అన్వేషించండి

Brahmamudi Serial Today November 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణిని బెదిరించిన రంజిత్‌ - అయోమయంలో కావ్య, రాజ్‌   

Brahmamudi serial today episode November 8th: రాహుల్‌ విషయంలో రుద్రాణిని రంజిత్‌ బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. ఇంతలో ఇంట్లోకి పోలీసులు వస్తారు. పోలీసులను చూసి అదరూ షాక అవుతారు.

సుభాష్‌: ఏంటి ఎస్సై గారు ఇక్కడికి వచ్చారు

రాజ్‌: ఏంటి ఎస్సై గారు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు

ఎస్సై: ఇక్కడ రాహుల్‌ ఎవరు

రుద్రాణి: ( మనసులో) వీడు మళ్లీ ఏం చేసి చచ్చాడు వీడి గురించి అడుగుతున్నారేంటి..?

రాహుల్: నేనే రాహుల్ సార్‌.. ఏమైంది..?

ఎస్సై: కానిస్టేబుల్‌ అరెస్ట్‌ హిమ్‌

రాజ్‌: ఏంటి ఎస్సై గారు మా వాడు ఏం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు..?

ఎస్సై: అతను మర్డర్‌ చేశాడు

రాజ్: ఏం మాట్లాడుతున్నారు ఎస్సై గారు

ఎస్సై: రాహుల్‌ అనే ఈ వ్యక్తి కొట్టడం వల్లే కూయిలీ అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని రాహుల్ చంపాడని ఆ అమ్మాయి భర్త కేసు పెట్టాడు

రాజ్: ఎస్సై గారు మా వాడు మర్డర్‌ చేసేంత దుర్మార్గుడు కాదు.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది

ఎస్సై: అది మేము చూసుకుంటాము.. నీకు కూయిలీ అనే అమ్మాయికి పరిచయం ఉందా..? ఆ అమ్మాయిని నువ్వు నిన్న కొట్టావా..?

రాహుల్‌: కొట్ట లేదు సార్‌ జస్ట్‌ తోశాశాను ఆ మాత్రం దానికే చనిపోతుందా..?

ఎస్సై: అదంతా కోర్టులో చెప్పుకో.. కానిస్టేబుల్‌ అరెస్ట్ చేయండి..

రుద్రాణి: సార్‌ వాడు అమాయకుడు ఏ తప్పు చేయలేదు సార్‌.. వాడిని వదిలేయండి

ఎస్సై: అతను ఏ తప్పు చేయకపోతే జడ్జి గారే వదిలేస్తారు

అంటూ రాహుల్‌ ను అరెస్ట్‌ చేసి పోలీసులు తీసుకెళ్తారు. దీంతో రుద్రాణి అందరినీ తిడుతుంది. పోలీసులు నా కొడుకుని తీసుకెళ్తుంటే ఎవ్వరూ అడ్డు పడరేంటని నిలదీస్తుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. తర్వాత స్వప్న బాధపడుతుంటే.. రాజ్‌, కావ్య వెళ్లి ఓదారుస్తారు.

కావ్య: అక్కా రాహుల్ కు ఏమీ కాదు నువ్వేం బాధపడకు

స్వప్న: పోలీసులు రాహుల్‌ను తీసుకెళ్లినందుకు నేను బాధపడటం లేదు కావ్య.. నేను మళ్లీ ఇంకొకసారి మోసపోయానేంటి అని బాధపడుతున్నాను..

రాజ్‌: స్వప్న నువ్వు మోసపోయానని ఎందుకు అనుకుంటున్నావు.. అక్కడ ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా

స్వప్న: కానీ పోలీసులు సరాసరి రాహుల్‌ ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏమనుకోవాలి. మీరు రాహుల్‌ను మార్చాలి అనుకున్నారు. రాహుల్‌ మారకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికీ తనన మార్చడం సాధ్యం కాదు అందుకే నేను నమ్మను అన్నాను.. మీరే ఒక్క అవకాశం ఇవ్వమన్నారు..

కావ్య: లేదు అక్కా నువ్వు అనుకున్నది నిజం కాదనిపిస్తుంది.  నాకు ఎందుకో అనుమానంగా ఉంది. రాహుల్‌ డబ్బు మీద ఆశ ఉన్నవాడే అందని దానికి నిచ్చెన వేసే వాడే కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్‌కు ఉందని నేను అనుకోవడం లేదు అక్క

రాజ్‌: అవును స్వప్న వాడు మూర్ఖుడే కావచ్చు కానీ హత్య చేసేంత దుర్మార్గుడు కాదు

స్వప్న: కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా..? నమ్మకుండా ఎలా ఉండగలం చెప్పు..

రాజ్‌: కళ్లకు కనిపించినవన్నీ నిజాలు కాదు.. కనిపించనివి అబద్దాలు కాదు.. వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి తొందరపడకుండా అర్థం చేసుకో

అంటూ ఇద్దరూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రంజిత్‌ రుద్రాణికి ఫోన్‌ చేసి బెదిరిస్తాడు. రెండు కోట్లు ఇస్తే నీ కొడుకు మీద కేసు వాపసు తీసుకుంటానని చెప్తాడు. ఇదే విషయం ఇంట్లో వాళ్లకు రుద్రాణి చెప్తుంది. ఎవ్వరూ పట్టించుకోరు దీంతో రుద్రాణి కోపంగా రంజిత్‌ దగ్గరకు వెళ్లిపోతుంది. రాజ్‌, కావ్య ఇద్దరూ తాము కూయిలీ ఇంట్లో పెట్టిన సీసీకెమెరా పుటేజీ చూడ్డానికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget