అన్వేషించండి

Brahmamudi Serial Today September 21st:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌ కంపెనీలోకి కావ్య – శాంతకు ప్రమోషన్‌ ఇచ్చిన రాజ్‌

Brahmamudi Today Episode: రాజ్‌ వెంటనే కావ్యను ఇంటికి తీసుకురాకపోతే నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో నాకే తెలియదు అని అపర్ణ వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కళ్యాణ్‌  రోడ్డున పడటం కాదు. నిన్ను ఇది రోడ్డున పడేయకుండా చూసుకో అంటుంది అప్పు.  దీంతో ఆలోచనలో పడిపోతాడు సామంత్‌. అదంతా ఏం లేదు మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంది అనామిక. నిజమేనా బ్రో అని సామంత్‌ ను అడుగుతుంది. అవునని సామంత్‌ చెప్తాడు. అయితే నీకు ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్స్‌ ఉంటే వెంటనే వాళ్లతో ఫ్రెండిప్‌ కట్‌ లేదంటే నీకు వాళ్లకు అక్రమసంబంధం అంటగట్టి నిన్ను కోర్టుకు ఈడుస్తుంది. అని చెప్పి వెళ్లిపోతారు మరోవైపు రాజ్‌ కిందకు వస్తూ కావ్య వంట చేయకపోతే ఎవ్వరూ చేయరన్నంత బిల్డప్‌ ఇస్తున్నారు. ఈరోజు నుంచి శాంతతో వంట చేయిస్తాను.

రాజ్‌: శాంత

శాంత: ఏంటి బాబు మీకు కాఫీ ఇవ్వమంటారా?

రాజ్‌: ఇందాకే ఇచ్చావు కదా? ఈరోజు నుంచి నేను నీకు ప్రమోషన్‌ ఇస్తున్నాను.

ఇందిరాదేవి: ఎందుకు శాంతకు ప్రమోషన్‌ ప్రకటించారో తెలుసుకోవచ్చా రాజుగారు.

రాజ్‌: తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈరోజు నుంచి ఇంట్లో శాంతనే వంట చేస్తుంది. ( అందరూ షాక్‌ అవుతారు) ఏంటి ఇంత చిన్న విషయానికి అంత స్టాండ్‌ అవసరమా?

రుద్రాణి: ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నావు రాజ్‌.  

రాజ్: ఈ ఇంట్లో ఎవ్వరో లేకపోతే ఏదో లోటు జరుగుతుందనుకున్న వాళ్లకు శాంత వంటే సమాధానం.

ప్రకాష్‌: అది సమాధానం కాదు నాన్నా ఆరోగ్య దానం.

రాజ్‌: బాబాయ్‌ నీకు శాంత వంట గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు.

ధాన్యలక్ష్మీ: శాంత వంట నువ్వు ఎప్పుడు తిన్నావు రాజ్‌.

అపర్ణ: తిన్నాడులే ఒకరోజు

ఇందిరాదేవి: అసలు ఎందుకురా నీకు అంత పంతం.

స్వప్న: నాకేం అభ్యంతరం లేదు. కానీ శాంత వంట చేయగానే ముందుగా మా అత్తకు పెట్టాలి. ఆవిడ బాగుంటే మనమందరం సేఫ్‌

రుద్రాణి: ఏయ్‌ షటప్‌.. మీరంతా సైంటిస్టులు.. నేను ఎలుకనా..?

రాజ్‌: మీరంతా ఎందుకు టెన్షన్‌ పడతారు అత్తయ్యా ముందు నేనే తింటాను

   అంటూ శాంతను శాంత వంటను మెచ్చుకుంటాడు. శాంతను వెళ్లి వంట చేయమని అపర్ణ చెప్తుంది. సరేనని వంటలు కుమ్మేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది శాంత. మరోవైపు బొమ్మలు చేస్తున్న  కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి సాయం చేస్తానంటుంది కావ్య. లోపలి నుంచి వచ్చిన కనకం కోపంగా కావ్యను, కృష్ణమూర్తిని తిడుతుంది. కాపురానికి వెళ్లాల్సిన కూతురుని బొమ్మలు చేయిస్తున్నావని అంటుంది. తర్వాత కనకం అల్లుడి గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్తుంది. అపర్ణను గుర్తు చేసుకుని కావ్య బాధపడుతుంది. మరోవైపు శాంత చేసిన వంట తినేందుకు అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రెడీగా ఉంటారు.

రాజ్:  అబ్బాబ్బా వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి.

ప్రకాష్‌: ఆ వీధి చివర ఇంజనీరు నా కారు పోకుండా బైక్‌ అడ్డంగా పెట్టాడురా. వాణ్ని కూడా పిలవరా భోజనానికి.

ధాన్యలక్ష్మీ: చాల్లేండి మీరు మరీ చెప్తున్నారు.

ఇందిరాదేవి: పాపం దానికి చేతనైంది అది చేసిందిరా తినక ముందే ఇన్ని రకాలుగా అంటే ఎలా?

రాజ్‌: శాంత నీ వంట సంగతి తెలియని వాళ్లు ఏదేదో అంటుంటారు. ముందు నువ్వు వడ్డించు అందరికీ..

 ప్రకాష్‌: మా వదిన పాపం హాస్పిటల్‌ నుంచి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. కావాలంటే మా ధాన్యలక్ష్మీకి వడ్డించు.

   అని ఒక్కొక్కరు తమకు వద్దంటే తమకు వద్దని అటుంటారు. ఇంతలో అపర్ణ ఇక చాలు ముందు నిన్ను వంట చేయమన్నది ఎవరో వాళ్లకు వడ్డించు అని చెప్పగానే రాజ్‌ కు వడ్డిస్తుంది శాంత. ఆ భోజనం తిన్న రాజ్‌ ప్రీజ్‌ అయిపోతాడు. కారం తట్టుకోలేక అల్లాడిపోతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఆరోజు అంత అద్బుతంగా వంట చేశావు ఈరోజు ఏంటి ఇలా చేశావు అని రాజ్‌ అడుగుతాడు. దీంతో అపర్ణ ఆరోజు వంట చేసింది కావ్య అని చెప్తుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని కావ్య తీసుకురా అని చెప్తుంది అపర్ణ. లేదంటే నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసుగా? అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రాజ్‌ లేచి వెళ్లిపోతాడు.  

   మరోవైపు అనామికను తీసుకుని సామంత్‌ ఆఫీసుకు తీసుకెళ్తాడు. ఆఫీసులో వాళ్లు ఇద్దరి గురించి బాడ్‌ గా మాట్లాడుకుంటారు. మన కంపెనీ స్వరాజ్‌ ను మించి పోవాలంటే కావ్య మనకు డిజైన్స్‌ ఇవ్వాలని అందుకోసం ఒకణ్ని రంగంలోకి దించుతానని చెప్తుంది అనామిక. మేనేజర్‌ పిలిచి సందీప్‌ ద్వారా కావ్య మనకు డిజైన్స్‌ ఇచ్చేలా చేయాలని చెప్తుంది. మేనేజర్‌ సరే అని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను బ్లాక్‌ మెయిల్‌ చేసిన భూమి -  ఇందును తిట్టిన చెర్రి

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget