అన్వేషించండి

Brahmamudi Serial Today November 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌ అయిన రాహుల్‌ - కోపంతో కొట్టిన రుద్రాణి  

Brahmamudi serial today episode November 7th: ఇంటికి తిరిగి వచ్చిన రాహుల్‌ను స్వప్న ఇంట్లోకి రావొద్దని తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: రాహుల్‌, కూయిలీకి బుద్ది చెప్పిన తర్వాత కూయిలీ ఎలాంటిదో తెలిసింది కదా రాహుల్‌ ఇక ఇక్కడే ఉండి కూయిలీకి సేవలు చేస్తావో తిరిగి ఇంటికి వస్తావో తేల్చుకో అని చెప్తారు రాజ్‌, కావ్య.

రాజ్‌: ఒకవేళ కూయిలీని పెళ్లి చేసుకుంటే నీకు ఆస్థిలో చిల్లిగవ్వ కూడా రాదు.

కావ్య: ఇక మనం ఇక్కడ ఒక్క క్షణ కూడా ఉండొద్దు వెళ్దాం పదండి..

ముగ్గురూ అక్కడి నుంచి బయటకు వెళ్లి కారు దగ్గర నిలబడి నవ్వుకుంటారు.

రాజ్‌: మొత్తానికి మనం అనుకున్న పని సాధించాం..

గోల్డ్‌ బాబు: మనం ఇచ్చిన స్ట్రోక్‌ అలాంటిది. ఇప్పటికైనా నమ్ముతావా..? యాక్టింగ్‌ లో మనం కింగ్‌ అని ఇంకా ఎందుకు ఈ వేషాలు తీసేయండి

రాజ్‌, కావ్య వేషం తీసేస్తారు. చాటు నుంచి రంజిత్‌ అంతా చూస్తుంటాడు.

కావ్య: మనం ఎంత చేసినా కూయిలీ మళ్లీ రాహుల్‌ను మ్యానికులేట్‌ చేస్తుందేమో.. ఏడ్చి ఏదైనా మాయమాటలు చెప్తుందేమో..?

రాజ్‌: ఇన్ని రోజుల నుంచి రాహుల్‌ ను చూశావు వాడికి డబ్బు కన్నా వేరే ఏదీ ఎక్కువ కాదు.. వాడి ఇక ఇంటికి వస్తాడు మనం వెళ్దాం పద

అనుకుని ముగ్గురు వెళ్లిపోతారు.

రంజిత్‌: అంటే వీళ్లందరూ కలిసి నాటకం ఆడి రాహుల్‌ ను తీసుకెళ్లడానికి వచ్చారా..? అసలు ఇప్పుడు కూయిలీ పరిస్థితి ఏంటో..?

ఇంట్లో రాహుల్‌, కూయిలీ గొడవ పడుతుంటారు.. రాహుల్‌ కూయిలీని కొడతాడు.

రాహుల్‌: ఎంతకు తెగించావే..

కూయిలీ: రాహుల్‌ నేను చెప్పేది విను రాహుల్‌..

రాహుల్‌: ఏంటో నువ్వు చెప్పేది.. నేను వినేది.. నేను అంటే ఇష్టం అన్నావు విన్నాను.. నాతోనే లైఫ్‌ అన్నాను నమ్మాను.. నా పెళ్లానికి విడాకులు ఇవ్వమన్నావు.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నావు.. ఇప్పుడు ఎవడో ఒకడు రాగానే.. చీ..

కూయిలీ: రాహుల్‌ నువ్వు అనవసరంగా నామీద అనుమానపడుతున్నావు.. నీకు తెలిసిందంతా నిజం కాదు అంతా అబద్దం..

రాహుల్‌: ఏదీ అబద్దం నీ దగ్గర కోట్ల ఆస్థి ఉందన్నది అబద్దం.. మనం పెళ్లి చేసుకుంటే లైఫంతా సుఖంగా ఉండొచ్చన్నది అబద్దం.. కానీ నన్ను వాడుకోవాలనుకుంది మాత్రం నిజం. నన్ను వెర్రి వాణ్ని చేయాలనుకున్నది మాత్రం నిజం.. నా దగ్గర కోట్లు ఉన్నాయని నమ్మి నన్ను వలలో వేసుకుంది నిజం. కానీ నాకన్నా మించిన వాడు దుబాయ్‌ నుంచి వచ్చిన వాడు నీకు దొరకగానే వాడి దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి.. వాడికి లొంగిపోయావు.. నన్ను కాదని వాడితో కులకడానికి సిద్ద పడ్డావు.. నువ్వు బజారు దానికన్నా హీనం

కూయిలీ: రేయ్‌ ఏంట్రా ఏంటి రెచ్చిపోతున్నావు.. ఏంటి..? నేను బజారు దాన్ని అయితే మరి నా డబ్బు కోసం ఆశ పడ్డ నిన్ను ఏమనాలిరా..?

రాహుల్‌: ఓసేయ్‌ నేను నీలా కాదే.. నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను..కానీ నువ్వు మొగుడు పక్కన ఉండగానే..  వాణ్ని మామయ్య అంటూ వాడు పక్కన ఉండగానే.. నన్ను ఎంటర్‌టైన్‌ చేస్తూ.. మళ్లీ నేను పక్కన ఉండగానే.. ఇంకొకడితో ఎటర్‌టైన్‌ చేస్తున్నావు.. అలాంటి నీకు ఇంకో కొత్త పేరు పెట్టాలి

కూయిలీ: అవునురా నేను నిన్ను కావాలనే ట్రాప్‌ చేయాలనుకున్నాను.. నీ పెళ్లానికి నీ చేత్తో విడాకులు ఇప్పించి నీ ఆస్థిని కొట్టేయాలనుకున్నాను.. కానీ నిన్ను మించిన గోల్డ్‌ బాబు బంగారు బిస్కెట్స్‌ తో నాకు తగిలాడు.. వాడిని పడగొట్టాను.. అయితే ఏంట్రా ఏం చేయగలవు

అంటూ తిట్టగానే.. రాహుల్‌ కోపంతో కూయిలీని కొడతాడు. కూయిలీ కింద పడిపోతుంది. అంతా చాటు నుంచి రంజిత్‌ వీడియో తీస్తుంటాడు. అక్కడి నుంచి రాహుల్‌ వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చిన రాహుల్‌ను స్వప్న తిడుతుంది. అందరూ సర్ది చెప్పగానే.. ఊరుకుంటుంది. తర్వాత రాహుల్‌ను రుద్రాణి కొట్టి ఇక నుంచి  నేను చెప్పినట్టు నడుచుకో అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget