అన్వేషించండి

Brahmamudi Serial Today May 9th : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : ఇంట్లోంచి తానే వెళ్లిపోతానన్న అపర్ణ – అపర్ణను తిట్టిన సుభాష్‌ - భర్త వెంటే తాను వెళ్తానన్న కావ్య

Brahmamudi Today Episode: రాజ్ నిజం చెప్పకపోతే ఇంట్లోంచి తానే వెళ్లిపోతానని అపర్ణ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode : రేపటిలోగా నిజం తెలియకపోతే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని రుద్రాణి బెదిరిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ప్రకాశం కల్పించుకుని తనకు మొదటి నుంచి మరిచిపోయే జబ్బు ఉందని.. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోతే నిన్ను మర్చిపోవడం నావల్ల కాదని బాధపడతాడు. అమ్మ ఇచ్చే ఆఖరి చాన్స్‌ వదులుకోవద్దని బతిమాలుతాడు. ఇంతలో అపర్ణ నిజం చెప్పు అని ఆ బిడ్డను ఈ ఇంటికి వారసుణ్ని చేయాలని ఉందా? ఆ బిడ్డ తల్లిని నీ భార్యగా తీసుకురావాలని ఉందా? చెప్పు అని అడుగుతుంది.

స్వప్న: ఏంటి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? మీ పెద్దరికానికి చెదలు పట్టిందా ఏంటి? సంవత్సరం నుంచి మీరు మా అత్త మీ తోడికోడలు, ఆవిడ గారి కోడలు ఎన్ని మాటలు అన్నా.. ఎంత అవమానించినా.. కావ్య ఓపికగా  ఉన్నందుకు  ఇదా మీరిచ్చే బహుమానం.

అపర్ణ: స్వప్న ఇది మా కుటుంబ సమస్యా?

ఇందిరాదేవి: ఏ కుంటుంబ సమస్య.. ఏ సమస్యా?

అపర్ణ: మన కుటుంబ సమస్యా..

 ఇందిరా: సమస్య ఎవరు లేవనెత్తారు. ఎవరు పెద్దది చేస్తున్నారు. ఈ కుటుంబం అంతా కలిసి వాడిని వెలివేయమని చెప్పామా?  నీలా ఏకపక్ష నిర్ణయాలు మాత్రం అమలు చేయమని చెప్పామా?

ప్రకాశం: వదిన మేం అందరం మీ మాటకు కట్టుబడతాం. ఒకవిధంగా  భయపడతాం కూడా మీరంటే గౌరవం. కానీ రాజ్‌ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఒక తల్లిగా తీసుకోవడం లేదు. రాజ్‌ ను బయటకు పంపించడం మాకు నచ్చడం లేదు.

అనగానే కళ్యాణ్‌ కూడా అపర్ణను ఎందుకింత పంతానికి పోతున్నారు అంటూ అడుగుతాడు. ఇక భర్తలేని ఇంట్లో ఏ ఆడది ఉండదని తప్పో ఒప్పో ఆయనతో పాటు నేను కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని కావ్య చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. సుభాష్‌, ఇందిరా దేవి కావ్య నిర్ణయాన్ని చాలా గొప్పదిగా చెప్తారు. గొప్ప భార్యగా చరిత్రలో నిలిచిపోతావని కావ్యను మెచ్చుకుంటారు. కడుపులోంచి బయటకు తీసుకొచ్చిన బిడ్డనే వెళ్లగొట్టాలని చూస్తున్న నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావని అపర్ణను అంటారు. దీంతో అపర్ణ రాజ్‌ విషయంలో నేను నిర్ణయం తీసుకునే హక్కు లేకపోతే.. నా విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకే ఉంటుందని రేపు ఉదయం లోగా రాజ్‌ నిజం చెప్పకపోతే ఈ ఇంటి పెద్ద కోడలు ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. అంటూ కోపంగా చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. బెడ్‌రూంలోకి వెళ్లిన సుభాష్‌, అపర్ణను ఓదారుస్తాడు. రాజ్‌ విషయంలో రోజురోజకు మొండిగా తయారవుతున్నావని చెప్తాడు.

అపర్ణ: ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది. ఇన్నేళ్ల కాపురంలో నా గురించే ఇంతేనా మీరు తెలుసుకున్నది.

సుభాష్‌: జరిగినవన్నీ చూస్తూ ఎవరైనా ఇంకెలా అర్థం చేసుకుంటారు. ఇంతకంటే ఇంకేం తెలుసుకుంటారు.

అపర్ణ: అమ్మ ఎప్పుడూ అమ్మే నండి కొడుకు ఉన్నతంగా బతకాలని కోరుకుంటుంది. కానీ వాడి పతనం ఎప్పటికీ కోరుకోదు.

సుభాష్‌: ఈ మాట ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ వాడు ఆ బిడ్డను తెచ్చినప్పటి నుంచి ఎలా మాట్లాడుతున్నావో చూస్తూనే ఉన్నాను.

ఇవన్నీ ఒక అమ్మగానే చేశానని అపర్ణ బాధపడుతుంది. ఇవన్నీ చేస్తేనైనా వాడు నోరు తెరుస్తాడని చేశానని అపర్ణ చెప్తుంది. వాడు నా నిర్ణయాలకు భయపడి నిజం చెప్తాడనుకుంటే తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉండిపోయాడు. నా కోపం ఒక తెర మాత్రమేనని ఆ తెర వెనక ఒక అమ్మ ఉంది అని బాధపడుతుంది. ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పేవరకు నేనిలాగే ఉంటానని చెప్పడంతో ఒకవేళ ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్తే అని సుభాష్ అడగడంతో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఏకమైనా ఆ బిడ్డ తల్లితో రాజ్‌ పెళ్లి చేస్తానని అపర్ణ చెప్పడంతో సుభాష్‌ షాక్‌ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఒకప్పటి స్టార్‌ కమెడియన్‌, ఇప్పుడిలా! - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ నటుడు..

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget