అన్వేషించండి

Brahmamudi Serial Today January 30th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ :  ఆస్థి కోసం మరింత దిగజారిన ధాన్యలక్ష్మీ – రాజ్‌కు షాక్‌ ఇచ్చిన కావ్య  

Brahmamudi Today Episode:  కళ్యాణ్‌ ఎంత చెప్పినా ధాన్యలక్ష్మీ వినదు. ఆస్థి కోసం మరింత రెచ్చిపోతుంది. దీంతో ఇవాళ్టీ  ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా  జరిగింది.       

Brahmamudi Serial Today Episode:  కళ్యాణ్‌ మరింత కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. మధ్యలో అడ్డొచ్చిన రుద్రాణిని తిడతాడు. ఇంత గొప్ప కుటుంబాన్ని నాకు మానసికంగా దూరం చేసే హక్కు మీకెవరు ఇచ్చారంటూ ప్రకాష్‌, ధాన్యలక్ష్మీని ప్రశ్నిస్తాడు. ఉమ్మడి కుటుంబం విచ్చినం కాకూడదనే తాతయ్య, నాన్నమ్మల ఆశీర్వాదం కావాలి. ఎవరు ఎవరి పిల్లలో తెలియనంతగా కలిసిపోయే వారసత్వం కావాలి నాకు అంటాడు కళ్యాణ్‌.

కళ్యాణ్‌: పెద్దమ్మను సొంత అక్కలా చూసుకునే నువ్వు.. నాన్నమ్మను అత్తలా కాకుండా అమ్మలా చూసుకునే నువ్వు.. తాతయ్యను మామలా కాకుండా నాన్నలా చూసుకునే నువ్వు ఆస్థి కోసం ఇంతలా దిగజారావా..?

ఇందిరాదేవి: నువ్వు ఇంత చెప్పినా వాళ్లు మారకుంటే అది వాళ్ల కర్మ. అయినా నువ్వు ఇవాళ నా కడుపు నిండే మాట చెప్పావురా..? నీ మనసు ఎంత స్వచ్చంగా ఉందో.. ఎంత నిర్మలంగా ఉందో. నీ మాటలు కూడా నాకు అంతే పవిత్రంగా కనబడుతున్నాయిరా… నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు నాయన.

ధాన్యలక్ష్మీ: నీకు అర్థం కావడం లేదురా..? మీ తాతయ్యా ఆస్థి మొత్తం ఈ అనామకురాలి చేతిలో పెడితే ఆస్తి మొత్తం ఎక్కడ దాచిపెడుతుందో.. గెస్ట్‌ హౌస్‌ తాకట్టు పెట్టింది. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టింది.

కళ్యాణ్‌: వదిన ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తుంది. వదిన తన పుట్టింటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. అయినా  వదిన ఏ  పని చేసినా అన్నయ్యకు తెలియకుండా చేయదు.

రాజ్‌: కళ్యాణ్‌ నువ్వు ఒక్కడివే మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నావురా..

కావ్య: కవిగారు కరెక్టు టైంలో వచ్చి ఈ ఇంట్లో ఏ అనర్థం జరగకుండా ఆపారు. మీరే కాదు ఈ ఇంట్లో అందరూ మమ్మల్ని అర్తం చేసుకునే టైం వస్తుంది. చిన్నత్తయ్యా, చిన్న మామయ్య మీరు చాలా బాధపడి ఉండొచ్చు.. కానీ మీరు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు. కానీ ఏదో ఒక రోజు మీ అందరికీ సమాధానం దొరుకుతుంది. మాకు మూడు నెలలు గడువు కావాలి. ఆ తర్వాత మీరు అడగకపోయినా అందరి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.

 కావ్య ఎంత చెప్పినా ధాన్యలక్ష్మీ వినకుండా కళ్యాణ్‌ను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆఫీసులో రాజ్‌ చాలా సీరియస్‌గా ఆలోచిస్తుంటాడు. కావ్య ఎంత పిలిచినా పలకడు.

కావ్య: హలో గురువుగారు

రాజ్‌: గురువు గారు ఏంటి కొత్తగా

కావ్య: నాకు ఈ వర్క్‌ అంతా నేర్పించారు కదా అందుకే మీరే నాకు గురువు అది సరే మీరు ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు.

రాజ్‌: అంతా నీవల్లే..

కావ్య:  నావల్లా.. నేనేం చేశాను

రాజ్‌: అసలు నిన్న కళ్యాణ్‌ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి..?

కావ్య:  కళ్యాణ్‌ వస్తాడని నాకు ముందే తెలుసు ఎందుకంటే నేనే రమ్మని చెప్పాను

అని కావ్య చెప్పగానే.. రాజ్‌ షాక్‌ అవుతాడు. ముందే నాకు చెప్తే బాగుండు కదా అంటాడు. ఇంకోసారి చెప్తానులేండి గురువు గారు అంటుంది కావ్య. మరోవైపు అపర్ణ టెన్షన్‌ పడుతుంది.

సుభాష్‌: ప్లాబ్లమ్‌ సాల్వ్‌ అయింది కదా ఇంకా ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు అపర్ణ.

అపర్ణ: ప్రాబ్లమ్‌ ఎక్కడ సాల్వ్‌ అయింది. మూడు నెలలు టైం కావాలని కావ్య అడిగింది. సమస్య ఇంకా పూర్తిగా పోలేదు

సుభాష్‌: నీకింకా కావ్య మీద కోపం పోలేదా..?

అపర్ణ: నాది కోపం కాదండి బాధ్యత. ఈ ఇంటి కోడలిగా అందరూ తనను నిందిస్తుంటే.. అత్తగారిలా చూస్తూ ఉండలేను కదా.? ఏదైనా తప్పు చేస్తే దండిచే హక్కు నాకుంది కదా..?

సుభాష్‌: అదే నేను కూడా అడుగుతున్నాను తప్పు చేస్తున్నారని ఎలా అనుకుంటావు.

అపర్ణ: అలా ఎలా సమర్థిస్తున్నారండి అసలు మనం ఎంత ప్రమాదం నుంచి బయట పడ్డామో మీకు తెలుస్తుందా..? ధాన్యలక్ష్మీ, ప్రకాషం కోర్టుకు వెళ్లి ఉంటే ఏం జరిగేదో కదా

అంటూ అపర్ణ భయం వ్యక్తం చేయగానే.. కావ్య ఉండగా అలాంటివే జరగవు.. నేను కావ్య, రాజ్‌లను పూర్తిగా నమ్ముతున్నాను మూడు నెలలు టైం అడిగారు కదా..? ఈ టైంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారు అని సుభాష్ చెప్పి నువ్వేం టెన్షన్‌ పడకు అంటాడు. మరోవైపు ఆఫీసులో కావ్య.. డిజైన్స్‌ విషయంలో రాజ్‌ను ఆటపట్టింస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Embed widget