అన్వేషించండి

Brahmamudi Serial Today November 19th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:    కావ్య డిజైన్స్‌ కొట్టేసిన రాజ్‌ - ధాన్యలక్ష్మీకి వార్నింగ్‌ ఇచ్చిన సీతారామయ్య

Brahmamudi Today Episode:  కావ్య వేసిన డిజైన్స్‌ చాంబర్‌ లోకి వెళ్లి రాజ్‌ ఫోటో తీసుకుని వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:   కావ్య వేసిన డిజైన్స్‌ ను శృతి ఇంటికి తీసుకెళ్తానని అంటే ఇక్కడే ఉంటే సేఫ్‌గా ఉంటాయని ఇంటికి తీసుకెళితే ఎక్కడైనా పడిపోతే ఇబ్బంది వస్తుందని ఆఫీసులో ఉండనని చెప్పి బయటకు వచ్చి రాజ్‌ ఉన్నాడా..? లేడా అని చూసి వెళ్లిపోయాడు అనుకుని కావ్య, శృతి మాట్లాడుకుంట వెళ్లిపోతారు. బయట నుంచి చూస్తున్న రాజ్‌ పక్కకు వెళ్లి దాక్కుని కావ్య వెళ్లిపోయాక కావ్య చాంబర్‌ లోకి వెళ్లి డిజైన్స్‌ చూసి చాలా బాగున్నాయి అని ఫోటో తీసుకుంటాడు. ఇంతలో కావ్య హ్యాండ్‌ బ్యాగ్‌ మర్చిపోయానని వెనక్కి చాంబర్‌ లోకి వస్తుంది. రాజ్‌ టేబుల్‌ కింద దాక్కుంటాడు.

శృతి: ఏంటి మేడం ఏమైంది.

కావ్య: ఇక్కడికి ఎవరో వచ్చారు.

శృతి: ఎలా చెప్తున్నారు మేడం.

కావ్య: ఈ డిజైన్స్‌ ఇందాక నా వైపు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వైపు ఉన్నాయేంటి..?

శృతి: అవును మేడం మీరు చెప్తుంది నిజమే.. కొంపదీసి మన ఆఫీసులో దెయ్యాలు ఉన్నాయా…?

కావ్య: నీ బొంద మనం వెళ్లాక ఎవరో వచ్చి వెళ్లారు అనుకుంట.

శృతి: కొంపదీసి రాజ్‌ సార్‌ వచ్చారా..?

కావ్య: ఆయన ఎందుకు వస్తారులే..?

శృతి: ఏమో మేడం ఎవరికి తెలుసు. ఆయన వేసిన డిజైన్స్‌ కంటే ముందు మీరు వేసిన డిజైన్స్‌ చూడాలనుకోవచ్చు కదా..? మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకోవచ్చు కదా..?

కావ్య: ఆయన ఒక కోపిష్టి, ఆయన ఒక ఈగో పర్సన్‌. కానీ ఆయన మోసం చేసేంత చెడ్డవారు మాత్రం కాదు. ఆయనకు మాత్రం ఒక క్యారెక్టర్‌ ఉంది.

అంటూ కావ్య పొగడగానే శృతి కన్పీజ్‌ గా ఆయన ఉన్నప్పుడు తిడతారు. లేప్పుడు ఆయన మీద మాట కూడా పడనివ్వరు అంటుంది. సరేలే పద వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. టేబుల్‌ కింద దాక్కున్న రాజ్‌ బయటకు వచ్చి మిగతా డిజైన్స్‌ ఫోటో తీసుకుంటాడు. మరోవైపు ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే ధాన్యలక్ష్మీ వచ్చి తనకు సెపరేట్‌ గా చేసుకున్న భోజనం తెచ్చుకుని తింటుంది.

స్వప్న: అదేంటి శాంత చికెన్‌ చేసి కూడా నాకు వేయలేదేంటి..?

శాంత: అది నేను చేయలేదమ్మా..?

స్వప్న: ఎవరు చేస్తేం తినడానికే కదా..?

ఇందిర: నీకింకా అర్థం కాలేదా..? ఆవిడ గారు వంటిట్లో వేరు కుంపటి పెట్టింది.

