అన్వేషించండి

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: తండ్రీ కొడుకుల మధ్య మొదలైన రగడ – సుభాష్‌ ను తిట్టిన రాజ్‌

Brahmamudi serial today episode September 20th: రాజ్‌ను ఆఫీసుకు వెళ్లమని చెప్పిన సుభాష్‌ను  రాజ్‌  తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  కావ్యకు అబార్షన్‌ చేయకుండా చిన్న ఆప్షన్‌ ఉన్నా చూడమని రాజ్‌, కళ్యాణ్‌ వెళ్లి అడుగుతారు. దీంతో డాక్టర్‌ సీరియస్‌ అవుతుంది. రాజ్‌, కళ్యాన్‌ను తిడుతుంది.

డాక్టర్‌: మీరేంటండి మళ్లీ మొదటికి వచ్చారు. తల్లీ బిడ్డను కాపాడమంటున్నారు. ఆ ఆప్షన్‌ లేకే ఒక డాక్టర్‌ అయ్యుండి కూడా ఈ ఆప్షన్‌ చెప్పింది..

రాజ్‌: కానీ బిడ్డను వదులుకోలేకే కదా డాక్టర్‌ మళ్లీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది.

డాక్టర్‌: అయితే మీ భార్య ప్రాణాలతో ఆడుకుంటారా..?

రాజ్‌: నేను కళావతి ప్రాణాలతో ఆడుకోవాలని ఇలా అడగడం లేదు డాక్టర్.. తన ఆనందాన్ని దూరం చేయకూడదనే ఇలా అడుగుతున్నాను. పాపం పిచ్చిది నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడింది. కాదు నేనే ఇబ్బంది పెట్టాను. ఇన్ని రోజులు తనకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు డాక్టర్‌. కానీ ప్రెగ్నెంట్‌ అయిన దగ్గర నుంచి తను చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో తన దగ్గరకు వెళ్లి నీ కడుపులో బిడ్డను తీసేయాలి అని ఎలా చెప్పగలను..

డాక్టర్‌: చూడండి రాజ్‌ గారు మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ  ఈ విషయంలో మనం ఏదైనా చేయగలిగింది ఉంది అంటే అది ఒక్క అబార్షనే.. కావ్య గర్బ సంచి చాలా వీక్‌ గా ఉంది. తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం.

రాజ్‌: అది కాదు డాక్టర్‌ ప్రతి ప్రాబ్లమ్‌ కు ఏదో ఒక సొల్యూషన్‌ ఉన్నట్టే ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండొచ్చు కదా

డాక్టర్: రాజ్‌ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేంటి..? కళావతికి అబార్షన్‌ చేయడం తప్పా ఇంకే ఆప్షన్‌ లేదు.. అది కూడా ఇప్పుడు చేస్తేనే తను బతుకుతుంది. తల్లీ బిడ్డలు చనిపోతారంటే అర్థం కావడం లేదేంటి

రాజ్‌: మీకే అర్థం కావడం లేదు..

అంటూ డాక్టర్‌ రూంలో వస్తువుల చిందరవందర చేస్తాడు. కళ్యాణ్‌ డాక్టర్‌కు సారీ చెప్పి రాజ్‌ను తీసుకుని బయటకు వెళ్తాడు.

రాజ్‌: ఇది అసలు హాస్పిటలే కాదు.. వాళ్లు అసలు డాక్టర్లే కాదు.. లేకపోతే ఒక్కరే బతుకుతారని చెప్తారా..?

కళ్యాన్‌:  ఆగు అన్నయ్యా ఆగు

రాజ్‌: ఏంట్రా ఆగేది ఆగి ఏం చేయమంటావు.. వాళ్లు చెప్పిందంతా విని ఓకే డాక్టర్‌ ఓకే డాక్టర్‌ అంటూ తలూపాలా..? అంత కచ్చితంగా చెప్పడానికి వాళ్లైమైన కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారా..

కళ్యాణ్‌:  అన్నయ్య నీ బాధ నాకు అర్థం అయింది. కానీ కాస్త ప్రాక్టికల్‌ గా ఆలోచించు

రాజ్‌: ఏంట్రా ప్రాక్టికల్‌ గా ఆలోచించేది.. నేను వెల్లి కళావతికి ఈ విషయం చెప్పి తనకు అబార్షన్‌ చేయించాలా..? అసలు నేనే ముందు ఒప్పుకోనురా..

కళ్యాణ్‌: తప్పదు అన్నయ్య ఒప్పుకోవాలి. ఈ హాస్పిటల్ ఈ సిటీలోనే మంచి పేరున్న హాస్పిటల్‌ డాక్టర్‌ కూడా మనకు తెలిసిన వారే అన్నయ్య.. వాళ్లు ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు అలా చెప్తారు. ఏ డాక్టర్‌ అయినా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనే చూస్తారు కానీ పొగొట్టాలని చూడరు కదా అన్నయ్య

రాజ్‌: కళ్యాణ్‌ ఎవరు ఏం చెప్పినా సరే నాకు తల్లీబిడ్డ ఇద్దరూ కావాలి.. ఇంత ఆస్థి పెట్టుకుని తల్లీ బిడ్డను కాపాడుకోలేకపోతే ఇంకెందుకురా ఇదంతా ఇద్దరూ బతుకుతారు.. ఇద్దరినీ బతికించుకుంటాను.. అయినా ఆ డాక్టర్‌ కు ఏమైనా లూజా రా.. అసలు ప్రయత్నం చేయకుండానే రిజల్ట్‌ చెప్పేస్తుంది. కళ్యాణ్ నీకు తెలిసిన చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా వాళ్లందరికీ ఫోన్‌ చేయ్‌

కళ్యాణ్‌: అన్నయ్య తను నీకు భార్య అయితే నాకు వదిన అన్నయ్య.. నాకు అమ్మ అన్నయ్య.. నేను చాలా ప్రయత్నాలు చేశాను అన్నయ్య.. స్పెషలిస్టులతో కూడా మాట్లాడాను ఈ డాక్టర్లు చెప్పిందే వాళ్లు చెప్పారు.

అంటూ రాజ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంటాడు కళ్యాణ్‌. ఇక స్వప్నను తనలో మార్పు వచ్చిందని నమ్మించడానికి రాహుల్ నాటకం ఆడుతుంటాడు. రాహుల్ మాటలకు స్వప్న కూడా రాహుల్ మారిపోయాడేమో అని మనసులో అనుకుంటుంది. ఇక రాజ్‌, కళ్యాన్‌ ఇంటికి రాగానే రాజ్‌ను ఆఫీసుకు వెళ్లమని సుభాష్ చెప్తాడు. రాజ్‌ వెళ్లనని అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. రాజ్‌కు నచ్చజెప్పాలని చూస్తారు. ఇరిటేషన్‌లో రాజ్‌ ఎవ్వరి మాట వినడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget