాంచ్ అయ్యేది అప్పుడే!
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Embed widget