రుద్రాణి: ధాన్యలక్ష్మీ బాధ మీ అందరికి అంత వెటకారం అయిపోయిందా..? తను ఎందుకు చేస్తుందో తెలిసి కూడా దాన్ని పరిష్కరించకుండా.. ఇలా దెప్పి పొడవడం పెద్దరికం అనిపించుకోదు.

ధాన్యలక్ష్మీ: నా కొడుక్కి అవమానం జరుగుతుంటేనే పట్టించుకోని మామయ్యగారు ఇప్పుడు పట్టించుకుంటారా..?

ప్రకాష్‌: నువ్వు అడిగింది బ్రెడ్‌ ముక్క అనుకుంటున్నావా..? చూడు ధాన్యం ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు అయినా నేను అయినా.. ఈ ఇంట్లో ఎ ఒక్కరైనా దుగ్గిరాల ఇంట్లో మనిషిగా ఉన్నంత కాలమే మనకు విలువ ఉంటుంది.

రుద్రాణి: అన్నయ్య అన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవేంటి నాన్నా..? ధాన్యలక్ష్మీ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు.

సీతారామయ్య: నా కోడలు వంట చేసుకునే విషయంలో పాత్రలు ఏమైనా సరిపోకపోతే కొత్తవి నువ్వే తీసుకొచ్చి ఇవ్వు.

అని చెప్పి సీతారామయ్యా వెళ్లిపోతాడు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ తప్పా అందరూ ముసిముసి నవ్వు  నవ్వుతారు. ప్రకాష్‌ మాత్రం నేను తీసుకొచ్చి ఇస్తాను నాన్నా అంటాడు. ధాన్యలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌ బెడ్‌ రూంలో కూర్చుని కావ్య వేసిన డిజైన్స్‌ ను రిక్రియేట్‌ చేయాలని అనుకుంటాడు. ఇంతలో రాజ్‌ రూంలోకి వస్తాడు సీతారామయ్య. ఏం చేస్తున్నావని అడుగుతాడు. డిజైన్స్‌ గురించే అని చెప్తాడు. సరేనని సీతారామయ్య వెళ్లిపోతాడు. రాజ్‌ కావ్యను ఆఫీసుకు తీసుకొచ్చే ఆటో డ్రైవర్‌కు ఫోన్‌ చేసి రేపు కావ్యను ఆఫీసుకు లేటుగా తీసుకురమ్మని చెప్తాడు. వినయపోతే భయపెడతాడు. మరుసటి రోజు ఉదయం కనకం పూజ చేస్తుంది. కావ్య ఆఫీసుకు వెళ్తుంది.

కావ్య: ఏంటి నాన్నా ఇది అమ్మ ఏంటి ఇంత పొద్దున్నే పూజలు చేస్తుంది.

కనకం: చాల్లే నోరు మూయవే.. ఏంటా మాటలు.. శుభమాని పందెంలో గెలవడానికి వెళ్తూ ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతావేంటి..? హారతి తీసుకో.

కావ్య: అమ్మా నేను డిజైన్స్‌ వేయడానికి వాడిన స్కెచ్‌ లు తీసుకొచ్చి పూజ చేస్తున్నావేంటి..?

కనకం: నువ్వు డిజైన్స్‌ వేయడానికి వాడిన ఆయుధాలు అవి. అందుకే ఆయుధ పూజ చేస్తున్నా..

అని కనకం చెప్పగానే కావ్య, మూర్తి షాక్‌ అవుతారు. కావ్య టైం అవుతుందని బయటకు వెళ్తుంది. బయట ఆటో డ్రైవర్‌ రాజ్‌ మాటలు గుర్తు చేసుకుని ఏదేదో మాట్లాడుతుంటే కావ్య తిడుతూ ముందు ఆఫీసుకు వెళ్లాలి ఆటో స్టార్ట్ చేయ్‌ అంటుంది. సరేనని ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతారు. మరోవైపు అపర్ణ టెన్షన్‌ పడుతుంటే.. ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నావని ఇందిర అడుగుతుంది. పందెం గురించి చెప్పి ఎవరు గెలుస్తారని గాబరాగా ఉంది అంటుంది. దీంతో   ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget