అన్వేషించండి

Brahmamudi Serial Today March 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : యామిని లవ్‌లో పడిపోయిన రాజ్‌ – అనుమానించిన రుద్రాణి

Brahmamudi Today Episode: యామిని, రాజ్‌ ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో రాజ్, యామిని లవ్‌లో పడిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.          

Brahmamudi Serial Today Episode: రూంలో పడుకుని ఉన్న రాజ్‌కు యామిని వాయిస్‌ మెసేజ్‌ చేస్తుంది. రాజ్‌ మెసేజ్‌ విని షాక్‌ అవుతాడు. యామిని గొంతులా ఉందే అని అనుమానిస్తాడు. ఇంతలో మరో మెసేజ్‌ వస్తుంది. అందులో నీకో సర్‌ప్రైజ్‌ అని మీ ఇంట్లో హాల్లో ఉంది వెళ్లి చూడు అని చెప్తుంది. రాజ్‌ కంగారు హాల్లోకి వెళ్లి చూడగా అక్కడ ఫోటోలు ఉంటాయి. రాజ్‌ ఫోటోలన్నీ ఏరుతుంటాడు. ఇంతలో రూంలోంచి సుభాష్‌ వస్తాడు. సుభాష్‌ వచ్చే సరికి అంతా క్లీన్‌ చేసి సోఫా కింద పెట్టి కూర్చుంటాడు. ఇంతలో ఒక్కోక్కరుగా వస్తుంటారు.

సుభాష్: ఓరేయ్‌ కొంచెం అటు జరగరా..?

రాజ్: మీరే ఇటొచ్చి కూర్చోండి డాడీ..?

సుభాష్‌: అటు జరగరా అంటే నన్ను అటు రమ్మంటావేంట్రా..?

కావ్య: ఏవండి ముందే లేచి వచ్చారేంటి..?

రాజ్:  మెలుకువ వచ్చింది అందుకే వచ్చాను

కావ్య: రాత్రి సరిగ్గా నిద్రపోయినట్టు లేదు.. కాసేపు పడుకోలేకపోయారా..?

రాజ్‌:  మళ్లీ నిద్ర వస్తే పడుకుంటాలే

సుభాష్‌:  కాస్త అటు జరగరా..?

రాజ్‌: నేను జరగలేను డాడీ పక్కన కూర్చోండి

రుద్రాణి:  ఏమైంది రాజ్‌

రాజ్: బ్యాక్‌ పెయిన్‌ అత్తా.. ప్రతిదీ నీకు చెప్పాలి.. ప్రతి దాంట్లో తల దూరుస్తావు.

అని రాజ్‌ చెప్తుండగానే ఇందిరాదేవి కావ్యను కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. సుభాష్‌కు అటువైపు కూర్చో వాడికి పెయిన్‌ గా ఉందట అని చెప్పగానే సుభాష్‌ పక్కకు వెళ్లిపోతాడు. కిచెన్‌ లో కూడా ఫోటోలు ఉన్నాయని యామిని మెసేజ్‌ చేస్తుంది. రాజ్‌ కంగారుగా గట్టిగా కళావతి అని పిలుస్తాడు. ఆ సౌండ్‌ కు అందరూ ఉలిక్కిపడతారు. కావ్య పరుగున రాజ్‌ దగ్గరకు వస్తుంది.

కావ్య: ఏవండి ఏమైంది నొప్పి ఎక్కువ అవుతుందా..?

రాజ్: నా ఫోన్‌ పైన మర్చిపోయాను.. కాస్త తీసుకొస్తావా..?

అని చెప్పగానే.. కావ్య ఫోన్‌ కోసం పైకి వెళ్తుంది. రాజ్‌ కిచెన్‌ లోకి వెళ్లి ఫోటోలు తీసుకుని హాల్లోకి వస్తుంటే మళ్లీ మెసేజ్‌ వస్తుంది. మెసేజ్‌ చదువుతే రాజ్‌ రావడం చూసిన కావ్య మీ ఫోన్‌ మీ దగ్గరే పెట్టుకుని నన్ను పైకి పంపిస్తారా..? అని అడుగుతుంది. మర్చిపోయానని రాజ్‌ చెప్తాడు. తర్వాత రాజ్‌ హాస్పిటల్‌కు ఫోన్‌ చేస్తాడు.

రాజ్: మీ హాస్పిటల్ లో  డ్రగ్‌ అడిక్ట్‌ అయిన పేషెంట్‌ యామిని ఉన్నారా..?

ఫోన్‌లో వ్యక్తి: లేరు సార్‌  రెండు రోజుల క్రితమే డిష్చార్జ్‌ అయి వెళ్లిపోయారు. మీరు స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్త్ర్టీస్‌ ఎండీ రాజ్‌ కదూ..?

రాజ్‌: అవును మీకెలా తెలుసు..?

ఫోన్‌లో వ్యక్తి: యామిని గారే చెప్పారు సార్‌. మీరు ఫోన్‌ చేస్తారని.. మీకు తన అడ్రస్‌ ఇవ్వమని చెప్పారు. ఈ నెంబర్‌కు అడ్రస్‌ మెసేజ్‌ చేస్తాను సార్‌.

అని ఫోన్‌ కట్‌ చేసి అడ్రస్‌ సెండ్‌ చేస్తాడు. అడ్రస్‌ చూసిన రాజ్‌ కారులో వెళ్తూ.. యామినితో తనకున్న పరిచయాన్ని, ప్రేమను గుర్తు చేసుకుంటాడు. తన లవ్‌ చేసిన తర్వాత యామిని ఎలా శాడిస్ట్‌గా మారిపోయింది. ఎలా డ్రగ్స్‌ కు అలవాటు అయింది మొత్తం రాజ్‌ గుర్తు చేసుకుంటూ వెళ్తుంటాడు. తర్వాత తన ఫ్రెండ్‌ మీద యామిని యాసిడ్‌ దాడి చేయడం రాజ్‌ తిట్టి యామినిని దూరం పెట్టడం మళ్లీ యామిని రాజ్‌ కోసం హాస్టల్‌కు వెళ్లి సూసైడ్‌ అటెంఫ్ట్‌ చేసుకోవడం అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
Godavari Serial Today May 23rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
Nindu Noorella Saavasam Serial Today May 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget