అన్వేషించండి

Brahmamudi Serial Today September 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: తనకు బిడ్డే ముఖ్యం అన్న కావ్య – కొత్త ప్లాన్‌ వేసిన రాజ్‌   

Brahmamudi serial today episode September 29th: తనకు తన బిడ్డే ముఖ్యమని రాజ్‌ ముఖం మీదే చెప్తుంది కావ్య. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఎలాగైనా అబార్షన్‌ అయ్యేలా చేయాలనుకుంటాడు

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కావ్యను నేను కావాలా..? నీకు నీకు బిడ్డ కావాలా అని అడగ్గానే.. మీ నిర్ణయం మీదైనప్పుడు.. నా నిర్ణయం కూడా చెప్తాను వినండి నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యం అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్‌ కోపంగా బయటకు వెళ్లిపోతాడు.

అపర్ణ: ఏంటండి ఇదంతా వీడు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడంటే వీడు చెప్పేది నిజమైన కారణం కాదేమో అనిపిస్తుంది వేరే ఏదో కారణం ఉందేమో..?

సుభాష్: ఇలాంటి కొడుకు మన కడుపున పట్టాలని రాసి పెట్టి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అపర్ణ.

రాజ్‌ దగ్గరకు కళ్యాణ్‌ వెళ్తాడు.

కళ్యాణ్: అన్నయ్యా ఫ్లీజ్‌ ఇప్పటి వరకు జరిగింది చాలు. అందరినీ బాధపెట్టి అందిరి చేత మాట అనిపించుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదన్నయ్యా.. ఇంక నీ మౌన వ్రతాన్ని వదిలేసి ఇప్పటికైనా వదినకు నిజం చెప్పేసెయ్‌..

రాజ్‌: మీ వదిన ఒప్పుకుంటుందా..? తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వద్దనుకుంటుందా..? ఇందాక తను ఎలా మాట్లాడిందో విన్నావు కదా..? కారణం చెప్పకుండానే అలా రియాక్ట్ అయిన కళావతి.. నిజం చెబితే ఇంకెలా రియాక్ట్‌ అవుతుందో ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డకు ప్రాణం పోస్తాను అంటుంది.

కళ్యాణ్‌: కానీ అన్నయ్యా వదినకు నిజం చెప్పకుండా ఇంకెంత కాలం అలాగే ఉండగలం చెప్పు.. సూదిని మూట కట్టినంత మాత్రాన అది దాగుతుందా..? అది ఏదో ఒకలాగా బయటకు వస్తుంది. నిజం బయటపడక ముందే.. నువ్వే నిజం చెప్పడం బెటర్‌ అన్నయ్యా..

రాజ్‌: లేదు కళ్యాణ్‌ ఎట్టి పరిస్థితుల్లో కళావతికి నిజం తెలియకూడదు.. కనీసం ఇప్పుడు ఏదో ఒక రకంగా అయినా తనను కాపాడుకోగలను అన్న ధైర్యం ఉంది. కానీ నిజం తెలిస్తే అసలు కాపాడుకోలేము

కళ్యాణ్‌: కానీ అన్నయ్య పరిస్థతి చూస్తుంటే వదిన మాట వినడం లేదు.. ఇప్పుడు ఎలా అన్నయ్య..

రాజ్‌: దానికి నేను ఒక ప్లాన్‌ చేశాను. పద వెళ్దాం

ఇద్దరూ కలిసి మెడికల్‌ షాపు దగ్గరకు వెళ్తారు.

రాజ్‌: డాక్టర్‌ సుధాకర్‌ ఎప్పుడూ మెడిసిన్స్ తీసుకునేది ఇక్కడి నుంచే నేను నీకు మెసేజ్‌ చేసిన మందులు చూపిస్తూ.. డాక్టర్‌ సుధాకర్‌ తీసుకురమ్మన్నాడని తీసుకురాపో కళ్యాణ్‌.

కళ్యాణ్: భయం వేస్తుంది అన్నయ్య.. పైగా ఇలా చేయడం చట్టరీత్యా నేరం.. వదినకు ఈ నిజం తెలిస్తే.. మనల్ని జీవితాంతం క్షమించదు..

అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. అరేయ్‌ నువ్వు వెళ్తావా..? నన్ను వెళ్లమంటావా… అని రాజ్‌ సీరియస్‌ అవ్వగానే.. కళ్యాణ్‌ మెడికల్‌ షాపులోకి వెళ్తాడు. మరోవైపు గార్డెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు ఇందిరాదేవి అపర్ణ వస్తారు.

అపర్ణ: కావ్య ఎక్కడ తాళి బంధానికి బెండ్‌ అవుతావేమోనని అనుకున్నాను కానీ బిడ్డ కావాలని చెప్పావు. వాడిప్పుడు అబార్షన్‌ ఎలా చేయిస్తాడో చూస్తాను నా పుల్‌ సపోర్ట్ నీకే

ఇందిరాదేవి: అపర్ణ పెద్ద దానివై ఉండి సర్ది చెప్పాల్సింది పోయి అలా మాట్లాడతావేంటి..?

అపర్ణ: మరి లేకపోతే ఇంకెలా మాట్లాడాలి అత్తయ్యా ఆకలితో అలిగాడంటే తల్లిగా బుజ్జగించేదాన్ని.. కానీ ఒక తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డనే వద్దు అంటున్నాడు అంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడాలి అత్తయ్యా.. కొడుకుగా తప్పు చేస్తానంటే క్షమిస్తాను అత్తయ్యా.. కానీ ఇంకొక తల్లికి అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు క్షమించను అత్తయ్య

ఇందిరాదేవి: అపర్ణ వాడు తన భర్త ఆ విషయం మర్చిపోతున్నావు..

అపర్ణ: భర్త అయినంత మాత్రాన దాని మీద అన్ని హక్కులు  వాడికే ఉంటాయా..? భార్యగా దానికి ఏ హక్కు అధికారం ఉండదా..? వాడేం చెప్తే దానికి సరే అంటూ గంగిరెద్దులా తలూపాలా.? అయినా వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా అత్తయ్యా.. ఈ విషయంలో వాడు ఏం చేసినా సరే నువ్వు మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకోకు కావ్య

అంటూ అపర్ణ వెళ్లిపోతుంది.

ఇందిరాదేవి: అమ్మా కావ్య ఈ విషయంలో నా మనవడు చెప్పినట్టు నడుచుకో అని చెప్పను.. తల్లిగా ఆ బిడ్డ విషయంలో పూర్తి హక్కులు నీకే ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో నీ ఇష్టం..

కావ్య: లేదు అమ్మమ్మ గారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కాదు.. ఈ విషయంలో ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి

ఇందిరాదేవి: ఏంటి కావ్య నువ్వు చెప్పేది..

కావ్య: అవును అమ్మమ్మ ఆయన ఎలాంటి వారో మనకు తెలుసు.. ఆయనది చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం. అలాంటి తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే.. కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మమ్మ. అదేంటో తెలుసుకుంటే.. ఆయనెందుకు ఇలా బిహేవ్‌ చేస్తున్నారో తెలిసిపోతుంది.

అని చెప్పగానే ఇందిరాదేవి అవును అదేదో త్వరగా తెలుసుకో కావ్య అని చెప్తుంది. ఇక మెడికల్‌ షాపులోకి వెళ్లిన కళ్యాణ్‌ అబార్షన్‌ మెడిసిన్స్‌ తీసుకుని వచ్చి రాజ్‌కు ఇచ్చి ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. కావ్య రూంలో చిన్న పిల్లల ఫోటోలు అతికిస్తుంటే.. రాజ్‌ చూసి వెళ్లిపోతాడు. ఇందిరాదేవి వచ్చి ఈ పని ఎందుకు చేస్తున్నావు రాజ్‌ మనసులో ఏముందో తెలుసుకో అని చెప్తుంది. కావ్య సరే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget