అన్వేషించండి

Brahmamudi Serial Today November 8th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:     రాజ్‌కు బోనస్‌ ఇచ్చిన కావ్య – కావ్యకు రాజ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

Brahmamudi Today Episode: బోనస్‌ సందడితో దుగ్గిరాల కుటుంబంలో చాలా సందడి నెలకొనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode:  పూజ పూర్తి అయిన తర్వాత వర్కర్స్‌ కు చెక్స్‌ ఇవ్వడానికి ప్రకాష్‌ అంతా రెడీ చేస్తాడు. సీతారామయ్య, కావ్యను ఇక చెక్కులు పంపిణీ చేయమని చెప్తాడు. దీంతో తాను చేయనని మీరు మామయ్యలు, ఆయన ఉండగా నేను ఎలా పంపిణీ చేయగలను అంటుంది కావ్య.  రుద్రాణి కూడా కావ్యను బోనస్‌ లు ఇప్పించడం ఏంటని ప్రశ్నిస్తుంది. అవును మామయ్యగారు కంపెనీ చైర్మన్‌ గా మీరున్నారు. బావగారు ఉన్నారు. మా ఆయన ఉన్నారు. మీరందరూ కాకుండా కావ్యతో ఇప్పించడం ఏంటని అడుగుతుంది.

అపర్ణ: రుద్రాణి నిన్ను బాగా ప్రబావితం చేస్తుంది ధాన్యలక్ష్మీ. నేను కోడలిగా అడుగుపెట్టినప్పుడు, నువ్వు కోడలిగా అడుగుపెట్టినప్పుడు దీపావళికి బోనస్‌ లు నీతోనే ఇప్పించారు కదా..? అప్పుడు నాకు అర్హత లేదని నేను అనలేదు. నీకు అర్హత లేదని నువ్వు అనలేదు. నా కొడలు దాకా వచ్చే సరికి ఆపడానికి నువ్వెవరు..? ఆ ధాన్యలక్ష్మీ ఎవరు..?

ఇందిర: రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇది ఇంటి సమస్య. బోనస్‌ లు ఇవ్వడం సీఈవో బాధ్యత. దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. చైర్మన్‌ గా నా భర్త చెప్పినట్టు చేయాల్సిందే.

రాహుల్‌: రాజ్‌ హర్ట్‌ అవుతాడేమో ఒకసారి ఆలోచించండి అమ్మమ్మా..?

రాజ్‌: లేదు. కంపెనీ వర్కర్స్‌ కు బోనస్‌ ఇవ్వడం అనేది మన బాధ్యత. ఎవరి చేత ఇప్పించాము అనడం కన్నా స్టాఫ్‌ అందరూ దీపావళి సంతోషంగా జరుపుకోవడం ముఖ్యం.

సీతారామయ్య: మంచి మాట చెప్పావు రాజ్‌ ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు. అమ్మ కావ్య ఇక నీ సంశయాలు తీరినట్టేగా వెళ్లి బోనస్‌ లు ఇవ్వు అమ్మ

   అని చెప్పగానే సరేనని కావ్య వెళ్లి బోనస్‌ లు ఇస్తుంది. వర్కర్స్ ఒక్కొక్కరుగా వచ్చి బోనస్ లు తీసుకుని సీతారామయ్య, రాజ్‌ లకు పండుగ విషెస్‌ చెప్పి వెళ్లిపోతుంటారు. చివరిలో చెక్‌ మీద రాజ్‌ మేనేజర్‌ అని ఉంటుంది. అది చూసి కావ్య షాక్‌ అవుతుంది. ఆ కవర్‌ ఎవరిదో వాళ్లకు ఇవ్వు కావ్య అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య రాజ్‌ దగ్గరకు వెళ్తుంది. ఎవరిది ఆ కవర్‌ అని అడుగుతాడు. దీని మీద రాజ్‌ మేనేజర్‌ అని ఉంది అంటుంది కావ్య. రాజ్‌ కోపంతో అందరిని చూస్తాడు. తర్వాత బోనస్‌ తీసుకున్న రాజ్‌. సీఈవో గారికి చైర్మన్‌ గారి మనవడిగా నేను బోనస్‌ ఇస్తాను అని తనకు ఇచ్చిన బోనస్‌ తిరిగి కావ్యకు ఇచ్చి వెళ్లిపోతాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత రుద్రాణి ఇరిటేటింగ్‌ గా అనామికకు ఫోన్‌ చేసి ఇంకా బాంబు పేలలేదేంటి? అని అడుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి అని చెప్తుంది అనామిక. అపర్ణ, ఇందిరాదేవి కలిసి రాజ్‌ను ఇరిటేషన్‌కు గురి చేస్తుంటారు.

అపర్ణ: కావ్యతో పెట్టుకుని ఇప్పుడు మేనేజర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది.

ఇందిర: అందుకే కదా అపర్ణ మన పెద్దవాళ్లు అనేది ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని.

రాజ్‌: కడుపు నిండా తిన్నారు కదా… అది అరిగే వరకు నా గురించే మాట్లాడుకోవాలా..?  వెళ్లండి ఇక్కడి నుంచి.. ఎక్కడికి వెళ్లింది కనిపించడం లేదు.

కావ్య: ఏవండి నేనేమైనా హీరోనా..? మీ నడుము పట్టుకుని ఇలా ఉండటానికి. లేవండి.

రాజ్‌: అయినా వెళ్లిపోయావు కదా? మళ్లీ ఎందుకు వచ్చావు.

కావ్య: నన్ను పిలిచింది అమ్మమ్మ తాతయ్య వాళ్లకు చెప్పే వెళ్లిపోతా..?

రాజ్‌: అయితే చెప్పే వెళ్లు

అని రాజ్‌ చెప్పగానే సరేనని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య వచ్చి ఇందిరాదేవికి తాను వెళ్లిపోతున్నానని చెప్తుంది.  రాజ్‌ త్వరగా వెళ్లమ్మ  అంటాడు దీంతో అందరూ కలిసి రాజ్‌ మీద సెటైర్లు వేస్తారు. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇందిరాదేవి ముగ్గురు కోడళ్లకు మేము దీపావళి కానుక ఇవ్వాలనుకున్నాం కదా? అది ఇవ్వకుండా ఎలా పంపిస్తాము అంటుంది. ఇంతలో అపర్ణ వెళ్లి గిఫ్టులు తీసుకొచ్చి ఇస్తుంది. అవి హారాలు ఎవరి భార్య మెడలో వాళ్లు వేయాలి అని చెప్తుంది ఇందిరాదేవి. నేను వేయనని రాజ్‌ వెళ్లిపోతుంటే కావ్య, రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget