అన్వేషించండి

Brahmamudi Serial Today January 31st:  ‘బ్రహ్మముడి’ సీరియల్: బిడ్డ  కోసం నాటకం మొదలుపెట్టిన కావ్య – సపోర్టుగా నిలబడ్డ రాజ్‌

Brahmamudi serial today episode January 31st: ధర్మేంద్ర నుంచి తమ బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలని కొత్త నాటకం మొదలుపెడుతుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: మినిస్టర్‌ ధర్మేంద్ర ఇంట్లోకి దొంగచాటుగా రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. లోపలికి వెళ్లి తులసి వాళ్ల బెడ్‌ రూం దగ్గరకు తీసుకెళ్తుంది. రూంలో తులసి పాపను ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే ధర్మేంద్ర అసహనంగా అక్కడికి వస్తాడు.

కావ్య: ఇప్పటికైనా నమ్మండి.. మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని మీరు కళ్లారా చూస్తే అయినా మీకు నమ్మకం కుదురుతుంది. ఒక తల్లి మనసు పడుతున్న ఆరాటం మీకు అర్థమవుతుంది

ధర్మేంద్ర: ఏంటి తులసి.. నా మాట వినిపించనంతగా ఆ పాపతోనే మునిగిపోయావా?

తులసి: ఏమండీ.. చిన్నపిల్ల ఏడుస్తుంటే అలా కసురుకుంటారేంటి? ఆ అరుపులకి పాప భయపడి లేస్తుంది..

ధర్మేంద్ర: పాప పుట్టినప్పటి నుంచి నువ్వు నన్ను మర్చిపోతున్నావు. నీ ప్రపంచం అంతా ఆ చంటిపిల్లే అయిపోయింది. కనీసం మొగుడికి ఏం కావాలో పట్టించుకోవడం లేదు

తులసి: మీ పనులు మీరు చేసుకోగలరు.. కానీ నా బిడ్డ పసిపాప. లేక లేక పుట్టిన బిడ్డ ఇది. ఈ బిడ్డే లేకపోయుంటే నేను అనే దానిని ఉండే దానిని కాదు. నా ప్రాణానికి ప్రాణమైన పాపని పనివాళ్లకు ఎలా అప్పగిస్తాను? ఆడదానికి బిడ్డ పుట్టే వరకే భర్త మీద ప్రేమ.. ఆ తర్వాత బిడ్డే సర్వస్వం.. అవును మొన్న గుడిలో కావ్య మన పాపని ఎత్తుకుంటే మీరెందుకు అంత విచిత్రంగా ప్రవర్తించారు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు పాపని లాగేసుకుని నన్ను అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చారు?

ధర్మేంద్ర: అది.. మన పాప పరాయివాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేక అలా చేశాను. అయినా ఆ కావ్య తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతోంది, నేను కూడా మనవాళ్లకి చెప్పాను.. వెతుకుతున్నారు.. పాప నిద్రపోయింది కదా మనం భోజనం చేద్దా పద తులసి

అని చెప్పగానే తులసి సరే అంటూ ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. వాళ్లు రాజ్‌, కావ్య రూంలోకి వెళ్తారు. కావ్య పాపను ఎత్తుకుని రాజ్‌కు చూపిస్తుంది.

కావ్య: చూశారా అండీ.. మన ఇంట్లో ఉండాల్సిన బిడ్డ ఇది. ఇదిగోండి.. పాప చేతి మీద ఉన్న ఈ పుట్టుమచ్చ చూడండి. ఇది మన రక్తం కాదని ఎలా అనగలరు?

రాజ్‌: అవును కళావతి అచ్చం నీలాగే ఉంది..

అప్పుడే  పాప ఏడుస్తుంది. ఆ ఏడుపులకు తులసి భోజనం వదిలేసి పరిగెత్తుకుంటూ రూంలోకి వస్తుంది. వెనకే ధర్మేంద్ర వస్తాడు. వాళ్లు రావడం గమనించిన కావ్య, రాజ్‌ చాటుగా దాక్కుంటారు.

ధర్మేంద్ర: నీకు పిచ్చి పట్టిందా తులసీ..? చిన్న పిల్లలు అన్న తర్వాత ఎవరైనా ఏడుస్తారు. కొంచెం ఉంటే మెట్లపై పడిపోయేదానివి

తులసి: నా పాపకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. చచ్చిపోతాను. పాప నా ప్రాణం.. రేపు పాపను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలి. నా పాలు పాపకు సరిపోవడంలేదు

అంటూ మాట్లాడుకుంటుంటే.. రాజ్‌, కావ్య మెల్లగా అక్కడి నుంచి వెల్లిపోతారు. కిందకు వెళ్లాక రాజ్‌, కావ్యకు సారీ చెప్తాడు. ఇప్పుడు సారీ కాదు మన బిడ్డను మనం ఎలా దక్కించుకోవాలో ఆలోచించాలి అని కావ్య చెప్తుంది. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను కళావతి అంటాడు రాజ్‌. రాజ్‌కు తన ప్లాన్‌ చెప్తుంది కావ్య. మరుసటి రోజు ఇంట్లో కావ్య నార్మల్‌గా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత కావ్య, రాజ్‌ పాపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడికి తులసి కూడా పాపను తీసుకుని వస్తుంది. కావ్య, డాక్టర్‌ అనురాధ కలిసి నాటకం ఆడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget