అన్వేషించండి

Brahmamudi Serial Today May June 16th: ప్లేట్‌ ఫిరాయించిన పంతులు – రాజ్ కు నిజం చెప్పిన కనకం

Brahmamudi Today Episode: పెళ్లి ఆపేందుకు కనకం చేసిన ప్రయత్నం బెడిసికొడుతుంది. పంతులు ప్లేట్‌ ఫిరాయిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: దుర్గమ్మ పూజ చేస్తుంటారు. పూజ అయిపోవచ్చింది కాబట్టి యామినిని అమ్మవారికి హారతి ఇవ్వమని చెప్తాడు పంతులు. అలాగే అపర్ణ, కనకం, ఇంద్రాదేవిలన తమ ప్లాన్‌ ప్రకారం అలర్ట్‌గా ఉండమని పంతులు ఇన్‌డైరెక్టుగా హెచ్చరిస్తాడు. ఇంతలో యామిని హారతి ఇస్తుంది. ప్లాన్‌ ప్రకారం కనకం వెళ్లి ఫ్యాన్‌ వేస్తుంది. కానీ అది తిరగదు. దీంతో అందరూ కంగారు పడుతుంటారు.

పంతులు: అమ్మా అందరూ హారతి చూస్తూ దండం పెట్టుకోండి మనసులో ఉన్న కోరికలు అన్ని కోరుకోండి. ఈ పెళ్లి నిర్వీగ్నంగా జరగాలని ఎవరి వల్ల ఆటంకం కలగకూడదని మనసులో ఉన్నవన్నీ కోరుకోండి

యామిని హారతి పూర్తి చేస్తుంది. అమ్మవారి ముందు పెట్టబోతుంటే..

పంతులు: అమ్మా నీ పాటికి నువ్వు అలా హారతి కింద పెట్టేస్తే మా పరిస్థితి ఏంటి.?

యామిని:  మీరు చెప్పినట్టే మూడు సార్లు హారతి ఇచ్చాను కదా శాస్త్రి గారు.

పంతులు: లేదమ్మా జరిగిన విఘ్నాలన్నీ పోవాలంటే మరో మూడు సార్లు హారతి ఇవ్వాలి

యామిని:  సరే శాస్త్రి గారు

మళ్లీ హారతి ఇస్తుంటే ఈసారి ఫ్యాన్‌ ఆన్‌ అవుతుంది. హారతి ఆరిపోతుంది. అందరూ ఉలిక్కిపడతారు.

ఇందిరాదేవి: శాస్త్రి గారు హారతి ఆరిపోయింది.

పంతులు: కనిపించిందమ్మా..

ఇందిరాదేవి: మరి ఏదో ఒకటి చెప్పండి

పంతులు: చెప్తానమ్మా కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వండి

అపర్ణ:  అక్కడేమో కర్ర విరిగిపోయింది. ఇక్కడేమో హారతి ఆరిపోయింది. ఏంటో ఇదంతా విడ్డూరంగా ఉంది

ఇందిరాదేవి: ఏంటి ముత్తుయిదవులు ఏమీ మాట్లాడరేమీ

ముత్తయిదువులు: అయ్యయ్యో అపశకునం.. ఈ పెళ్లి జరగకూడదు. ఆపేయండి

ఇందిరాదేవి: ఒకటి జరిగితే పొరపాటున జరిగింది అనుకోవచ్చు పదే పదే ఇలానే జరుగుతుంటే ఏదో దోషం ఉన్నట్టేగా

వైదేహి:  ఏంటి పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం

పంతులు:  అమ్మా నా శాయశక్తులా నేను ప్రయత్నించాను.  కానీ ఎన్ని చేసినా ఆ అమ్మవారికి కూడా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటాను. అందుకే ఈ విఘ్నాలన్నీ జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇంక ఇంతకంటే మనం ముందుకు వెళ్లడం సరికాదమ్మా ఈ పెళ్లి ఇక్కడితో ఆపేయడం వధూవరులకు ఇద్దరికీ మంచిది.

వైదేహి: ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు ఇంత దూరం వచ్చాక పెళ్లి ఆపేయడం ఏంటి..?

పంతులు:  అవునమ్మా ఇప్పుడే ఇక్కడే ఆపేస్తే వాళ్లిద్దరి ప్రాణాలకు క్షేమం. అపర్ణ గారు చెప్పింది కూడా నిజమే రామ్‌ గారికి యాక్సిడెంట్‌ అవ్వడానికి కూడా వాళ్లిద్దరి నిశ్చితార్థమే కారణం.

ఇందిరాదేవి: హమ్మయ్యా అమ్మవారే ఈ పెళ్లిని ఆపేసింది ఇక నా మనవణ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు (మనసులో అనుకుంటుంది.)

పంతులు: అని అంటాను అనుకుంటున్నారా..? అమ్మా అలా ఎప్పటికీ ఈ శాస్త్రి అనడు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆపేయాలి.

పంతులు మాటలకు అపర్ణ, కనకం, ఇందిరాదేవి షాక్‌ అవుతారు.

వైదేహి: ఏం మాట్లాడతున్నారు శాస్త్రి గారు ఇప్పటి వరకు ఆపేయాలి అంటే..

పంతులు: అవునమ్మా ఆపేయాలి కానీ శాశ్వతంగా కాదు తాత్కాలికంగా మాత్రమే

యామిని:  ఏమంటున్నారు శాస్త్రి గారు  తాత్కాలికంగా ఆపడం ఏంటి..?

పంతులు: అవునమ్మా..? మీరు జరిపించిన నిశ్చితార్థం ముహూర్తంలోనే  సమస్య ఉంది. అందుకే అక్కడి నుంచే మీకు ఇటువంటి అరిష్టాలు జరుగుతున్నాయి. అందుకే నేను మంచి పరిష్కారం ఆలోచించాను.

వైదేహి: ఏంటో చెప్పండి శాస్త్రి గారు

పంతులు: ఏం లేదమ్మా..? వధూవరులిద్దరికీ ఈరోజు మంచి ముహూర్తం చూసి మళ్లీ నిశ్చితార్థం జరిపించి.. తర్వాత తిరిగి మళ్లీ పెళ్లికి ముహూర్తం పెడతాను. అప్పుడు వారి పెళ్లికి ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి దోషాలు కానీ ఉండవు. ఆ తర్వాత ఎన్ని దుష్ట గ్రహాలు వచ్చినా ఈ పెళ్లి ఆపలేవు

అంటూ చెబుతూ యామిని వచ్చి ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలని లేదంటే చంపేస్తానని తనకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు పంతులు. యామిని: అమ్మమ్మగారు మళ్లీ పెళ్లికి కొత్తగా ముహూర్తం పెడతారట. ఇంక మీ మనవడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి ఇక మీకొచ్చిన అభ్యంతరం ఏమీ లేదు కదా… కళావతి గారు మీకు ఏమైనా అభ్యంతరం ఉదా..? శాస్త్రి గారు వెంటనే నిశ్చితార్ధం చేయడానికి ఏర్పాట్లు చేయండి

అంటూ యామిని చెప్పగానే పంతులు సరే అంటాడు. తర్వాత పెళ్లిని ఎలాగైనా ఆపేస్తానని కనకం రాజ్‌ మనసు మార్చేస్తానని అపర్ణ, ఇందిరాదేవిలకు చెప్పి రాజ్‌ దగ్గరకు వెళ్లి కావ్య నిన్నే ప్రేమిస్తుందని.. నిజం చెప్తుంది కనకం. రాజ్‌ కూడా అవునని తనకు ఆ విషయం తెలుసని కానీ ఇప్పుడేం చేయలేము కదా అంటూ ఎమోషనల్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget